Home /News /business /

FD Rates: ఫిక్స్​డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. తాజా వడ్డీ రేట్లను పరిశీలించండి

FD Rates: ఫిక్స్​డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. తాజా వడ్డీ రేట్లను పరిశీలించండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా ఫిక్స్​ డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. సాధారణ కస్టమర్ల కంటే సీనియర్​ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ ఆఫర్​ చేస్తోంది. సెప్టెంబర్ 8 నుంచి ఈ కొత్త వడ్డీ రేట్లను అమల్లోకి తెచ్చింది.

ఇంకా చదవండి ...
స్థిరమైన ఆదాయాన్నిచ్చే పెట్టుబడి మార్గంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మంచి పేరుంది. అందుకే ఎక్కువ మంది ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు ఎఫ్​డీల్లో పెట్టుబడికి ఆసక్తి చూపిస్తుంటారు. వీరిని ఆకర్షించేందుకు బ్యాంకులు కూడా ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా ఫిక్స్​ డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. సాధారణ కస్టమర్ల కంటే సీనియర్​ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ ఆఫర్​ చేస్తోంది. సెప్టెంబర్ 8 నుంచి ఈ కొత్త వడ్డీ రేట్లను అమల్లోకి తెచ్చింది. కోటక్​ మహీంద్రా బ్యాంక్​ తాజా ఎఫ్​డీ వడ్డీ రేట్లను పరిశీలిద్దాం.

తాజా వడ్డీ రేట్లు ఇవే..
కోటక్​ మహీంద్రా బ్యాంకు కస్టమర్ల నుంచి రూ .2 కోట్ల వరకు డిపాజిట్లను స్వీకరిస్తోంది. తాజాగా సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం.. 7 నుంచి 30 రోజుల వరకు మెచూరిటీ గల ఎఫ్​డీపై 2.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 31 నుంచి 90 రోజుల్లో మెచూరిటీ అవుతున్న డిపాజిట్లపై 2.75 శాతం, 91-120 రోజుల వ్యవధి గల ఎఫ్​డీపై 3 శాతం, 121-179 రోజుల ఎఫ్​డీపై 3.25 శాతం వడ్డీ రేట్లను అమలు చేస్తోంది. 180-269 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.25 శాతం, 270- 364 రోజుల ఎఫ్​డీపై 4.4 శాతం వడ్డీ అందజేస్తుంది. 365- 389 రోజుల వరకు 4.5 శాతం, 390 రోజుల నుంచి 23 నెలల ఎఫ్​డీపై 4.75 శాతం వడ్డీ రేటు అమలు చేస్తోంది.

సీనియర్​ సిటిజన్లకు ఇలా..
సీనియర్ సిటిజన్లకు, కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వారి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ అందజేస్తుంది. 7- 14 రోజుల ఎఫ్​డీపై 3 శాతం వడ్డీ అందజేస్తుంది. 180 రోజుల మెచూరిటీ గల ఎఫ్​డీపై 4.75 శాతం వడ్డీ రేట్లను అమలు చేస్తుంది. 364 రోజుల ఫిక్స్​డ్​ డిపాజిట్​పై 4.9 శాతం, 23 నెలల నుంచి 2 సంవత్సరాల మెచూరిటీ గల డిపాజిట్లపై 5.4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 5 సంవత్సరాల కంటే ఎక్కువ వ్యవధి గల డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ అమలు చేస్తోంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Business

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు