హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank: రూ.లక్ష‌ను రూ.10 కోట్లుగా మార్చిన బ్యాంక్.. డబ్బులు పెట్టినోళ్లకు కాసుల వర్షం!

Bank: రూ.లక్ష‌ను రూ.10 కోట్లుగా మార్చిన బ్యాంక్.. డబ్బులు పెట్టినోళ్లకు కాసుల వర్షం!

 Bank: రూ.లక్ష‌ను రూ.10 కోట్లుగా మార్చిన బ్యాంక్.. డబ్బులు పెట్టినోళ్లకు కాసుల వర్షం!

Bank: రూ.లక్ష‌ను రూ.10 కోట్లుగా మార్చిన బ్యాంక్.. డబ్బులు పెట్టినోళ్లకు కాసుల వర్షం!

Bank Stocks | ఇటీవల కాలంలో బ్యాంక్ స్టాక్స్ దుమ్మురేపుతున్నాయి. మరీముఖ్యంగా ప్రభుత్వ రంగ షేర్లు జోరు మీద ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందిస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Kotak Mahindra Bank | ప్రైవేట్ రంగాని చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ (Bank) భారీ లాభాలు అందించింది. బ్యాంక్ షేర్లు (Stocks) ఇన్వెస్టర్లకు కళ్లుచెదిరే ప్రాఫిట్ అందించాయి. ఎంతలా అంటే రూ. లక్ష ఏకంగా రూ. 10 కోట్లుగా మారిపోయింది. అంటే ఏ స్థాయిలో రాబడి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. కోటక్ బ్యాంక్ షేర్లు పరుగులు పెడుతూ రావడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఈ బ్యాంక్ షేర్లు గతంలో కొన్న వారికి భారీ లాభాలు వచ్చి ఉంటాయని చెప్పుకోవచ్చు.

కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇన్వెస్టర్లకు ఏకంగా 80 వేల శాతం రాబడిని ఇచ్చింది. షేరు ధర రూ. 2 నుంచి రూ. 1900 స్థాయికి పరుగులు పెట్టింది. షేరు 52 వారాల గరిష్ట స్థాయి రూ. 2107గా ఉందని చెప్పుకోవచ్చు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు ధర 2001 అక్టోబర్ 19న కేవలం రూ. 1.9 వద్ద ఉండేది. అయితే 2022 నవంబర్ 15న ఈ షేరు ధర ఏకంగా రూ. 1920 స్థాయికి చేరింది. అంటే బ్యాంక్ షేరు గత 21 ఏళ్లలో ఏకంగా 80 వేల శాతానికి పైగా రాబడిని ఇచ్చిందని చెప్పుకోవచ్చు.

భారీ షాక్.. ఏకంగా రూ.5,400 వరకు పెరిగిన బంగారం, వెండి ధరలు.. జస్ట్ 7 రోజుల్లోనే..

అంటే ఈ స్టాక్‌లో 2001 అక్టోబర్ 19న రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు ఆ మొత్తం విలువ ఏకంగా రూ. 10 కోట్లకు పైగా చేరి ఉండేది. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గత పదేళ్ల కాలంలో ఇచ్చిన రిటర్న్‌ను గమనిస్తే.. షేరు ధర 2012 నవంబర్ 16న బీఎస్ఈలో రూ. 310 వద్ద ఉంది. ఇప్పుడు షేరు ధర రూ. 1920 స్థాయికి చేరింది. అంటే షేరు ధర భారీగానే పెరిగింది. పదేళ్ల కిందట ఈ స్టాక్‌లో రూ.లక్ష పెట్టి ఉంటే.. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ. 6.18 లక్షలకు చేరి ఉండేది.

భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. కేంద్ర మంత్రి ముఖ్య ప్రకటన!

ఇకపోతే స్టాక్ మార్కెట్‌లో భారీ రిస్క్ ఉంటుందని గుర్తించుకోవాలి. అందువల్ల డబ్బులు పెట్టాలని భావించే వారు ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. లేదంటే నష్టపోవాల్సి రావొచ్చు. కొన్ని సందర్బాల్లో పెట్టిన డబ్బులు కూడా వెనక్కి రాకపోవచ్చు. చాలా చాలా రిస్క్ ఉంటుంది. అందవల్ల జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే పైన పేర్కొన్న సమాచారం కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇచ్చాం. దీని ఆధారంగా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయవద్దు.

First published:

Tags: Banks, Kotak Mahindra Bank, Stock Market, Stocks

ఉత్తమ కథలు