హోమ్ /వార్తలు /బిజినెస్ /

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో కొత్త బైక్​ లాంచ్.. స్క్రామ్ 411 ధర, ఫీచర్ల వివరాలివే..

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో కొత్త బైక్​ లాంచ్.. స్క్రామ్ 411 ధర, ఫీచర్ల వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశపు క్లాసిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్కెట్​లోకి మరో కొత్త ఆఫ్-రోడ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ను ప్రవేశపెట్టింది. హిమాలయన్​ స్క్రామ్​ 411 పేరుతో ఈ బైక్​ను మార్చి 15న దేశీయ విపణిలోకి విడుదల చేసింది.

భారతదేశపు క్లాసిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) మార్కెట్​లోకి మరో కొత్త ఆఫ్-రోడ్ అడ్వెంచర్(Adventure) మోటార్‌సైకిల్ ను ప్రవేశపెట్టింది. హిమాలయన్​ స్క్రామ్​ 411 పేరుతో ఈ బైక్​ను మార్చి 15న దేశీయ విపణిలోకి విడుదల చేసింది. ప్రారంభపు ఆఫర్​లో భాగంగా ఈ బైక్​ను (Bike) రూ. 2.03 లక్షలు (ఎక్స్​షోరూమ్​, చెన్నై) వద్ద విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న హిమాలయన్​ అడ్వెంచర్ బైక్​కు స్వల్ప మార్పులు చేసి స్క్రాంబ్లర్​ తరహాలో ఈ బైక్​ను డిజైన్​ చేసింది. రాయల్​ ఎన్​ఫీల్డ్ స్క్రామ్​ 411 బైక్​ యోజ్దీ స్క్రాంబ్లర్​ బైక్​కు గట్టి పోటీనివ్వనుంది. స్క్రామ్ 411 బైక్​ హిమాలయన్ మాదిరిగానే 411-సిసి ఇంజన్‌తో వస్తుంది. రైడింగ్ స్టైల్‌కు తగ్గట్టుగా దీనిలో అనేక మార్పులు చేసింది.

RIMC Admissions: చారిత్రక నిర్ణయం తీసుకున్న RIMS.. తొలిసారిగా ఐదుగురు బాలికలకు ఇలా..

యువతను ఆకట్టుకునే డిజైన్​, ఫీచర్లు..

న్యూ రాయల్​ ఎన్​ఫీల్డ్​ స్క్రాంబ్లర్ బైక్​ హిమాలయన్​ అడ్వెంచర్​ మోడల్​ ఆధారంగా రూపొందింది. రాయల్ ఎన్​ఫీల్డ్​ స్క్రామ్​ 411 డ్యూయల్ పర్పస్​ టైర్స్​తో 19 అంగుళాల ఫ్రంట్​ వీల్​తో వచ్చింది. బైక్​ బరువును తగ్గించేందుకు.. జెర్రీ క్యాన్ హోల్డర్స్​, పొడవైన విండ్​ స్క్రీన్​లను తొలగించింది. ఇతర అప్​గ్రేడ్​లలో ట్రిప్డ్​ నావిగేషన్​ పాడ్​తో కూడిన రివైజ్డ్​ ఇన్​స్ట్రుమెంట్​ కన్సోల్, కాస్ట్​ మెటల్​ ఫినిష్డ్​ హెడ్​ల్యాంప్​ కౌల్​, స్ప్లిట్​ సీట్లు, రివైజ్డ్​ సైడ్ ప్యానెల్స్​ను అందించింది. అల్యూమినియం సంప్​ గార్డ్, అర్బన్​ బ్యాడ్జ్​ ప్లేట్​లను కూడా దీనిలో అమర్చింది. దీని ఇంజిన్ పనితీరు, రైడ్ నాణ్యత పరంగా నగరాల్లోని రోడ్లపై రైడింగ్​కు అనుకూలంగా ఉంటుంది.

ఈ మోటార్‌సైకిల్ హిమాలయన్‌ అడ్వెంచర్​తో సమానమైన ఛాసిస్, సస్పెన్షన్, బ్రేక్‌లతో వస్తుంది. దీని బరువును తగ్గించడానికి ట్యాంక్ పక్కన ఉన్న విండ్‌షీల్డ్​ను తొలగించింది. ఈ మోటార్‌సైకిల్ హిమాలయన్ కంటే 6.5 కిలోల తక్కువ బరువు కలిగి ఉంటుంది. కాబట్టి, తేలికైన బరువుతో యువతను ఆకట్టుకుంటుంది. రాయల్​ ఎన్​ఫీల్డ్​ మెటోర్ 350లో అందించిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను దీనిలోనూ అందించింది. దీని ప్రధాన డయల్ గేర్​ పొజిషన్​ ఇండికేటర్​లో ఓడో, స్పీడ్, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్​ నావిగేషన్‌తో వచ్చే ఆప్షనల్​ ట్రిప్ మీటర్​ను కూడా దీనిలో అందించింది.

ఇది కూడా చదవండి: పల్లీనూనె ఆరోగ్యానికి ఎంతో మేలు.. నిపుణులు చెబుతోన్న నిజాలు..!

లేటెస్ట్​ 411 సీసీ ఇంజిన్​తో..​

ఇక, రాయల్​ ఎన్​ఫీల్డ్​ స్క్రామ్​ 411 బైక్​ ఇంజిన్​ విషయానికి వస్తే.. ఇది 411-సీసీ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్​ 24.3 బిహెచ్‌పి, 32 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్​లో 5 స్పీడ్​ గేర్​ బాక్స్​ను అమర్చింది. బైక్​ సస్పెన్షన్​, బ్రేకింగ్ హారడ్వేర్ ఫీచర్ల​ను కూడా కలిగి ఉంటుంది.

First published:

Tags: Motor Cycle, New bike, Royal Enfield

ఉత్తమ కథలు