KTM Bikes: కేటీఎం నుంచి మరో అడ్వెంచర్ బైక్.. భారత్లో విడుదల ఎప్పుడంటే...

దేశీయ దిగ్గజ వాహన సంస్థ బజాజ్ తన ప్రీమియం బైక్ కేటిఎం 890 అడ్వెంచర్కు సంబంధించిన వివరాలను బహిర్గతం చేసింది. దీనిలో భాగంగా కేటీఎం తన 890 అడ్వెంచర్ ఆర్ మరియు 890 అడ్వెంచర్ ఆర్ ర్యాలీ బైక్ చిత్రాలు మరియు వివరాలను విడుదల చేసింది.

news18-telugu
Updated: October 19, 2020, 11:11 PM IST
KTM Bikes: కేటీఎం నుంచి మరో అడ్వెంచర్ బైక్.. భారత్లో విడుదల ఎప్పుడంటే...
(Photo: KTM)
  • Share this:
దేశీయ దిగ్గజ వాహన సంస్థ బజాజ్ తన ప్రీమియం బైక్ కేటిఎం 890 అడ్వెంచర్కు సంబంధించిన వివరాలను బహిర్గతం చేసింది. దీనిలో భాగంగా కేటీఎం తన 890 అడ్వెంచర్ ఆర్ మరియు 890 అడ్వెంచర్ ఆర్ ర్యాలీ బైక్ చిత్రాలు మరియు వివరాలను విడుదల చేసింది. స్టైల్, ఫీచర్ల పరంగా చూస్తే ఇది ప్రీమియం బైక్ల శ్రేణిలో అద్భుతమైన బైక్గా నిలువనుందని ఇప్పటికే విడుదలైన ఫోటోలను చూస్తే తెలుస్తుంది. కాగా, డిజైన్ విషయానికి వస్తే 890 అడ్వెంచర్ బైక్ 890 అడ్వెంచర్ ఆర్ మాదిరిగానే ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ రెండు వెర్షన్లు ఇదివరకే విడుదలైన 790 అడ్వెంచర్ మరియు 790 అడ్వెంచర్ ఆర్పై ఆధారపడి ఉంటాయి. 890 అడ్వెంచర్ మరియు 890 అడ్వెంచర్ ఆర్ రెండింటిలోనూ 790 అడ్వెంచర్‌లో మనం చూసిన విధంగానే హెడ్‌లైట్లు, వినిమల్  బాడీవర్క్, లో స్లాంగ్ ఫ్యూయల్ ట్యాంక్ మరియు టూ పీస్ సీటు వంటి ఫీచర్లను ఆశించవచ్చు.

దీనితో పాటు 890 అడ్వెంచర్లో పరికరాలను అప్‌గ్రేడ్ చేయడానికి ఉపయోగించే పవర్‌పార్ట్‌ల యొక్క సమగ్ర జాబితాను కూడా కంపెనీ అందించనుంది. అయితే, దీనికి ముందే కేటిఎం 890 అడ్వెంచర్ ఆర్ మరియు 890 అడ్వెంచర్ ఆర్ ర్యాలీ పవర్ట్రెయిన్ ఆప్షన్లను కెటిఎం వెల్లడించింది. ఈ రెండు వెర్షన్లు 889 సిసి డిస్ప్లేస్మెంట్ను కలిగి ఉంటాయని కేటీఎం పేర్కొంది.

అయితే,  కేటీఎం 890 డ్యూక్ విషయానికి వస్తే ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 105 హెచ్‌పి మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 100 ఎన్ఎమ్ టార్క్ ను కలిగి ఉంటుంది. 790 అడ్వెంచర్ బైక్లో ఉపయోగించే ఇంజన్, 890 అడ్వెంచర్లో ఉపయోగించే దాని కన్నా 20 శాతం హెవీ క్రాంక్షాఫ్ట్ను కలిగి ఉంటుంది. ఇది తక్కువ ఆర్పీఎం వద్ద స్టెబిలిటీని జోడిస్తుందని కేటీఎం పేర్కొంది.

కేటీఎం ఈ ఏడాదిలో 250 అడ్వెంచర్‌ను భారతదేశంలో ప్రారంభించటానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే, అడ్వెంచర్ 890 భారతదేశంలోకి ఈ ఏడాది ప్రవేశించడంపై కేటీఎం ఇంకా స్పష్టతనివ్వలేదు.
Published by: Krishna Adithya
First published: October 19, 2020, 11:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading