KTM RC series: కేటీఎం ఆర్​సీ సిరీస్​లో రెండు కొత్త బైక్​లు లాంచ్​.. ధర, ఫీచర్ల వివరాలివే!

కేటీఎం ఆర్​సీ సిరీస్​లో కొత్త బైక్

RC సిరీస్​లో రెండు కొత్త బైక్​ను భారత మార్కెట్​లోకి లాంచ్​ చేసింది కేటీఎం సంస్థ. ఇవి ఆగస్టు నెలలోనే గ్లోబల్​ మార్కెట్​లోకి లాంచ్​ అయినప్పటికీ.. భారత మార్కెట్​లోకి మాత్రం ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి.

  • Share this:
స్పోర్ట్స్‌ బైక్స్‌ బ్రాండ్‌ కేటీఎం భారత్‌లో టాప్‌ గేర్‌లో దూసుకెళ్తోంది. కంపెనీ కొత్త కొత్త మోడల్స్​ను ప్రవేశపెడుతూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా RC సిరీస్​లో రెండు కొత్త బైక్​ను భారత మార్కెట్​లోకి లాంచ్​ చేసింది కేటీఎం సంస్థ. ఇవి ఆగస్టు నెలలోనే గ్లోబల్​ మార్కెట్​లోకి లాంచ్​ అయినప్పటికీ.. భారత మార్కెట్​లోకి మాత్రం ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి.

కేటీఎం ఆర్​సీ125 బైక్​ రూ. 1.82 లక్షలు, కేటీఎం ఆర్​సీ 200​ బైక్​ రూ. 2.09 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద లభిస్తాయి. వీటి బుకింగ్స్​ కూడా అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ రెండు బైక్స్​ వచ్చే నెలలో డీలర్‌షిప్‌ సెంటర్లకు చేరుకోనున్నాయి.

ఇప్పటికే బుకింగ్​ చేసుకున్న వారికి త్వరలోనే బైక్​ డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ స్పష్టం చేసింది. దీనిపై కేటీఎం​ ప్రో-బైకింగ్ బిజినెస్ యూనిట్​ ప్రెసిడెంట్​ సుమీత్ నారంగ్ మాట్లాడుతూ ‘‘భారత యువతలో కేటీఎం స్పోర్ట్స్​ బైక్స్​కు ఎంతో ఆదరణ ఉంది. అందుకే అనేక అప్‌గ్రేడ్‌లతో, కొత్త కేటీఎం ఆర్​సీ 200, ఆర్​సీ 125 బైక్​ల​ను లాంచ్​ చేశాం. ఇవి స్పోర్ట్స్​ విభాగంలో ఆధిక్యాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాయి. నవంబర్ నుంచి వీటి డెలివరీలు ప్రారంభమవుతాయి. కేటీఎం భారత్​లో ప్రారంభమై పేదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా రెండు కొత్త బైక్​లను లాంచ్​ చేయడం ఆనందంగా ఉంది” అని తెలిపారు.

మునుపటి వెర్షన్లను తలదన్నేలా అప్​గ్రేడెడ్ ఫీచర్లు..

కొత్త కేటీఎమ్ ఆర్‌సి 200, ఆర్‌సి 125 బైక్​లు వాటి ఫస్ట్​ జనరేషన్​ మోడళ్లకు అప్​గ్రేడ్​ వెర్షన్లుగా విడుదలయ్యాయి. ఆర్​సీ సిరీస్​ బైక్​లలో ట్విన్-బారెల్ హెడ్‌ల్యాంప్ సెటప్‌కు బదులుగా పెంటగోనల్ హెడ్‌ల్యాంప్‌ని అందించింది కేటీఎం. ఈ హెడ్‌ల్యాంప్ ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్​తో వస్తుంది. కొత్త RC 125, RC 200 బైక్​లలో అడ్జెస్టబుల్​ హ్యాండిల్‌బార్లు, 13.7 లీటర్ల ఇంధన ట్యాంక్​లను చేర్చింది.

వీటిలో టాకోమీటర్, ట్రిప్ మీటర్, ఏబీఎస్​ ఇండికేటర్​, గేర్ ఇండికేటర్ మొదలైన అన్ని రీడౌట్‌ డిస్​ప్లేలను అందించింది. KTM RC 125 ఇంజిన్​ విషయానికి వస్తే.. దీనిలోని BS6- కంప్లైంట్ 124.7 cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ 15 bhp వద్ద12 Nm గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఇక, కొత్త కేటీఎం RC 200 ఇంజిన్​ విషయానికి వస్తే.. దీనిలోని 199.5 cc లిక్విడ్-కూల్డ్ యూనిట్, 25 bhp వద్ద 19 Nm టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది.
Published by:Sambasiva Reddy
First published: