హోమ్ /వార్తలు /బిజినెస్ /

Multibagger Penny Stock: రూ.లక్ష ఇన్వెస్ట్‌మెంట్‌తో ఐదేళ్లలో రూ.9.70 లక్షలు.. ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ డీటైల్స్‌ ఇవే..

Multibagger Penny Stock: రూ.లక్ష ఇన్వెస్ట్‌మెంట్‌తో ఐదేళ్లలో రూ.9.70 లక్షలు.. ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ డీటైల్స్‌ ఇవే..

Multibagger Penny Stock: రూ.లక్ష ఇన్వెస్ట్‌మెంట్‌తో ఐదేళ్లలో రూ.9.70 లక్షలు.. స్టాక్ ఇదే..

Multibagger Penny Stock: రూ.లక్ష ఇన్వెస్ట్‌మెంట్‌తో ఐదేళ్లలో రూ.9.70 లక్షలు.. స్టాక్ ఇదే..

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో మల్టీబ్యాగర్ స్టాక్‌లలో లీడింగ్ లీజింగ్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ(LLFICL) అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ స్టాక్ గత 5 సంవత్సరాలలో దాదాపుగా రూ.1 నుంచి రూ.9.70 స్థాయికి చేరుకుంది. షేర్‌హోల్డర్‌లకు భారీ రాబడిని అందించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్‌లు ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. అన్ని మార్కెట్‌లకంటే ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ (Indian Stock Market) మెరుగైన స్థితిలోనే ఉందని చెప్పవచ్చు. నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌లో ఆల్‌ టైం హైకి దగ్గరలో ఉన్నాయి. సాఫ్ట్‌వేర్‌ కంపెనీల స్టాక్‌లు మినహ మిగతా రంగాలకు చెందిన కంపెనీలు రాణిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో మల్టీబ్యాగర్ స్టాక్‌లలో (Multibagger Stock) లీడింగ్ లీజింగ్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ(LLFICL) అందరి దృష్టినీ ఆకర్షిస్తోందని మింట్‌ ఓ కథనంలో పేర్కొంది. దాదాపు రూ.52 కోట్ల మార్కెట్ క్యాపిటల్‌ కలిగిన ఈ స్మాల్ క్యాప్ స్టాక్ 2022లో షేర్స్‌ స్ప్లిట్‌ ప్రకటించిన కంపెనీల లిస్ట్‌లో ఉంది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈ సంవత్సరం 1:10 స్టాక్ స్ప్లిట్‌ను ప్రకటించింది. 2022 సెప్టెంబర్ 22న స్టాక్ ఎక్స్‌-స్ప్లిట్‌ ట్రేడ్ అయింది. ఈ స్టాక్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

* గత నెలలో 25 శాతం రిటర్న్స్‌

గత నెలలో ఈ స్మాల్ క్యాప్ స్టాక్ దాని వాటాదారులకు 25 శాతానికి పైగా రాబడిని అందించింది. ఈ స్టాక్ గత 5 సంవత్సరాలలో దాదాపుగా రూ.1 నుంచి రూ.9.70 స్థాయికి చేరుకుంది. షేర్‌హోల్డర్‌లకు భారీ రాబడిని అందించింది. కంపెనీలో లాంగ్‌ టర్మ్‌ ఇన్వెస్ట్‌ చేసిన వారికి 870 శాతం రాబడి లభించింది. లీజింగ్ ఫైనాన్స్ షేర్ ధర గత నెలలో మాత్రమే దాదాపు రూ.7.75 నుంచి రూ.9.70కి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 25 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అయితే గత ఆరు నెలల్లో షేర్‌ వ్యాల్యూ రూ.6.80 నుంచి రూ.9.70కి పెరిగింది. ఈ సమయంలో స్టాక్‌ ప్రైస్‌లో దాదాపు 42 శాతం పెరుగుదల కనిపించింది. గత ఏడాది మొదటి ఆరు నెలల్లో స్టాక్ 8 శాతం రాబడిని అందజేస్తూ పక్కదారి పట్టింది.

* స్టాక్ స్ప్లిట్‌

BSE లిస్టెడ్ కంపెనీ షేర్లను అప్పటికి ఉన్న రూ.10 ఫేస్‌ వ్యాల్యూ కలిగిన షేర్ల నుంచి రూ.1 ఫేస్‌ వ్యాల్యూ షేర్లు స్ప్లిట్‌ చేయాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నిర్ణయించారు. దీంతో ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ ఇటీవల ఎక్స్‌- స్ప్లిట్‌గా ట్రేడ్ అయింది. గత శుక్రవారం, ఈ స్మాల్-క్యాప్ మల్టీబ్యాగర్ స్టాక్ దాదాపు రూ.52 కోట్ల మార్కెట్ క్యాప్‌తో ముగిసింది. శుక్రవారం ట్రేడ్ వ్యాల్యూమ్‌ 2.93 లక్షల వద్ద ఉంది. ఈ స్టాక్‌ 52 వారాల గరిష్టం రూ.17.38గా, 52 వారాల కనిష్టం రూ.4.23గా ఉంది. ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లో ఒక్కో షేరు బుక్‌ వ్యాల్యూ విలువ రూ.17.97.

December Bank Holidays: 14 రోజులు సెలవులు.. డిసెంబర్ నెలలో బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ఇదే! ఏపీ, తెలంగాణలో మాత్రం..

Electric Bike: ఇయర్‌ఎండ్ ధమాకా ఆఫర్.. ఎలక్ట్రిక్ బైక్‌పై రూ.10,000 డిస్కౌంట్, రూ.999తో బుక్ చేసుకోండిలా!

* రూ.9.70 లక్షలుగా మారిన రూ.లక్ష ఇన్వెస్ట్‌మెంట్‌

గత 5 సంవత్సరాలలో ఈ మల్టీబ్యాగర్‌ స్టాక్ దాదాపు రూ.1 నుంచి రూ.9.70కి పెరిగింది. ఒక ఇన్వెస్టర్ సుమారు 5 సంవత్సరాల క్రితం ఈ పెన్నీ స్టాక్‌లో రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, దాని విలువ ప్రస్తుతం రూ.9.70 లక్షలకు చేరి ఉండేది.

First published:

Tags: Multibagger stock

ఉత్తమ కథలు