Stock To Buy | స్టాక్ మార్కెట్‌లో చాలా షేర్లు ఉన్నాయి. అయితే అన్ని షేర్లు ఒకే విధమైన రాబడిని మాత్రం అందించలేవు. కొన్ని షేర్లు మల్టీ బ్యాగర్ (Multibagger Share) రిటర్న్ అందిస్తే.. మరికొన్ని షేర్లు మాత్రం నష్టాలను మిగిలించి ఉంటాయి. చాలా మంది గెలిచే గుర్రం పైనే పందెం వేయాలని భావిస్తారు. ఇప్పుడు మనం ఇలాంటి రేసు గుర్రం గురించే మాట్లాడుకోబోతున్నాం. ఆ షేరు (Stock) ఏంటని అనుకుంటున్నారా? ఎల్ అండ్ టీ షేరు. ఈ షేరు రానున్న రోజుల్లో పరుగులు పెట్టొచ్చనే అంచనాలు ఉన్నాయి.
బడ్జెట్ 2023-24లో కేంద్ర ప్రభుత్వం ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌కు సంబంధించి కీలక ప్రకటనలు చేయొచ్చనే అంచనాలు ఉన్నాయి. దీని వల్ల ఇన్‌ఫ్రా స్టాక్స్ పరుగులు పెట్టొచ్చని అందరూ భావిస్తున్నారు. మంగళవారం ఈ స్టాక్ 3.73 శాతం పైకి చేరింది. రూ. 2,216కు ఎగసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే.. షేరు ధర రూ. 127 పైకి కదిలింది. మోతీలాల్ ఓస్వాల్ చందన్ తపారియా బడ్జెట్ కన్నా ముందు కొనదగిన ఐదు స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. వీటిల్లో ఎల్ అండ్ టీ కూడా ఉంది. ఎన్‌సీసీ, కమ్మిన్స్ ఇండియా, సీమెన్స్, కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ మిగతా స్టాక్స్.
ఎస్‌బీఐ కస్టమరా? నెలకు రూ.700 కడితే చాలు.. ఈ స్మార్ట్ టీవీ మీ సొంతం!
ఎల్ అండ్ టీ షేరు ధర గత ఆరు నెలల కాలంలో 28 శాతానికి పైగా పెరిగింది. నిపుణులు కూడా ఈ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉంది. 37 మంది ఫండ్ మేనేజర్లలో 36 మంది ఈ స్టాక్ కొనొచ్చని సిఫార్సు చేస్తున్నారు. వీరిలో 18 మంది ఎల్ అండ్ టీ స్టాక్‌ను వెంటనే కొనొచ్చని పేర్కొంటున్నారు. కేవలం ఒక్క అనలిస్ట్ మాత్రమే ఈ షేరును విక్రయించాలని సిఫార్సు చేశారు.
ఫోన్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాడు.. రూ.5 లక్షలు పోగొట్టుకున్నాడు, మీరు మాత్రం ఇలా చేయొద్దు!
ప్రాఫిట్‌మార్ట్ సెక్యూరిటీస్ హెడ్ ఆఫ్ రీసెర్చ్ అవినాశ్ గోరక్కర్ మాట్లాడుతూ.. అగ్రికల్చర్ తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగమే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. అందువల్ల వచ్చే బడ్జెట్‌లో ఈ రంగానికి అధిక ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల 2023 బడ్జెట్ కన్నా ముందు ఎన్‌సీసీ, కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్, కమ్మిన్స్ ఇండియా, ఎల్ అండ్ టీ షేర్లను కొనొచ్చని సిఫార్సు చేశారు.
గమనిక: స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్‌లో భారీ రిస్క్ ఉంటుంది. టైమ్ బాగోలేకపోతే పెట్టిన డబ్బులు కూడా వెనక్కి రాకపోవచ్చు. అందుకే డబ్బులు పెట్టడానికి ముందు ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహాలు తీసుకోవాలి. కాగా పైన పేర్కొన్న సిఫార్సులు సంబంధిత బ్రోకరేజ్ సంస్థలకు సంబంధించినవి. వీటితో న్యూస్18 తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Money, Multibagger stock, Share Market Update, Stock Market, Stocks