Lamborghini: భారత మార్కెట్​లోకి లంబోర్ఘిని రేసింగ్ కారు లాంచ్​​.. ధరెంతో తెలుసా..?

Lamborghini New car: లంబోర్ఘిని కంపెనీ తన హురాకాన్​ ఎన్​టీఓను ఆర్​ అండ్​ డి, స్క్వాడ్రా కోర్స్​, సెంట్రో స్టైల్​ విభాగాలను సంయుక్తంగా అభివృద్ధి చేసింది. ఫలితంగా ఇది చాలా ఏరోడైనమిక్స్‌గా ఉండటమే కాకుండా వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Lamborghini New car: లంబోర్ఘిని కంపెనీ తన హురాకాన్​ ఎన్​టీఓను ఆర్​ అండ్​ డి, స్క్వాడ్రా కోర్స్​, సెంట్రో స్టైల్​ విభాగాలను సంయుక్తంగా అభివృద్ధి చేసింది. ఫలితంగా ఇది చాలా ఏరోడైనమిక్స్‌గా ఉండటమే కాకుండా వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

  • Share this:
ఇటలీకి చెందిన సూపర్ స్పోర్ట్స్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని కొత్త కారును విడుదల చేసింది. దేశీయ మార్కెట్​లోకి హురాకాన్ ఎస్​టీఓ (సూపర్ ట్రోఫియో ఓమోలోగాటా) మోడల్​ను అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా హురాకాన్​ ఎస్​టీఓను 2020 నవంబర్​లోనే రిలీజ్​ చేయగా, భారత్​లోకి ఇప్పుడు విడుదలైంది. ఈ రేసింగ్​ కారు మెరుపు వేగంతో దూసుకెళ్లగలదు. అంటే కేవలం మూడు సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ కొత్త ట్రాక్​ ఓన్లీ కారు 5.2 లీటర్ల వి 10 ఇంజిన్​తో పనిచేస్తుంది. దీని డిజైన్​, పనితీరు దాదాపు స్టాండర్డ్​ హురాకాన్​ మాదిరిగానే ఉంటుంది.

దీని ఇంజిన్​ 7 స్పీడ్​ డ్యూయల్​ క్లాచ్​ ఎల్​డిఎఫ్​(లింబోర్ఘిని డోపియో ఫ్రిజియోన్​) గేర్​బాక్స్​తో పనిచేస్తుంది. ఇది శక్తిని వెనుక చక్రాలకు పంపుతుంది. ఈ ఇంజిన్​ 8,000 ఆర్​పిఎమ్​ వద్ద 630 బిహెచ్​పి పవర్​, 6,500 ఆర్​ఎమ్​ వద్ద 565 ఎన్​ఎమ్​ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త హురాకాన్​ ఎస్​టీఓ గరిష్టంగా​ గంటకు 310 కిలో మీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇది 3 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. 9 సెకన్లలో గంటకు 0 నుంచి 200 కి.మీ. వేగాన్ని చేరుకుంటుంది.

లంబోర్ఘిని కంపెనీ తన హురాకాన్​ ఎన్​టీఓను ఆర్​ అండ్​ డి, స్క్వాడ్రా కోర్స్​, సెంట్రో స్టైల్​ విభాగాలను సంయుక్తంగా అభివృద్ధి చేసింది. ఫలితంగా ఇది చాలా ఏరోడైనమిక్స్‌గా ఉండటమే కాకుండా వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ హురాకాన్​ ఎస్​టీఓ కారులోని హుడ్​, ఫెండర్లు, బంపర్​ మొత్తం సింగల్​ పీస్​లో తయారు చేశారు. ఈ కారణంగానే ఇది చాలా తక్కువ బరువు కలిగి ఉంటుంది. ఇది దాని మునుపటి మోడల్​ కంటే 43 కిలోల తక్కువ బరువు ఉంటుంది. ఇంతకి ఈ కారు ధరంతో తెలుసా.. రూ. 4.99 కోట్లు (ఎక్స్​షోరూమ్​, ఇండియా).

గంటకు 310 కిలో మీటర్ల వేగంతో..
ఈ రేసింగ్​ కారుపై లంబోర్ఘిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ మాట్లాడుతూ "ఇది చాలా ప్రత్యేకమైన కారు. ఈ మోడల్ కోసం అనేక మంది భారతీయ రేసర్లు వేచి చూస్తున్నారు. ఎట్టకేలకు భారత మార్కెట్​లో దీన్ని అందుబాటులోకి తెచ్చినందుకు సంతోషంగా ఉంది." అని అన్నారు. కాగా, హురాకాన్ STO కారును కేవలం రేసింగ్​ ట్రాక్ మీదే కాకుండా సాధారణ రోడ్లపై కూడా నడపవచ్చు. ఇక, దీని లోపలి భాగంలో స్పెర్టి బకెట్​ సీట్లను అందించారు. ఇందులో క్లైమెట్​ కంట్రోల్​, ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, స్టీరింగ్​ మౌంటెడ్​ కంట్రోల్​, ప్యాడిల్​ షిఫ్టర్లు, అల్యూమినియం స్విచ్​, సెంటర్​ కన్సోల్​ ఎస్​టీఓ బ్యాడ్జ్​ వంటివి చేర్చారు.
Published by:Shiva Kumar Addula
First published: