Kotak Home Loan: కోటక్‌ మహీంద్రా బంపర్ ఆఫర్.. తక్షణమే హోమ్ లోన్.. సరికొత్త సర్వీస్

(ప్రతీకాత్మక చిత్రం)

Koak Home loan: కోటక్ వెబ్ సైట్ ద్వారా కోటక్ డిజి హోంలోన్లను ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే కోటక్ వినియోగదారులైతే బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా డిజి హోంలోన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

  • Share this:
కోటక్ మహీంద్రా బ్యాంకు సరికొత్త సేవను ప్రారంభించింది. తక్షణ గృహ రుణాలను అందజేసేందుకు డిజిటల్ ప్లాట్ ఫాం ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. 6.75 శాతం నుంచి ప్రారంభమయ్యే హోంలోన్లను ఈ బ్యాంకు అందిస్తోంది. బ్యాంకు విడుదల చేసిన ప్రకటన ప్రకారం గృహ రుణ దరఖాస్తుదారులు తమ రుణ మొత్తాన్ని అర్హతను వర్తించే రేటును ఆన్ లైన్ లో వెంటనే తనిఖీ చేయవచ్చు. అంతేకాకుండా తక్షణమే మంజూరు లేఖను కూడా అందుకోవచ్చు. ఇది గృహ రుణాలను తీసుకునే ఔత్యాహికులకు, ఇంటి కొనుగోలుదారుల ప్రయాణాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

హోంలోన్ల తక్షణ అనుమతి ఇప్పటికే ఉన్న కారణంగా నూతన కోటక్ వినియోగదారులకు జీతం, స్వయం ఉపాధి కస్టమర్ విభాగాలకు లభిస్తుందని బ్యాంకు తెలిపింది. దరఖాస్తుదారులు తాజా హోంలోన్ బ్యాలెన్స్ బదిలీ లేదా టాప్ అప్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ సదుపాయాన్ని ఉపయోగించవచ్చు.

తక్షణ గృహరుణం ఎలా పనిచేస్తుంది..
కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండ్-టు-ఎండ్ పూర్తి డిజిటల్, పేపర్ లెస్ ప్రక్రియ ద్వారా హోంలోన్లు అందించనుంది. కోటక్ డిజి హోంలోన్స్ తక్షణ డిజిటల్ క్రెడిట్ అసెస్మెంట్ నిర్వహిస్తోందని దరఖాస్తుదారుడు ఆమె లేదా అతడి గృహరుణ అర్హతం మొత్తం, రుణ కాలపరిమితి, వడ్డీరేటు, ఇఎంఐలను సూచిస్తారని ఈ బ్యాంకు తెలిపింది. దరఖాస్తుదారు రుణ మొత్తాన్ని, కాలపరిమితిని ఎంచుకోవచ్చు. అర్హతగల రుణమొత్తాన్ని పెంచడానికి సహదరఖాస్తుదారుని చేర్చవచ్చు. అంతేకాకుండా అప్లికెంట్స్ సూత్రప్రాయంగా మంజూరు లేఖను అందుకుంటారు. అనంతరం ఆన్ లైన్ లో డాక్యూమెంట్స్ సబ్మిట్ కోసం ముందుకు వెళ్తారు.

ఈ నూతన ప్రకటనపై కోటక్ మహీంద్రా బ్యాంకు కంజూమర్ అసెట్స్ అధ్యక్షుడు అంబుజ్ చంద్నా మాట్లాడుతూ.. "బ్యాంకింగ్ సేవలు సులభతరం, వేగంగా చేయడమనేది మా వినియోగదారులకు చేసిన వాగ్ధానం. డిజిటల్ ఫస్ట్ విధానా్ని ఉపయోగించి గృహ వినియోగదారులు ఇప్పుడు పూర్తిగా పేపర్లెస్, కాంటాక్ట్ లెస్ పద్ధతిలో వారి రుణ అర్హతను అన్ని వివరాలతో పాటు తక్షణ రుణ మంజూరును అందుకుంటారు. ఆపైన 6.75 శాతం ప్రత్యేక గృహ రుణ వడ్డీరేటును అందిస్తూనే ఉంటాం. ఇది మా వినియోగదారులకు విన్-విన్ ప్రతిపాదన డ్రీం హోం కోసం అన్వేషం దీని ద్వారా సులభతరం అయింది" అని ఆయన అన్నారు.

ఎలా దరఖాస్తు చేయాలి..
కోటక్ వెబ్ సైట్ ద్వారా కోటక్ డిజి హోంలోన్లను ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే కోటక్ వినియోగదారులైతే బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా డిజి హోంలోన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. హోంలోన్స్ పై వడ్డీరేటు వచ్చేసి.. కోటక్ గృహ రుణాలు, బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ లోన్లను 6.75 శాతం నుంచి ప్రారంభిస్తుంది. ఇది గృహ రుణ మార్కెట్లో అతి తక్కువ రేట్లలో ఒకటి.
Published by:Kishore Akkaladevi
First published: