ప్రముఖ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) సరికొత్త బైక్స్ లాంచ్ చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఫేవరెట్ బైక్ అయిన స్ప్లెండర్+ (Splendor+)ను సరికొత్త అప్‌డేట్‌లతో మార్కెట్లోకి తీసుకొస్తూ అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కంపెనీ(Company) గురువారం కళ్లు చెదిరే ఫీచర్లతో స్ప్లెండర్+ ఎక్స్‌టెక్ (Splendor+ XTEC) బైక్‌ను లాంచ్ చేసింది. అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో(Advanced Features) తీసుకొచ్చిన ఈ స్ప్లెండర్+ ఎక్స్‌టెక్ ప్రారంభ ధరను రూ.72,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. ఈ 100సి.సి. మోటార్‌సైకిల్‌లోని టెక్నాలజీ, ఫీచర్లు తెలుసుకుంటే ఆశ్చర్య పోవాల్సిందే! అలాగే, స్ప్లెండర్+ ఎక్స్‌టెక్‌కి ఐదేళ్ల వారంటీని కంపెనీ ఆఫర్ చేయడం విశేషం.
స్ప్లెండర్+ ఎక్స్‌టెక్ టెక్నాలజీలు, ఫీచర్లు
స్ప్లెండర్+ సరికొత్త వేరియంట్ అయిన స్ప్లెండర్+ ఎక్స్‌టెక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ & ఎస్‌ఎంఎస్ అలర్ట్, రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ (RTMI), లో ఫ్యూయల్ ఇండికేటర్, ఎల్ఈడీ హై-ఇంటెన్సిటీ పొజిషన్ ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ యూఎస్‌బీ ఛార్జర్, సైడ్ స్టాండ్ ఇంజన్‌తో పాటు ఫుల్లీ డిజిటల్ మీటర్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎంట్రీ లెవెల్ బైక్ పాపులర్ ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్ i3S టెక్నాలజీతో కూడా వస్తుంది.
డిజైన్ పరంగా, స్ప్లెండర్+ ఎక్స్‌టెక్ ఎల్ఈడీ పొజిషన్ ల్యాంప్, కొత్త గ్రాఫిక్స్‌తో వస్తుంది. మిగిలిన డిజైన్ ఫీచర్లన్నీ ఇప్పటివరకు రిలీజ్ అయిన స్ప్లెండర్+ బైక్ లాగానే ఉంటాయి. ఈ బైక్ స్పార్క్లింగ్ బీటా బ్లూ (Sparkling Beta Blue), కాన్వాస్ బ్లాక్ (Canvas Black), టోర్నాడో గ్రే (Tornado Grey), పెర్ల్ వైట్ (Pearl White) అనే నాలుగు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. సేఫ్టీ కోసం, సైడ్ స్టాండ్ విజువల్ ఇండికేషన్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్ ఫీచర్లు అందించారు. ఈ బైక్ బ్యాక్-యాంగిల్ సెన్సార్‌తో వస్తుంది. ఈ సెన్సార్ బైక్ పడిపోయినప్పుడు ఇంజన్‌ను ఆఫ్ చేస్తుంది. తద్వారా ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది.
కొత్త స్ప్లెండర్+ ఎక్స్‌టెక్‌లో 97.2 cc BS-VI కంప్లైంట్ ఇంజన్ అమర్చారు. ఈ 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఇంజన్ 7,000 rpm వద్ద 7.9 bhp గరిష్ట శక్తిని... 6,000 rpm వద్ద 8.05 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. కొత్త బైక్ గురించి హీరో మోటోకార్ప్ స్ట్రాటజీ అండ్ గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్ హెడ్ మాలో లే మాసన్ మాట్లాడుతూ... "స్ప్లెండర్+ ఎక్స్‌టెక్ మోడల్ టెక్నాలజీ పరంగా అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, స్మార్ట్ మోడ్రన్ డిజైన్‌తో వస్తుంద"ని చెప్పారు. ఎక్స్‌టెక్ టెక్నాలజీతో కొత్త మోటార్‌సైకిల్‌గా స్ప్లెండర్+ వస్తుందని.. ఈ బైక్ వాహన ప్రియులకు నచ్చుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ఎక్స్‌టెక్ టెక్నాలజీతో హీరో గ్లామర్ 125, ప్లెజర్+ 110, డెస్టిని 125 బైక్స్ లాంచ్ అయి బాగా అమ్ముడుపోయాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Automobiles, Hero, Hero moto corp, New bikes