లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ KTM AG, ఇండియన్ మార్కెట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. భారత్‌లోనే ప్రీమియం బైక్స్ తయారు చేయడంతో పాటు వాటిని విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా మిడిల్ వెయిట్ మోటార్‌సైకిళ్లను ఇండియాలో తయారు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు KTM AG కంపెనీ CEO స్టీఫన్ పియరర్. ఒక ఇంటర్నేషనల్ పబ్లికేషన్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పియరర్ మాట్లాడుతూ, కంపెనీ 790 డ్యూక్ ఆధారంగా ఇండియన్ కస్టమర్ల కోసం సరికొత్త 650 cc ట్విన్-సిలిండర్ మోటార్‌సైకిల్ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేస్తోందని తెలిపారు.
కంపెనీ గతంలో ఒక కొత్త 500cc ఇంజిన్ బైక్‌ను తయారు చేస్తున్నట్లు నివేదికలు వచ్చాయి. అయితే KTM ఇప్పుడు ఇంతకంటే పెద్దగా 650-690cc ప్యార్లల్ ట్విన్-సిలిండర్ యూనిట్‌పైనే దృష్టి సారించాలని నిర్ణయించుకుంది. రాబోయే రెండేళ్లలో ఈ బైక్ భారత మార్కెట్లోకి వస్తుందని పియరర్ చెప్పారు. కొత్త 650 లేదా 690cc ఇంజిన్ యూనిట్‌ను అభివృద్ధి చేయడానికి కంపెనీ ప్రస్తుత 790cc ఆర్కిటెక్చర్‌ను ఉపయోగిస్తుందని పియరర్ తెలిపారు.
650 సెగ్మెంట్ ఆర్థికంగా మరింత లాభదాయకంగా ఉందని కేటీఎం సీఈఓ పియరర్ తెలిపారు. ఇండియాలో ట్విన్-సిలిండర్ ప్లాట్‌ఫామ్ డెవలప్‌మెంట్ కోసం ప్రస్తుతం బజాజ్ కంపెనీతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. కొత్త మేడ్ ఇన్ ఇండియా బైక్‌ను నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా, ఆస్ట్రేలియా వంటి మార్కెట్‌లకు ఎక్స్‌పోర్ట్ చేస్తామని వెల్లడించారు.
* డ్యూక్ రేంజ్‌పై ఫోకస్
కంపెనీ ఈ సంవత్సరం డ్యూక్ రేంజ్‌ను ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే కొన్ని బైక్స్ టెస్టింగ్స్ జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ లిస్ట్‌లో నెక్ట్స్ జనరేషన్ KTM డ్యూక్ 390 బైక్.. 2023 మధ్య నాటికి ఇండియన్ మార్కెట్లోకి రానుంది.
ఇది కూడా చదవండి : నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్‌తో అనేక ప్రయోజనాలు.. ఓ లుక్కేయండి!
కొత్త బైక్ 1290 సూపర్ డ్యూక్ తరహాలో మరింత అగ్రెసివ్ డిజైన్‌తో, స్పెషల్ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది. దీని ఇంజిన్ పవర్ 399cc వరకు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ న్యూ జనరేషన్ KTM డ్యూక్ 390 వెహికల్.. ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ABS, క్విక్ షిఫ్టర్, కొత్త సస్పెన్షన్, వీల్, బ్రేక్ సిస్టమ్‌తో రానుంది. అయితే ఈ వివరాలను కంపెనీ ఇంకా నిర్ధారించలేదు.
మరోవైపు, ట్రయంఫ్ బ్రాండ్ పేరుతో మరో కొత్త బైక్‌ను కూడా భారత మార్కెట్ కోసం రూపొందించనున్నట్లు పియరర్ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాదిలోగా కొత్త ట్రయంఫ్‌ను విడుదల చేయవచ్చని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.