Bio Asia: మౌలిక సదుపాయాల కల్పనపైనే ప్రత్యేక దృష్టి...బయో ఏషియా సదస్సులో మంత్రి కేటీఆర్..

KTR| ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నామని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి కేటీఆర్ అన్నారు.

news18-telugu
Updated: February 17, 2020, 10:12 PM IST
Bio Asia: మౌలిక సదుపాయాల కల్పనపైనే ప్రత్యేక దృష్టి...బయో ఏషియా సదస్సులో మంత్రి కేటీఆర్..
మంత్రి కేటీఆర్
  • Share this:
KTR: హెచ్‌ఐసీసీ వేదికగా ఘనంగా బయో ఏషియా 2020 సదస్సు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు 37 దేశాలకు చెందిన 2వేల మంది ప్రతినిధులు హైదరాబాద్ తరలివచ్చారు. ఈ సందర్భంగా లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్‌ ట్రోపికల్ మెడిసిన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. సిన్ జీన్ బయోటెక్ రిసర్చ్ సెంటర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నామని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. దేశంలోని 35 శాతం మెడిసిన్స్ హైదరాబాద్ కేంద్రంగా తయారవుతున్నాయని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో.. 800 ఫార్మా కంపెనీలు ఉన్నాయని తెలిపారు. 276 ఎకరాల్లో మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు చేశామని… రెండేళ్ల వ్యవధిలోనే 20 కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించాయని పేర్కొన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కంపెనీలు హైదరాబాద్‌కు తరలివస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్‌ను ప్రోత్సాహిస్తోందని ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. బయో ఏషియా సదస్సులో తమ స్టాల్స్‌ని పెట్టుకునేందుకు 150కి పైగా స్టార్టప్‌లు అప్లై చేసుకున్నాయని చెప్పారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. ఇక.. ఈ నెల 19 వరకు జరగనున్న ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న మార్పులపై చర్చించనున్నారు. ఈ రంగాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు.

First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు