కారు కొన‌డం క‌న్నా అద్దెకు తీసుకోడం మేలు !

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా ప్ర‌వేశ పెట్టిన స్క్రాప్‌ పాలసీతో పాత వాహ‌నాల‌కు కాలం చెల్లనుంది. ఈ విధానం ప్ర‌కారం కారు లోన్ తీసుకొని కొన‌డం క‌న్నా.. అద్దెకు తీసుకొంటేనే ఖ‌ర్చు త‌గ్గుతోందనే అభిప్రాయం వెలువ‌డుతోంది.

 • Share this:
  కేంద్ర ప్ర‌భుత్వం నూత‌నంగా  తుక్కువిధానం (స్క్రాప్ పాల‌సీ)ని ప్ర‌వేశ పెట్టింది. ఈ విధానం ప్ర‌కారం కమర్షియల్‌ వెహికల్స్‌కి 15 ఏళ్లు, ప్యాసింజర్‌ వెహికల్స్‌కి 20 ఏళ్లు దాటితే తుక్కుగా పరిగణిస్తారు. ఈ కాలపరిమితి దాటిన వాహనాల గుర్తింపు ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది.
  కారుకు ప్ర‌తీ ఎనిమిది సంవ‌త్స‌రాల‌కు ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఇందులో ఫైల్ అయితే కారు తిర‌గ‌డానికి అనుమ‌తి ఇవ్వ‌రు. పాస్ అయినా గ్రీన్ టాక్స్ కింది సుమారు 10 నుంచి 25 శాతం టాక్స్ రెన్యూవ‌ల్‌ స‌మ‌యంలో చెల్లించాల్సి వ‌స్తుంది. ఇది కూడా కేవ‌లం 5 సంవ‌త్స‌రాలు మాత్రమే వ‌ర్తిస్తుంది. దీంతో వాహ‌న నిర్వ‌హ‌ణ ఎంతో ఖ‌ర్చుతో కూడుకున్న‌దిగా మారుతోంది.
  కారు లీజింగ్ అంటే?
  ప‌లు కంపెనీలు కారు సుమారు 12 నుంచి 60 నెల‌ల పాటు అద్దెకు ఇస్తాయి. ముఖ్యంగా మ‌హీంద్ర అండ్ మ‌హీంద్రా, మారుతీ సుజికీ, హూండాయ్‌, బీఎండ‌బ్ల్యూ , వోక్స్ వాగ‌న్‌, స్కోడా ప‌లు కారు మోడ‌ల్ల‌ను అద్దెకు ఇస్తున్నాయి. మారుతీ సుజికీ కంపెనీకి చెందిన వాగ‌నార్‌, షిఫ్ట్‌, డిజైర్‌, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, ఇగ్నిస్, బాలెనో, సియాజ్, XL6, మరియు S- క్రాస్ బ్రాండ్ కార్లు త‌క్కువ‌కే అద్దెకు ఇస్తాయి. కార్లు కూడా 10,000 కి.మి నుంచి 25,000 కి.మీ వ‌ర‌కు మైలైజీతొ 12-48 నెల‌ల పాటు అద్దెకు దొరుకుతున్నాయి. వాగ‌నార్ కార్ నెల‌కు రూ.12,513 అద్దె చెల్లిస్తే చాలు దొర‌కుతుంది. ఇగ్ని కారు సుమారు నెల‌కు రూ.13,324ల‌కే అద్దెకు ల‌భిస్తుంది. వినియోగ‌దారుల‌కు త‌క్కువ ధ‌ర‌కు కొత్త కార్లు అద్దెకు వ‌స్తాయని, నెల‌ల వారీగా చెల్లించే ఫీజులో అన్ని టాక్సులు ఉంటాయ‌ని అన్నారు. కారు నిర్వ‌హ‌ణ సంబంధించి 24*7 సేవ‌లు అందిస్తామ‌ని మారుతీ సుజికీ మార్కెటింగ్ అండ్ సేల్స్‌, ఎక్సిగ్యూటీవ్ డైరెక్ట‌ర్ శ‌శాంక్ శ్రీ‌వాత్స‌వ్ చెబుతున్నారు.
  కారు సాంకేతిక‌త‌లో 3-5 ఏళ్ల స‌మ‌యంలో ఎన్నో మార్పులు వ‌స్తున్నాయని సొంత కారు కొన‌డం కంటే అద్దె కారే న‌య‌మ‌ని ఏఎల్‌డీ ఆటో మొబైల్ ఇండియా సీఈఓ అండ్ డైరెక్ట‌ర్ సువాజిత్ కర్మాకర్ అంటున్నారు.
  ఇండియాలో అద్దెకు తీసుకోవ‌డం 15-20శాతం మాత్ర‌మే ఉంద‌ని అమెరికాలో 45శాతం పైగా కారు అద్దెకు తీసుకుంటార‌ని అన్నారు. ఇండియాలో మార్కెట్ మ‌రింత పెర‌గాల్సి ఉంద‌ని అవిస్ ఇండియా ఎండీ అండ్ సీఈఓ సునీల్ గుప్తా అభిప్రాయ ప‌డ్డారు.
  ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన స్క్రాప్ పాల‌సీ సొంత కారు కొన‌డాన్ని నిరుత్సాహ ప‌రుస్తోంద‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు మార్చుకొనే వీలు ఉన్న అద్దె కారు వినియోగం వినియోగ‌దారుల‌కు ఆక‌ర్ష‌ణీయంగా ఉంద‌ని బ్యాంక్‌బ‌జార్.కామ్ సీఈఓ ఆదిల్ శెట్టి అన్నారు.
  కారు అద్దెకు తీసుకోవ‌డం వ‌ల్ల లాభ‌న‌ష్టాలు..
  అద్దె కారు ఎప్ప‌టికీ సొంత కారు కాలేదు. కొద్ది కాల‌మే దాన్ని వినియోగించ‌గ‌ల‌రు. అద్దెకు తీసుకొన్న కారును కొనుగోలు చేసే అవ‌కాశం వినియోగ‌దారుడికి లేదు. లీజు ఒప్పందం ముగిసిన వెంట‌నే కారును అప్ప‌గించాల్సిందే. అద్దెకారులో మార్పులు చేసుకొనే వీలు ఉండ‌దు. కానీ లోన్ తీసుకోకుండానే కారు పొంద‌వ‌చ్చు. అవ‌స‌ర‌మైన‌ప్పుడు కారును మార్చు కోవ‌చ్చు. అంతే కాకుండా సొంత కారుకు ఎక్కువ పెట్టుబ‌డి అవుతుంది. చిన్న మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు అద్దెకారు సౌల‌భ్యంగా ఉంటుంది.
  అద్దె కారు.. సొంత కారు ఖ‌ర్చు వ్య‌త్యాసం..
  మంచి బ్రాండ్ కారు రూ.16 ల‌క్ష‌ల విలువైంది కొంటే నాలుగేళ్ల‌లో నెల‌కు ఈఎంఐనే రూ.41,000 ప‌డుతుంది. ఇన్సూరెన్స్ 72 వేల వ‌ర‌కు అవుతుంది. మొత్తం అన్ని ఖ‌ర్చులు పోను కారు సొంత అవ్వాలంటే వినియోగ‌దారుడు రూ.21.46 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టాల్సి ఉంటుంది.
  అదే అద్దె కారైతే.. అదే కారును నాలుగేళ్ల‌కు లీజుకు తీసుకొంటే నెల‌కు రూ.29,000 రెంట్ ప‌డుతుంది. ఇన్సూరెన్స్ రూ.72,000 పోనూ మొత్తం 4.64 ల‌క్ష‌లు మాత్ర‌మే ఖ‌ర్చ‌వుతుంది. త‌క్కువ ఖ‌ర్చుతో కారును వినియోగించుకోవ‌చ్చు. ఆలోచించండి మీకు ఏ ప‌ద్ధ‌తి న‌చ్చిందో.
  Published by:Sharath Chandra
  First published: