KOTAK MAHINDRA BANK REDUCED INTEREST RATES ON HOME LOANS TO ALL TIME LOW MK
Kotak Mahindra Bank: కొత్త ఇల్లు కొంటున్నారా...అయితే 7 శాతం కన్నా తక్కువ వడ్డీకే Home Loan..
ప్రతీకాత్మక చిత్రం
కొత్త ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..అయితే ప్రైవేటు రంగంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ హోం లోన్ వడ్డీరేట్లను భారీగా తగ్గించింది. బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. గృహ రుణ వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గింది.
కొత్త ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..అయితే ప్రైవేటు రంగంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ హోం లోన్ వడ్డీరేట్లను భారీగా తగ్గించింది. బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. గృహ రుణ వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గింది. దీనితో ఈ రుణ రేటు 6.50 శాతం నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ‘ఈ రేటు దశాబ్దపు కనిష్ట స్థాయి’ అని కన్జ్యూమర్ అసెట్స్ ప్రెసిడెంట్ అంబుచ్ చందన తెలిపారు. అయితే ఆ ఆఫర్ రెండు నెలలు అంటే నవంబర్ 8వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కరోనా తరువాత హోమ్ లోన్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో కస్టమర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు హోమ్ లోన్లపై ఆకట్టుకునే వడ్డీ రేట్లను ప్రకటించాయి. సొంత ఇంటిని కొనుగోలు చేయాలనుకున్న వినియోగదారులు ఏయే బ్యాంకులు తక్కువ వడ్డీరేట్లతో లోన్లు ఇస్తున్నాయో ఆరా తీయాలి. ప్రస్తుత డిమాండ్‌కు అనుగుణంగా వివిధ బ్యాంకులు తక్కువ వడ్డీతోనే హోమ్ లోన్లను అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు 7 శాతం కంటే తక్కువ వడ్డీరేటుతో లోన్లు ఇస్తున్నాయి. అద్దెకు చెల్లించే డబ్బుతోనే ఈ వడ్డీ రేట్లు కట్టవచ్చని భావిస్తున్న వినియోగదారులు సొంత ఇంటి కోసం హోమ్ లోన్లను ఎంచుకుంటున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India - SBI) వంటి ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ఇతర బ్యాంకులు కూడా తక్కువ వడ్డీతో హోమ్ లోన్లను అందిస్తున్నాయి.
కొటక్ మహీంద్రా బ్యాంక్ హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. ఇటీవల సవరించిన వడ్డీరేట్ల తరువాత ఈ బ్యాంకు అందిస్తున్న హోమ్ లోన్ రేటు 6.50 శాతానికి తగ్గించింది. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఈ బ్యాంకు అతి తక్కువ వడ్డీ విధిస్తోంది. మార్కెట్ పరిస్థితులు సొంత ఇంటి కొనుగోలుకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో సులభంగా, అతి తక్కువ వడ్డీతో లోన్లు తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకు డిజిటల్ ప్లాట్ ఫారంలో కొటక్ డిజి హోమ్ లోన్ సెక్షన్ నుంచి కూడా సులభంగా హోమ్ లోన్ తీసుకోవచ్చు.
డిజిటల్ విధానంలోనూ తీసుకోవచ్చు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ లోన్లపై ప్రస్తుతం 6.8 శాతం వడ్డీ విధిస్తోంది. కొటక్ మహీంద్రా(Kotak Mahindra Bank) ఇంత కంటే తక్కువగా, అంటే 6.50 శాతంతో హోమ్ లోన్లు ఇస్తోంది. కొత్త కస్టమర్లతో పాటు పాత కస్టమర్లకు కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని బ్యాంకు ప్రకటించింది. కొటక్ డీజీ హోమ్ లోన్ ద్వారా కూడా కస్టమర్లు లోన్ కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఖాతాదారుల క్రెడిట్ బ్యాలెన్స్, క్రెడిట్ స్కోరు ఆధారంగా వారికి ఎంతవరకు లోన్ వస్తుందో డిజిటల్ పద్ధతిలో తెలుసుకోవచ్చు. వడ్డీరేటు, టెన్యూర్, ఈఎంఐ గురించి కూడా కస్టమర్లు తెలుసుకోవచ్చు.
ఏడు శాతానికి తక్కువే
హోమ్ లోన్లపై ప్రముఖ బ్యాంకులు 7 శాతం కంటే తక్కువ వడ్డీరేటును విధిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 4 శాతం లోపు ఉంచడం వల్ల వడ్డీ రేట్లు తగ్గుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆర్బీఐ నుంచి బ్యాంకులు తక్కువ వడ్డీతో నిధులు తీసుకునే అవకాశం కలుగుతోంది. ఫలితంగా కస్టమర్లకు తక్కువ వడ్డీతో హోమ్ లోన్లను అందించగలుగుతున్నాయి.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.