హోమ్ /వార్తలు /బిజినెస్ /

Insurance Premium: అలర్ట్... ఇన్స్యూరెన్స్ ప్రీమియంలు పెరగనున్నాయి

Insurance Premium: అలర్ట్... ఇన్స్యూరెన్స్ ప్రీమియంలు పెరగనున్నాయి

Insurance Premium: అలర్ట్... ఇన్స్యూరెన్స్ ప్రీమియంలు పెరగనున్నాయి
(ప్రతీకాత్మక చిత్రం)

Insurance Premium: అలర్ట్... ఇన్స్యూరెన్స్ ప్రీమియంలు పెరగనున్నాయి (ప్రతీకాత్మక చిత్రం)

Insurance Premium | ఇన్స్యూరెన్స్ తీసుకోవాలనుకునేవారికి అలర్ట్. నవంబర్ 1 నుంచి ఇన్స్యూరెన్స్ తీసుకునేవారికి కొత్త రూల్స్ (New Rules) వర్తించనున్నాయి. దీంతో ఇన్స్యూరెన్స్ ప్రీమియం కూడా పెరగనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఇన్స్యూరెన్స్ తీసుకోవాలనుకునే వారికి అలర్ట్. త్వరలో ఇన్స్యూరెన్స్ ప్రీమియంలు పెరగనున్నాయి. కొత్త ఇన్స్యూరెన్స్ పాలసీ (Insurance Policy) తీసుకోవాలనుకుంటే కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయడం తప్పనిసరి. హెల్త్ ఇన్స్యూరెన్స్ (Health Insurance), జనరల్ ఇన్స్యూరెన్స్, మోటార్ ఇన్స్యూరెన్స్ లాంటి బీమా పాలసీలు తీసుకునేవారికి నవంబర్ 1 నుంచి ఈ రూల్స్ వర్తించనున్నాయి. కేవైసీ వివరాలు అప్‌డేట్ చేసినవారికి మాత్రమే పాలసీలు లభిస్తాయి. ప్రస్తుతం కేవైసీ వెరిఫికేషన్ స్వచ్ఛందంగా ఉంది. కానీ నవంబర్ 1 నుంచి తప్పనిసరి కానుంది. కేవైసీ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తుండటంతో ఇన్స్యూరెన్స్ కంపెనీలు కేవైసీ ఛార్జీలను కూడా పాలసీల్లో కలపనున్నాయి. దీంతో నాన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియంలు పెరుగుతాయి.

ఇన్స్యూరెన్స్ పాలసీలతో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) పాలసీ తీసుకునేవారికి కేవైసీ తప్పనిసరి చేస్తోంది. నాన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు పాలసీహోల్డర్లకు కేవైసీ తప్పనిసరి చేయాలని కోరిన తర్వాత ఐఆర్‌డీఐఏ ఈ రూల్ తీసుకొచ్చింది. పాలసీదారుల వివరాలు పూర్తిగా ఇన్స్యూరెన్స్ కంపెనీల దగ్గర ఉండేలా చర్యలు తీసుకుంటోంది. అత్యవసర సమయాల్లో పాలసీహోల్డర్‌ను సంప్రదించడంతో పాటు ఇతర పాలసీలను పరిచయం చేయడం కోసం ఇన్స్యూరెన్స్ కంపెనీలకు ఈ నిర్ణయం ఉపయోగపడనుంది.

New Rules in September: సెప్టెంబర్‌లో అమలులోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే

కస్టమర్ల డేటా బేస్‌ను ఇన్స్యూరెన్స్ కంపెనీలు మెయింటైన్ చేయడానికి ఉపయోగపడటంతో పాటు, క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో ఈ నిర్ణయం ఉపయోగకరంగా ఉంటుందని ఇన్స్యూరెన్స్ రంగ నిపుణులు భావిస్తున్నారు. నవంబర్ 1న కేవైసీ రూల్స్ అమలులోకి వస్తే పాలసీ తీసుకోవాలనుకునేవారు ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ లాంటి కేవైసీ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా సమర్పించాలి. ఇక క్లెయిమ్స్ సమయంలో కూడా రూ.1 లక్ష కన్నా ఎక్కువ క్లెయిమ్స్ ఉంటే కేవైసీ వివరాలు సమర్పించాలి.

రెండేళ్ల క్రితం 2020లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన సమయంలో ఐఆర్‌డీఏఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీలకు వీడియో బేస్డ్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ (VBIP) ద్వారా కేవైసీ ప్రాసెస్‌ను సులభతరం చేసింది. ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రతినిధి VBIP ద్వారా రియల్ టైమ్‌లో కస్టమర్‌ను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. కస్టమర్ అనుమతితో ఆడియో, విజువల్ ఇంటరాక్షన్ ద్వారా ఐడెంటిఫికేషన్ సమాచారాన్ని సేకరిస్తుంది కంపెనీ. అవసరమైన పత్రాలను చెక్ చేసి, అవి నిజమో కాదో చెక్ చేస్తుంది.

IRCTC Tirupati Tour: సెప్టెంబర్‌లో హైదరాబాద్ నుంచి తిరుపతి టూర్ ప్యాకేజీలు

ఐఆర్‌డీఏఐ కేవైసీ రూల్స్‌ని నవంబర్ 1 నుంచి అమలు చేయనున్నాయి. కానీ కొన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలు గడువు పొడిగించాలని కోరే అవకాశం ఉంది. ఈ రూల్ అమలు చేసేందుకు ఇంకొన్ని రోజుల సమయం కావాలని కొన్ని కంపెనీలు భావిస్తున్నాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: General insurance, Health Insurance, Insurance, Life Insurance, Personal Finance, Term insurance

ఉత్తమ కథలు