ఎలాంటి అవాంతరాలు లేకుండా పెన్షనర్లు (Pensioners) సమయానికి తమ పింఛను ప్రతి నెలా అందుకోవాలంటే ఎప్పటికప్పుడు తప్పనిసరిగా సమయానికి లైఫ్ సర్టిఫికేట్ అందజేయాల్సి ఉంటుంది. జీవన్ ప్రమాణ్ పత్ర (Jeevan Pramaan Patra)గా పేర్కొనే లైఫ్ సర్టిఫికేట్‌ను 2022 ఫిబ్రవరి 28వ తేదీలోగా ప్రభుత్వ పెన్షనర్లు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం(Central Government) ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ప్రతి సంవత్సరం నవంబరు 30వ తేదీలోగా లైఫ్ సర్టిఫికేట్‌ను ప్రభుత్వ పెన్షనర్లు అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది ఈ గడువును రెండు సార్లు పొడిగించారు. ఇప్పటి వరకు లైఫ్(Life) సర్టిఫికేట్‌ను అందజేయని ప్రభుత్వ పెన్షనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ప్రభుత్వ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ (Jeevan Pramaan)ను డిజిటల్ విధానంలో పొందవచ్చు. ఇది బయోమెట్రిక్ ఎనేబుల్డ్ సర్వీసు. ఇకపై పెన్షనర్లు స్థానిక కార్యాలయాలకు వెళ్లి లైఫ్ సర్టిఫికేట్‌ను అందజేయాల్సిన అవసరం లేదు. ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను పొందవచ్చు.
డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఎలా పని చేస్తుంది?
జీవన్ ప్రమాణ్ వెబ్సైట్ ఆధార్ ప్లాట్‌ఫాంను వినియోగించుకొని పెన్షనర్ల ఆధార్, ఇతర వివరాలను పరిశీలిస్తుంది. అన్ని వివరాలను పెన్షనర్ నమోదు చేసిన తర్వాత ఆధార్ డేటాబేస్కు జీవన్ ప్రమాణ్ వెబ్సైట్ అనుసంధానమై సమాచారాన్ని నిర్ధారిస్తుంది. అథెంటికేషన్ పూర్తి అయిన వెంటనే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను అందిస్తుంది. అనంతరం జీవణ్ ప్రమాణ్ వెబ్‌సైట్‌లోని లైఫ్ సర్టిఫికేట్ రిపాజిటరీ (Life Certificate Repository)లో స్టోర్ అవుతుంది. అక్కడ సేవ్ అయిన డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను ఆన్లైన్లో ఆయా కార్యాలయాల నుంచి అధికారులు వినియోగించుకొనే సౌలభ్యం ఉంది.
డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందాలంటే ఏం కావాలి?
పెన్షనర్‌కు కచ్చితంగా ఆధార్ కార్డు నంబరు(Aadhaar Number) ఉండాలి.
ఆధార్‌తో లింకు అయిన ఫోన్ నంబరు అవసరం.
పోస్ట్ ఆఫీస్ లేదా పింఛను అందించే ఇతర స్థానిక కార్యాలయాల్లో ఆధార్ కార్డు నంబరు రిజిస్ట్రేషన్ ముందుగానే చేసుకొని ఉండాలి.
ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను (Aadhaar Biometric Authentication) సపోర్ట్ చేసే డివైజెస్(Devices Support) అందుబాటులో ఉండాలి( జీవన్ ప్రమాణ్ వెబ్సైట్లో వినియోగించగలిగే డివైజెస్ వివరాలు పొందుపరిచారు).
విండోస్ 7.0 అండ్ ఆ తర్వాత వెర్షన్లు ఉండే కంప్యూటర్లు, ఆండ్రాయిడ్ 4.0 లేదా ఆ తర్వాత వెర్షన్లపై పని చేసే ఫోన్ లేదా ట్యాబ్లెట్లు ఉండాలి.
ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి.
Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 393 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
జీవన్ ప్రమాణ్ యాప్‌లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి?
1. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న జీవన్ ప్రమాణ్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి.
2. కొత్త యూజర్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి.
3. ఆధార్ నంబరు, బ్యాంకు అకౌంట్ నంబరు, పేరు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్(PPO) నమోదు చేయాలి.
4. ఆ తర్వాత సెండ్ ఓటీపీని క్లిక్ చేయాలి.
5. ఫోన్‌కు వచ్చిన ఒన్ టైమ్ పాస్వర్డ్(OTP)ని ఎంటర్ చేయాలి.
6. ఇప్పుడు ప్రమాణ్ ఐడీ క్రియేట్ అవుతుంది.
డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందడం ఎలా?
యాప్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత క్రియేట్ అయిన ప్రమాణ్ ఐడీని వినియోగించి జీవన్ ప్రమాణ్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. వెబ్సైట్లో ఐడీ ఎంటర్ చేసిన తర్వాత కిందనే సెండ్ ఓటీపీ ఆప్షన్ సెలక్ట్ చేయాలి. ఫోన్‌కు వచ్చిన ఓటీపీనీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పూర్తవుతుంది. ఇప్పుడు పీపీవో నంబరు, పెన్షనర్ పేరు, పింఛను అందజేసే కార్యాలయం వివరాలు నమోదు చేయాలి. అనంతరం ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ ద్వారా బయోమెట్రిక్ డివైజ్ వినియోగించి ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాలి. అథెంటికేషన్ పూర్తి అయిన తర్వాత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. దీన్ని నిర్ధారిస్తూ ఫోన్‌కు మెసేజ్ కూడా వస్తుంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పీడీఎఫ్ ఫార్మాట్లో అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు పింఛను అందించే స్థానిక కార్యాలయాలు, బ్యాంకులకు వెళ్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Certificate, Digital Platform, Jeevan pramaan patra, Life certificate