Kotak Mahindra Bank | మీరు కొత్త క్రెడిట్ కార్డు పొందాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. మార్కెట్‌లోకి కొత్త క్రెడిట్ కార్డు వచ్చింది. ప్రైవేట్ రంగ ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ (Bank) ఈ కొత్త క్రెడిట్ కార్డును (Credit Card) తీసుకువచ్చింది. మెట్రో క్యాష్ అండ్ క్యారీ భాగస్వామ్యంతో బ్యాంక్ ఈ క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. ఈ కార్డులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చొ ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన క్రెడిట్ కార్డు పేరు మెట్రో కోటక్ క్రెడిట్ కార్డు. ఇది కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డు. ఈ కార్డు ద్వారా 48 రోజుల వరకు వడ్డీ రహిత క్రెడిట్ ఫెసిలిటీ పొందొచ్చు. మెట్రో ఇండియా రిజిస్టర్డ్ కస్టమర్లు ఈ ఫెసిలిటీ సొంతం చేసుకోవచ్చు. రూపే నెట్‌వర్క్‌పై ఈ కార్డు పని చేస్తుంది. మెట్రో స్టోర్స్‌లో ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించొచ్చు. ఈ క్రెడిట్ కార్డు లిమిట్ రూ. 25 వేల నుంచి ప్రారంభం అవుతోంది.
అదిరిపోయే శుభవార్త.. 2 బ్యాంకుల కీలక నిర్ణయం, కస్టమర్లకు ఇకపై..
ఈ క్రెడిట్ కార్డు ద్వారా కస్టమర్లు నెలకు రూ. 10 వేల వరకు క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చని బ్యాంక్ పేర్కొంటోంది. అయితే మెట్రోలో క్రెడిట్ కార్డు ద్వారా చేసే ఖర్చు ప్రాతిపదికన వచ్చే క్యాష్ బ్యాక్ కూడా ఆధారపడి ఉంటుంది. కోటక్ బ్యాంక్‌లో బ్యాంక్ ఖాతా లేని మెట్రో బిజినెస్ కస్టమర్లు కూడా ఈ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. స్మాల్ ట్రేడర్లు, కిరాణా స్టోర్ ఓనర్లు, ఎంఎస్ఎంఈల కోసం ఈ క్రెడిట్ కార్డును తీసుకువచ్చినట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డు బిజినెస్ హెడ్ ఫెడెరిక్ డిసౌజా తెలిపారు.
శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. 2 రోజుల్లోనే తల్లకిందులు!
.@KotakBankLtd and @metro_india launch the METRO Kotak Credit Card for millions of METRO customers, including small retailers, SMEs and Kirana stores.#KotakKatha #KotakMahindraBank #KMBL #CreditCard #Banking #Kirana | @RuPay_npci pic.twitter.com/HDA1mATCRa
— Kotak Mahindra Group (@KotakKatha) December 16, 2022
స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడానికి, వారి సాధికారత కోసం కంపెనీ ముందుంటుందని మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా ఎండీ, సీవో అర్వింద్ మెదిరట్టా తెలిపారు. ఎన్‌పీసీఐ రూపే హెడ్ డెన్నీ వి థామస్ మాట్లాడుతూ.. ఈ క్రెడిట్ కార్డు ద్వారా 49 రోజుల వరకు క్రెడిట్ ఫ్రీ ఫెసిలిటీ పొందొచ్చని తెలిపారు.
కాగా ఈ క్రెడిట్ కార్డు మెట్రో నుంచి పెద్ద మొత్తంలో తమ రిటైల్ స్టోర్లకు సరుకులు కొనే వారికి ఈ క్రెడిట్ కార్డు ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ డాక్యుమెంటేషన్‌తో సులభంగానే ఈ క్రెడిట్ కార్డు పొందొచ్చు. నో జాయినింగ్ ఫీజు. అలాగే ఇయర్లీ ఫీజు కూడా ఉండదు. అంటే మీరు ఉచితంగానే ఈ కార్డును పొందొచ్చని చెప్పుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Credit cards, Kotak Mahindra Bank, Metro