హోమ్ /వార్తలు /బిజినెస్ /

Office Bubbles Concept: హైదరాబాద్ మెట్రో స్టేషన్ల నుంచి ఆఫీస్ వర్క్.. దేశ చరిత్రలో తొలిసారి ఇలా..

Office Bubbles Concept: హైదరాబాద్ మెట్రో స్టేషన్ల నుంచి ఆఫీస్ వర్క్.. దేశ చరిత్రలో తొలిసారి ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ మెట్రో స్టేషన్లు సరికొత్తగా రూపుదిద్ధుకొంటున్నాయి. దేశ చరిత్రలోనే మొదటి సారిగా మెట్రో స్టేషన్ల నుంచే ఆఫీసు కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు వీలుగా L And T మెట్రలో రైల్ కొత్తగా ఆఫీస్ బబుల్స్ పేరుతో కో వర్కింగ్ స్పెస్ ను ఆఫర్ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి.

ఇంకా చదవండి ...

హైదరాబాద్ మెట్రో స్టేషన్లు(Hyderabad Metro Stations) సరికొత్తగా రూపుదిద్ధుకొంటున్నాయి. దేశ చరిత్రలోనే మొదటి సారిగా మెట్రో స్టేషన్ల(Metro Stations) నుంచే ఆఫీసు కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు వీలుగా L And T మెట్రోలో రైల్(Metro Rail) కొత్తగా ఆఫీస్ బబుల్స్(Office Bubbles) పేరుతో కో వర్కింగ్ స్పెస్ ను(Working Space) ఆఫర్ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ఆఫీస్ బబుల్స్ ద్వారా.. హైదరాబాద్‌లో కో-వర్కింగ్ స్పేస్‌లు(Hyderabad Co Working Spaces) , లొకేషనల్ ఫ్లెక్సిబిలిటీ(Flexibility) కోసం పెరుగుతున్న డిమాండ్‌ను L&T MRHL నెరవేరుస్తున్నట్లు అవుతుంది. సాఫ్ట్ వేర్ కంపెనీలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ఆఫర్ ను తీసుకొచ్చినట్లు మెట్రో అధికారులు పేర్కొన్నారు. అంతే కాదు.. వీటి ద్వారా ఆయా కంపెనీలు నగరవ్యాప్తంగా చిన్న చిన్న ఆఫీసులుగా ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.

Motorola Smart Phone: త్వరలో మోటరోలా నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఇవే..


ట్రాన్సిట్‌ ఓరియెంటెడ్‌ స్పేస్‌ డెవలప్‌మెంట్‌ (ToD) పార్కింగ్ , సర్క్యులేషన్ ఏరియాతో పాటు పని, షాపింగ్, లీజర్, వినోదం, ఆరోగ్య సంరక్షణ విభాగాల కోసం దాదాపు 18.5 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని అందిస్తుంది. IT కంపెనీలపై దృష్టి సారించి, ఆఫీస్ బబుల్స్ కాన్సెప్ట్ 'హబ్ మరియు స్పోక్' మోడల్‌ను అందిస్తుంది. మెట్రో స్టేషన్లలో అన్-పెయిడ్ (ప్రీ-టికెటింగ్) ప్రాంతాలలో ట్రాన్సిట్ ఓరియెంటెడ్ స్పేస్‌లను ఉపయోగించుకుంటుంది.

49 సాధారణ మెట్రో స్టేషన్లలో 1750 చదరపు అడుగులతో రెండు యూనిట్లు, 8 నాన్-టిపికల్ మెట్రో స్టేషన్లలో 5,000-30,000 చదరపు అడుగుల యూనిట్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉందని కంపెనీ పేర్కొంది. మొత్తంగా ఖాళీగా ఉంటే.. 4 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఆఫీస్ బబుల్స్‌కు లీజుకు ఇవ్వనుంది.

Married Women: కొత్తగా పెళ్లైన మహిళలు గూగుల్ లో ఏం సెర్చ్ చేస్తున్నారో తెలుసా..? సర్వేలో ఆసక్తిర అంశాలు..


L&T మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్, MD & CEO Mr. KVB రెడ్డి మాట్లాడుతూ.. భారత పట్టణ రవాణా రంగంలో రూపొందించబడిన మొట్టమొదటి కాన్సెప్ట్‌గా 'ఆఫీస్ బబుల్స్' అందించడం మాకు గర్వకారణంగా ఉందన్నారు.. రిమోట్ కో-వర్కింగ్ స్పేస్‌ల కొరకు పెరుగుతున్న పోటీలో ఈ అవకాశాన్ని కంపెనీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెట్రో స్టేషన్‌లలో ఆఫీసు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల వర్క్‌ ఫ్రం హోం చేసే ఉద్యోగులకు వారి ఇంటికి దగ్గర ఉండే మెట్రో స్టేషన్‌లో ఏర్పాటయ్యే కార్యాలయంలో పని చేయడానికి చైతన్యం కలిగిస్తుందని ఇది కంపెని పురోగతికి ఎంతగానో తోడ్పుడుతుందని అన్నారు. అదే విధంగా ఉద్యోగుల రవాణాకు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.

Govt Jobs with 10th: టెన్త్ పాసయ్యారా? ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు పదవ తరగతి చాలు

ఆఫీస్ బబుల్స్ యొక్క ప్రయోజనాలు..

ఉద్యోగి ప్రయాణ సమయం తగ్గింపుతో ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ కు అనుకూలం. తక్కువ ఖర్చులు, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన. CCTV యాక్సెస్ కంట్రోల్‌తో నగరంలోని 57 స్టేషన్లలో సురక్షితమైన స్థలాలుగా ఉన్నాయి. ఇవి 24 గంటలు సీసీటీవీ నిఘాలో ఉంటాయి. సిద్ధంగా ఉన్న ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌తో పాటు అంకితమైన డేటా కనెక్టివిటీ (LAN) ఉంటుంది. విశ్వసనీయ విద్యుత్ సరఫరా, ఫైర్ సేఫ్టీ కంప్లైంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సహా అధిక భద్రత. మెట్రో రైలు ద్వారా ఉద్యోగులకు సులభమైన ప్రయాణం, అందుబాటులో పార్కింగ్ స్థలాలు. అత్యవసర సమయంలో ప్రయాణానికి కూడా అనుకూలంగా ఉండనున్నాయి.

First published:

Tags: Brand Hyderabad, Hyderabad Metro, Hyderabad Metro rail

ఉత్తమ కథలు