ఇళ్లు కొనాలకునే వారికి శుభవార్త.. Home Loansపై వడ్డీరేట్లు తగ్గించిన Kotak Mahindra Bank

ప్రతీకాత్మకచిత్రం

కోవిడ్–19 ప్రభావంతో పడిపోయిన వినియోగదారుల కొనుగోలు శక్తిని పునరుద్ధరించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వడ్డీ రేట్లను తగ్గించింది ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్.

  • Share this:
కోవిడ్–19 ప్రభావంతో పడిపోయిన వినియోగదారుల కొనుగోలు శక్తిని పునరుద్ధరించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వడ్డీ రేట్లను తగ్గించింది ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్. ఈ పండుగ సీజన్లో సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా హోమ్ లోన్ తీసుకునే వారిని ఆకర్షించడానికి ఏకంగా 15 ఏళ్ల కనిష్ట స్థాయికి వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో పాటు క్యాష్ డిస్కౌంట్, మాడ్యులర్ కిచెన్లు, ఫర్నిచర్, గోల్డ్ కాయిన్స్, ఎయిర్ కండీషనర్లు, క్లబ్ మెంబర్షిప్ వంటి ఆకర్షనీయమైన ఆఫర్లను కూడా ప్రకటించింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి అనేక ప్రభుత్వ నియంత్రణలో ఉన్న బ్యాంకులు ఈ మధ్య కాలంలోనే హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. ఈ బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు తగ్గింపు, మహిళలకు తక్కువ వడ్డీరేటుకే రుణాలు ఇవ్వడం వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి. అయితే, ఈ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంక్ అయిన కోటక్ మహీంద్రాలోనే తక్కువ వడ్డీకి హోమ్లోన్ అందిస్తుండటం విశేషం.

కోటక్ మహీంద్రాలో 6.75 శాతమే వడ్డీరేటు..
గత నెలలో గృహ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు దేశంలోనే అతిపెద్ద రుణదాత అయిన ఎస్బీఐ(SBI) హోమ్ లోన్లపై 25 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. దీనిలో భాగంగా రూ .75 లక్షలకు పైబడిన ఇళ్లను కొనేవారికి 20 బిపిఎస్ వడ్డీ రాయితీ లభిస్తుంది. అంతేకాక, యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్న హోమ్ లోన్లు(Home Loans)కు అదనంగా 5 బిపిఎస్ వడ్డీ రాయితీ ఇవ్వబడుతుంది. దీంతో పాటు మహిళా గృహ కొనుగోలుదారులకు అదనంగా మరో 5 బిపిఎస్ వడ్డీ రాయితీని ప్రకటించింది. అయితే, అన్ని బ్యాంకులతో పోలిస్తే కోటక్ మహీంద్రా తక్కువ వడ్డీకే హోమ్ లోన్లను అందిస్తుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ వడ్డీ రేట్లను మరో 15 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) తగ్గించి 6.75 శాతానికే హోమ్ లోన్లను అందిస్తుంది.

వడ్డీరేట్లను తగ్గించడంపై కోటక్ మహీంద్రా బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్-కన్స్యూమర్ బ్యాంకింగ్ శాంతి ఏకాంబరం మాట్లాడుతూ.. “వినియోగదారుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని, వారి సొంతింటి కల సాకారం చేసుకోవడానికి తక్కువ వడ్డీకే హోమ్ లోన్లను అందిస్తున్నాం. ఇల్లు కొనాలని చూస్తున్న కొత్త కస్టమర్లకు ఇప్పుడు సంవత్సరానికి 6.75 శాతానికే వడ్డీ రేట్లను అందిస్తున్నాం. వీరితో పాటు ఇప్పటికే ఇతర బ్యాంకులలో హోమ్ లోన్లను కలిగి ఉన్న వారు తమ హోమ్ లోన్ అకౌంట్ బ్యాలెన్స్‌ను కోటక్‌కు ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది మంచి సమయం. ఇది వారి ప్రస్తుత EMI లను తగ్గించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.”అని అన్నారు.
Published by:Nikhil Kumar S
First published: