Home /News /business /

KTM RC390 ANOTHER PREMIUM BIKE LAUNCH FROM KTM RC390 EDITION RELEASED WITH RS 3 14 LAKHS GH VB

KTM RC390: KTM నుంచి మరో ప్రీమియం బైక్ లాంచ్.. రూ.3.14 లక్షలతో కేటీఎం RC390 (2022) ఎడిషన్ రిలీజ్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బైక్ లవర్స్‌కు పరిచయం అక్కర్లేని బ్రాండ్ KTM. ఈ కంపెనీ ఎప్పటికప్పుడు ఆల్ట్రా ప్రీమియం, స్పోర్టీ మోటార్ సైకిల్స్ విడుదల చేస్తుంది. ఈ క్రమంలో కేటీఎం నుంచి తాజాగా మరో బైక్ లాంచ్ అయింది.

బైక్ లవర్స్‌కు(Lovers) పరిచయం అక్కర్లేని బ్రాండ్ KTM. ఈ కంపెనీ ఎప్పటికప్పుడు ఆల్ట్రా ప్రీమియం, స్పోర్టీ మోటార్ సైకిల్స్ విడుదల చేస్తుంది. ఈ క్రమంలో కేటీఎం నుంచి తాజాగా మరో బైక్ లాంచ్ అయింది. KTM RC 390 ఎడిషన్ లేటెస్ట్ వెర్షన్‌(Latest Version) ఎట్టకేలకు సరికొత్త అవతార్‌లో వచ్చింది. దీని ధర రూ. 3.14 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఇప్పుడు రెండు కొత్త కలర్ ఆప్షన్స్‌లో(Color Options) వస్తుంది. KTM ఫ్యాక్టరీ రేసింగ్ బ్లూ, KTM ఆరెంజ్ కలర్స్‌లో బైక్స్ సెలక్ట్ చేసుకోవచ్చు. KTM RC 390 బైక్ ఇప్పటికే మంచి ఫీడ్‌బ్యాక్‌తో(Feed Back) దూసుకుపోతోంది. కొత్త 2022 ఎడిషన్‌లో(Edition) ఇంతకు ముందు అందుబాటులో లేని అనేక ఫీచర్లను కంపెనీ యాడ్ చేసింది. గ్రాండ్ ప్రిక్స్-ఇన్‌స్పైర్డ్ డిజైన్‌కు అనుగుణంగా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. మోటార్‌సైకిల్ అప్‌డేటెడ్ వెర్షన్‌లోని ఎలక్ట్రానిక్స్‌లో ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ABS, సూపర్‌మోటో మోడ్, క్విక్‌షీటర్+, సరికొత్త డిజిటల్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త బైక్ లాంచింగ్‌పై బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రెసిడెంట్ (ప్రోబైకింగ్) సుమీత్ నారంగ్ మాట్లాడారు. నెక్స్ట్ జెనరేషన్ KTM RC 390 ప్రీమియం పనితీరుతో ఈ రేంజ్‌లో టాప్ బైక్‌గా నిలుస్తుందన్నారు. ఇది రియల్ రేస్ ట్రాక్-బేస్డ్ బైక్‌గా కస్టమర్లకు మంచి ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని చెప్పారు.

NPS or EPF: ఎన్‌పీఎస్‌ లేదా ఈపీఎఫ్‌.. ఈ రెండు స్కీమ్స్‌లో రిటైర్‌మెంట్‌ ప్లానింగ్‌కు ఏది బెస్ట్‌ ఆప్షన్..?


విజువల్ అప్‌డేట్ పరంగా RC390 బైక్ అడ్వాన్స్‌డ్, ట్రాక్ రెడీగా కనిపిస్తోంది. బైక్ ఇప్పుడు 13.7-లీటర్ ఫ్యుయెల్ ట్యాంక్‌తో వస్తుంది. కొత్త హాలో యాక్సిల్స్, బయోనిక్ వీల్స్ 2022 KTM RC390 బైక్ వెయిట్‌ను తగ్గిస్తాయి. తగ్గిన బరువుతో ఎక్కువ స్థిరత్వాన్ని అందించేలా ఛాసిస్‌ను రీడిజైన్ చేశారు. సస్పెన్షన్ భాగాల కోసం, KTM ఫ్రంట్ ఎండ్‌లో ఓపెన్ కాట్రిడ్జ్ WP APEX అప్‌సైడ్-డౌన్ ఫోర్క్‌లను, ప్రీ-లోడ్ అడ్జస్టబిలిటీతో WP APEX రియర్ షాక్స్‌ను వాడారు. అడ్వెంచర్ వేరియంట్‌లో కనిపించే మెరుగైన TFT మల్టీకలర్ డిస్‌ప్లే దీని స్పెషాలిటీ. అవుట్‌గోయింగ్ మోడల్‌ కంటే ఈ డిస్‌ప్లే మెరుగ్గా కనిపిస్తుంది. ఇతర లేటెస్ట్ టూ-వీలర్‌ల మాదిరిగానే ఈ బైక్ కూడా బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌తో మెషీన్‌ను ఈజీగా పెయిరింగ్ చేసుకోవచ్చు.

2022 RC 390 బైక్ 373 cc ఇంజిన్‌తో వస్తుంది. 40% లార్జర్ ఎయిర్‌బాక్స్‌, 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ పవర్-అసిస్టెడ్ యాంటీ-హాపింగ్ స్లిప్పర్ క్లచ్‌తో బైక్ ఆకట్టుకుంటుంది. ఈ బైక్ సింగిల్-సిలిండర్ 4-వాల్వ్, లిక్విడ్-కూల్డ్, DOHC ఇంజిన్‌తో వస్తుంది. ఇది 42.9bhp గరిష్ట శక్తిని, 37Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రానుంది. వీటితో పాటు క్విక్‌షిఫ్టర్‌ ఫీచర్ యూజర్లను ఆకట్టుకోనుంది.
Published by:Veera Babu
First published:

Tags: Ktm model, Ktm sports bike, New bike, New bikes

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు