Home /News /business /

LATIN NCAP CRASH TEST GAVE ZERO SAFETY RATING TO MARUTI SUZUKI BALENO AND CHECK HERE FULL DETILAS PRV GH

Suzuki Baleno: సేఫ్టీ రేటింగ్‌లో సుజుకీ బాలెనోకు షాక్​.. జీరో స్టార్ సేఫ్టీ రేటింగ్‌ అందుకున్న మేడ్ ఇన్ ఇండియా కారు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మారుతీ సుజుకీ బాలెనో(Maruti Suzuki Baleno) లాటిన్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో జీరో-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. విస్తుపోయే విషయం ఏమిటంటే.. లాటిన్ అమెరికాలో విక్రయించే ఈ మోడల్ కారును భారతదేశంలోనే తయారు చేశారు.

దేశీయ కార్ల తయారీదారు మారుతీ సుజుకీ (Maruti Suzuki) కస్టమర్ల భద్రత గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఇప్పటికే ఎంతోమంది తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన ఇండియాలోనే అతి పెద్ద కార్ల కంపెనీ అయిన మారుతీ సుజుకీ తయారవుతుండటం గమనార్హం. ఈ కంపెనీ కార్ల ఆక్యుపెంట్ సేఫ్టీ ప్రతిసారి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ కార్ల (cars)లో ప్రయాణించే ప్రయాణికుల భద్రత శూన్యం అన్నట్లు రేటింగ్ (rating) సంస్థలు ఎప్పటికప్పుడు వెక్కిరిస్తున్నాయి. గ్లోబల్ ఎన్‌సీఏపీ (NCAP) సంస్థ పరీక్షించిన మారుతీ కార్లలో చాలా వరకు కార్లు త్రీ స్టార్స్ లేదా అంతకంటే తక్కువ స్కోర్‌ (Low Score)లనే సాధించాయి. దీంతో సదరు బ్రాండ్ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతోంది. కఠినమైన పారామితుల (parameters)తో క్రాష్ టెస్ట్‌ల ద్వారా పరీక్షించినప్పుడు మారుతీ కార్ల పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోంది.

లాటిన్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో..

ఇటీవలే మారుతీ సుజుకీ స్విఫ్ట్ లాటిన్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో జీరో-స్టార్ (Zero star) సేఫ్టీ రేటింగ్‌ను అందుకుంది. అది మరువకముందే తాజాగా అదే రిజల్ట్‌తో మారుతీ సుజుకీ బాలెనో (Maruti suzuki baleno) అనే మరో కొత్త కారు షాక్ ఇచ్చింది. మారుతీ సుజుకీ బాలెనో లాటిన్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో జీరో-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. విస్తుపోయే విషయం ఏమిటంటే.. లాటిన్ అమెరికాలో విక్రయించే ఈ మోడల్ కారును భారతదేశంలోనే తయారు చేశారు. ఇది ఇండియన్ మోడల్‌తో దాదాపు సమానంగా ఉండటం గమనార్హం.

సైడ్ ఇంపాక్ట్ విషయంలో..

మారుతీ సుజుకీ బాలెనో (Maruti Suzuki Baleno) పెద్దవారి భద్రతా లేదా అడల్ట్ ఆక్యుపెంట్ విభాగంలో 8.01 పాయింట్లు (20 శాతం) సాధించింది. క్రాష్ టెస్ట్‌లో అంచనా వేసినట్లుగా డ్రైవర్, ప్రయాణీకుల తల, మెడకు సమర్థవంతమైన రక్షణ అందించిందీ కారు. ప్రయాణికుల ఛాతీ (chest) భాగానికి కూడా మంచి రక్షణ అందించింది. ఫుట్‌వెల్, బాడీషెల్ భాగాలు స్థిరమైన రేటింగ్ పొందాయి. దీనర్థం ఇది తదుపరి లోడింగ్‌లను తట్టుకోగలదు. లాటిన్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో బాలెనో కారు స్విఫ్ట్ మోడల్ కంటే మెరుగ్గా ఉందని స్పష్టమైంది. అయితే జీరో స్టార్ రేటింగ్‌కి ప్రధాన కారణం సైడ్ ఇంపాక్ట్ విషయంలో పేలవమైన రక్షణ అందించడమే. డ్రైవర్, ముందు సీట్లో ప్రయాణీకులకు ఛాతీ రక్షణ(chest protection) సైడ్ ఇంపాక్ట్‌లో తక్కువగా ఉందని క్రాష్ టెస్ట్ నివేదిక పేర్కొంది. సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ సమయంలో పొత్తికడుపు, తలకు రక్షణ బాగానే ఉందని క్రాష్ టెస్ట్ నివేదించింది.

8.36 పాయింట్లు..

సుజుకీ బాలెనో పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్(child occupants protection) విభాగంలో లాటిన్ ఎన్‌సీఏపీ టెస్టింగ్ పారామితులలో 8.36 పాయింట్లను (17.06 శాతం) అందుకుంది. ఇది చాలా నాసిరకమైన స్కోర్ గా పరిగణిస్తారు. పాదచారుల రక్షణ విషయానికొస్తే, ఇది 30.75 పాయింట్లు (64.06 శాతం) సాధించింది. లాటిన్ ఎన్‌సీఏపీ పరీక్షించిన మోడల్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, సీట్‌బెల్ట్ రిమైండర్, ఫ్రంట్ ప్రిటెన్షనర్లు, ఈబీడీ ఉన్నాయి. అయితే, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటో-ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ అసిస్ట్ సిస్టమ్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్ వంటి సేఫ్టీ అసిస్ట్ సిస్టమ్‌లు లేకపోవడం వల్ల లాటిన్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో సుజుకీ బాలెనో స్కోరింగ్‌పై ప్రభావం పడింది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: BUSINESS NEWS, Cars, Low ratings, MARUTI SUZUKI

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు