Home /News /business /

Financial Tips: ఎంత సంపాదించినా సరే డబ్బు మిగలడం లేదని బాధపడుతున్నారా?.. అయితే, ఈ టిప్స్​తో మీ డబ్బు ఆదా చేసుకోండి

Financial Tips: ఎంత సంపాదించినా సరే డబ్బు మిగలడం లేదని బాధపడుతున్నారా?.. అయితే, ఈ టిప్స్​తో మీ డబ్బు ఆదా చేసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

కెరీర్​ ప్రారంభం నుంచే ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్​ను అలవర్చుకోవాలి. తద్వారా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీ జీవితాన్ని సాఫీగా కొనసాగించవచ్చు. ప్రస్తుతం, మీ డబ్బు ఆదా చేసుకునేందుకు ఉన్న మార్గాలను పరిశీలిద్దాం.

కొంత మంది ఎంత సంపాదిస్తున్నా సరే జీతం (salary) సరిపోవడం లేదని ఫీలవుతుంటారు. మరికొందరు, తక్కువ జీతం వచ్చినా పక్కా ప్రణాళిక (plan)తో ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవిస్తారు. అందుకే, ఎంత సంపాదిస్తున్నామనే దాని కంటే ఎంత ఆదా (save) చేస్తున్నామనే దానిపైనే మన ఆర్థిక భద్రత ఆధారపడి ఉంటుందని గమనించాలి. దీన్ని గుర్తించి కెరీర్​ ప్రారంభం నుంచే ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (financial management)​ను అలవర్చుకోవాలి. తద్వారా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీ జీవితాన్ని సాఫీగా కొనసాగించవచ్చు. ప్రస్తుతం మీ డబ్బు ఆదా చేసుకునేందుకు ఉన్న మార్గాలను (Financial Tips) పరిశీలిద్దాం.

నెలవారీ బడ్జెట్‌కు కట్టుబడి ఉండండి

మీరు మీ నెలవారీ ఖర్చులను (Monthly expenses) అంచనా వేసుకొని, వాటి కోసం బడ్జెట్‌ సెట్​ (budget set) చేసుకోవాలి. మీరు సెట్​ చేసుకున్న లిమిట్ (limit)​కు మించి ఖర్చు చేయవద్దు. ఒకవేళ, అలా చేస్తే మీ ఖర్చును అదుపుచేయడం అసాధ్యం. అందుకే, మీ అవసరాలను బట్టి మీ బడ్జెట్​ను వర్గీకరించుకొని ప్రాధాన్యత క్రమంలో ఖర్చు పెట్టండి. అన్ని ఖర్చులు పోగా మిగిలిన డబ్బు (money)ను మంచి రాబడినిచ్చే మార్గాల్లో ఇన్వెస్ట్ (Invest) చేయండి.

మనీ సేవింగ్​పై దృష్టి పెట్టండి

చాలా మంది తమ సంపాదన 'చాలా తక్కువ' కాబట్టి పొదుపు చేయలేకపోతున్నామని చెబుతుంటారు. కానీ, ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ డబ్బు ఆదా చేసుకోవచ్చు. ముందుగా నెల ప్రారంభంలో మీ డబ్బును ఖర్చుల వారీగా వేరు చేసుకోండి. ఎమర్జెన్సీ ఫండ్​ కోసం కొంత సేవ్​ చేసుకోండి. ఒకవేళ, నెలాఖరులోపు మీ ఎమర్జెన్సీ ఫండ్​ను ఖర్చు చేయకుంటే మీ వద్దే మిలిగి పోతుంది.

క్రెడిట్ తీసుకోవడం మానుకోండి

చాలా మందికి రాబడి (Income)కి మించి అప్పు చేసే అలవాటు ఉంటుంది. ఇప్పుడు క్రెడిట్ చాలా సులభంగా అందుబాటులో ఉన్నందున, తరచుగా సంపాదించిన దానికంటే ఎక్కువగా అప్పు చేస్తున్నారు. అయితే, అలా అప్పు తీసుకోవడం మానుకున్నప్పుడే డబ్బు పొదుపు చేయగలుగుతారు. ఎందుకంటే, అప్పు అనేది మీ ఆర్థిక స్థిరత్వాన్ని, అత్యవసర అవసరాలను పరిష్కరించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి, చాలా అవసరమైనప్పుడు మాత్రమే లోన్/క్రెడిట్ వైపు వెళ్లండి.

రిస్క్​ లేని పెట్టుబడి వైపు వెళ్లండి​

చాలా మంది వ్యక్తులు ఇన్వెస్ట్​మెంట్​ అనగానే షేర్ మార్కెట్ ట్రేడింగ్‌ వైపే చూస్తారు. కానీ, షేర్​ మార్కెట్ (Share market)​లో రిస్క్​ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఎక్కువ రిస్క్ లేకుండా మంచి రాబడిని అందించే ఇతర పెట్టుబడి మార్గాలను అన్వేషించాలి. మంచి రాబడిని అందించే యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లేదా యూలిప్​ను పరిశీలించవచ్చు. ఈక్విటీలో ట్రేడింగ్ చేయడానికి బదులుగా, మ్యూచువల్ ఫండ్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు

పన్నును అర్థం చేసుకోండి

ఆదాయపు పన్ను చెల్లించడం (Income tax pay), పన్ను విధానాలను అర్థం చేసుకోవడం ఆర్థిక నిర్వహణలో చాలా ముఖ్యమైన భాగాలు. పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు మార్కెట్​లో అనేక ఇన్వెస్ట్​మెంట్​ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. దేనిలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకునేందుకు పన్ను సలహాదారున్ని సంప్రదించండి. మంచి రాబడితో పాటు పన్ను ప్రయోజనాలు అందించే పెట్టుబడి మార్గాల వైపు దృష్టి సారించండి.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Financial problem, Financial support, Income, Investment Plans

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు