Rupay Credit Cards: బ్యాంకుగా మారనున్న ప్రముఖ సంస్థ.. రూపే క్రెడిట్ కార్డు సేవలు ప్రారంభం.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

వ్యక్తిగత రుణాల (Personal Loan) ప్లాట్ ఫాం క్రెడిట్ బీ.. నియో బ్యాంకుగా (వర్చువల్ బ్యాంకు లేదా ఆన్ లైన్) మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం వ్యక్తిగత రుణాలను అందజేస్తున్న తాము త్వరలో ఇతర సేవల్లోకి అడుగుపెడతామని కంపెనీ సీఈఓ మధుసూదన్ ఏకాంబరం తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన సంస్థ గురించి పలు కీలక విషయాలను ప్రస్తావించారు.

  • Share this:
వ్యక్తిగత రుణాల (Personal Loan) ప్లాట్ ఫాం క్రెడిట్ బీ.. నియో బ్యాంకుగా (వర్చువల్ బ్యాంకు లేదా ఆన్ లైన్) మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం వ్యక్తిగత రుణాలను అందజేస్తున్న తాము త్వరలో ఇతర సేవల్లోకి అడుగుపెడతామని కంపెనీ సీఈఓ మధుసూదన్ ఏకాంబరం తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన సంస్థ గురించి పలు కీలక విషయాలను ప్రస్తావించారు. లీడింగ్ నియో బ్యాంకుగా మారేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలో అనేక సేవలను ప్రారంభించనున్నామని ఆయన స్పష్టం చేశారు. సాంప్రదాయ బ్యాంకు బ్రాంచ్‌లు, నెట్‌వర్క్‌లు లేకుండా ఆన్‌లైన్‌లో ప్రత్యేకంగా పనిచేసే ఒక రకమైన ప్రత్యక్ష బ్యాంకును నియో బ్యాంక్ అంటారు. "ఇప్పటికే మేము బై నౌ పే లేటర్(BNPL) క్షేత్రంలోకి ప్రవేశించాం. ఇందుకోసం అనేక భాగస్వాములతో కలవబోతున్నాం. అంతేకాకుండా క్రెడిట్ కార్డుల విభాగంలోనూ ప్రవేశించాం. భారత్‌లో క్రెడిట్ కార్డు వ్యాప్తి రెండు నుంచి మూడు శాతం మాత్రమే ఉంది. అంటే 97 శాతం మంది భారతీయులకు క్రెడిట్ కార్డ్ యాక్సెస్ లేదు.

2022 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 10 లక్షల మందికి కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అని మధుసూదన్ తెలిపారు. క్రెడిట్ బీ కంపెనీ ఆర్బీఎల్ బ్యాంకు భాగస్వామ్యంతో రూపే ప్రీ-పెయిడ్ కార్డు ద్వారా క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. టైర్-2, టైర్-3 నగరాలపై దృష్టి సారించి వినియోగదారులకు రూ.10,000 వరకు క్రెడిట్ పరిమితిని పొందే వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం సింగిల్ బిల్లింగ్ సైకిల్‌ను మాత్రమే కలిగి ఉండి 45 రోజులకు మించి చెల్లింపు తీసుకోవట్లేదు. ప్రస్తుతం ఈ కంపెనీ 2 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను అందిస్తోంది. అంతేకాకుండా రూ. 10వేల నుంచి 15 వేల వరకు కవరేజీతో చిన్న సైజు వైద్య బీమా సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది.

క్రెడిట్ బీ రోజుకు 20 వేల రుణాలను మంజూరు చేస్తోంది. రోజుకు 5 వేల వైద్య బీమాలను జారీ చేస్తోంది. 2022 ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఈ గణాంకాలు రెండు రెట్లు పెరుగుతాయని కంపెనీ సీఈఓ మధుసూదన్ తెలిపారు. రుణాలు 40 వేలు, వైద్య బీమాలు 10 వేల నుంచి 5 వేలు మంజూరు చేస్తామని చెప్పారు. క్రెడిట్ కార్డు, బీమా సదుపాయలు పొందడంలో అంతరాన్ని తగ్గించడంతో పాటు కస్టమర్ బేస్‌లో 80 శాతం మేట్రోయేతర నగరాల నుంచి వచ్చినట్లు మధుసూదన్ తెలిపారు. ప్రస్తుతం తమ క్రెడిట్ లైన్‌ను యాక్సెస్ చేస్తోన్న కస్టమర్ల సంఖ్యను భారత జనాభాలో 10 శాతం పెంచడమే లక్ష్యమని, రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో ఇది సాధ్యమవుతుందని వెల్లడించారు.
Published by:Veera Babu
First published: