ఇండియన్ ఆటోమొబైల్(Indian Automobile) మార్కెట్లో స్కోడా కార్లకు(Skoda Cars) మంచి డిమాండ్(Demand) ఉంటుంది. మిడ్ రేంజ్, ప్రీమియం మోడళ్లను రిలీజ్ చేస్తూ, సేల్స్(Sales) పెంచుకుంటున్న స్కోడా ఆటో ఇండియా (Skoda Auto India).. తాజాగా ఇండియాలో కుషాక్ మోంటే కార్లో ఎడిషన్‌ను (Kushaq Monte Carlo Edition) SUVని లాంచ్ చేసింది. దీని ధర రూ. 15.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. స్కోడా కుషాక్ మోంటే కార్లో ఎడిషన్(Edition).. ప్రస్తుతం ఈ లైనప్‌లో ఉన్న టాప్-స్పెక్ స్టైల్ వేరియంట్‌కు (Kushaq Style variant) అప్‌డేటెడ్ వెర్షన్‌గా రానుంది. దీని టాప్ వేరియంట్ ధర రూ. 19.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. స్కోడా ఇండియా లైనప్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్లలో స్కోడా కుషాక్ ఒకటిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో కుషాక్ మోంటే కార్లో గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
స్కోడా కుషాక్ మోంటే కార్లో ఎడిషన్ మొత్తం 4 వేరియంట్లలో లభిస్తుంది. 1.0 TSI MT, 1.0 TST AT, 1.5 TSI MT, 1.5 TSI DSG వంటి నాలుగు వేరియంట్లు కస్టమర్లను ఆకర్షిస్తాయని కంపెనీ చెబుతోంది. కొత్తగా ప్రవేశపెట్టిన మోంటే కార్లో ఎడిషన్ ఎస్‌యూవీ ధర, ప్రస్తుతం ఉన్న టాప్-స్పెక్ స్టైల్ వేరియంట్‌ల కంటే రూ.70,000 ఎక్కువ.
* స్కోడా కుషాక్ మోంటే కార్లో ఎడిషన్ వేరియంట్ల ధరలు
స్కోడా కుషాక్ మోంటే కార్లో 1.0 TSI MT - రూ. 15.99 లక్షలు
స్కోడా కుషాక్ మోంటే కార్లో 1.0 TSI AT - రూ. 17.69 లక్షలు
స్కోడా కుషాక్ మోంటే కార్లో 1.5 TSI MT - రూ. 17.89 లక్షలు
స్కోడా కుషాక్ మోంటే కార్లో 1.5 TSI DCT - రూ. 19.49 లక్షలు
ఈ మోంటే కార్లో ఎడిషన్.. ప్రస్తుతం భారతదేశంలో విక్రయిస్తున్న టాప్-స్పెక్ కుషాక్‌గా మారింది. ఈ SUV బ్లాక్-అవుట్ డిజైన్ ఎలిమెంట్స్‌తో వస్తుంది. దీనిపై మోంటే కార్లో బ్యాడ్జింగ్ ఉంటుంది. దీని రూఫ్ బ్లాక్ ఫినిషింగ్‌తో వచ్చింది. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఈ కారు బలంగా కనిపిస్తోంది. 1.5 TSI వేరియంట్‌లలో బ్రేక్ కాలిపర్‌లు రెడ్ కలర్‌లో వచ్చాయి. మోంటే కార్లో ఎడిషన్ రెడ్, వైట్ వంటి రెండు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.
Snooze at work : ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్..మధ్య్నాహం ఓ అరగంట హాయిగా నిద్రపోవచ్చు
ఇంటీరియర్ మార్పులతో వచ్చిన ఈ ఎస్‌యూవీ.. రెడ్, బ్లాక్ కలర్స్ కలయికతో కూడిన డ్యూయల్-టోన్ థీమ్డ్ క్యాబిన్‌తో కొత్తగా కనిపిస్తోంది. సీట్లు కొత్త డిజైన్‌లో, హెడ్‌రెస్ట్‌లపై మోంటే కార్లో అనే టైటిల్‌తో వస్తాయి. ఇతర పెద్ద మార్పులలో.. కొత్త 8.0 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అల్యూమినియం పెడల్స్ వంటివి ఉన్నాయి. ఈ మార్పులను మినహాయిస్తే.. ఈ కారు స్కోడా కుషాక్ లైనప్‌లో ప్రస్తుతం ఉన్న స్టైల్ వేరియంట్ మాదిరిగానే కనిపిస్తోంది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్, కియా సెల్టోస్ ఎక్స్-లైన్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది. ఈ వేరియంట్లు కూడా కుషాక్ మోంటే కార్లో వంటి కాస్మెటిక్ అప్‌డేట్‌లతో సరికొత్తగా రిలీజ్ అయ్యి, కార్ లవర్స్‌ను ఆకర్షిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.