Home /News /business /

KOTAK MAHINDRA BANK ICICI BANK BANDHAN BANK OTHERS HIKE FD INTEREST RATES HERE DETAILS NS GH

FD Interest Rates Hike: కోటక్ మహీంద్రా బ్యాంక్, బంధన్ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంపు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) రీసెంట్‌గా తన వడ్డీ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రయత్నంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) రీసెంట్‌గా తన వడ్డీ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రయత్నంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపు తర్వాత చాలా బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit) వడ్డీ రేట్లను (Interest Rates) పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్‌ ఎఫ్‌డీ రేట్లను 30 నుంచి 50 బేసిస్ పాయింట్లు వరకు పెంచింది. ఈ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు రూ.2 కోట్లలోపు డిపాజిట్లపై మే 6 నుంచి అమల్లోకి వచ్చాయి. మరోవైపు, బంధన్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు వరకు పెంచింది. ఈ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు వర్తిస్తాయి. కొత్త బంధన్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు మే 4 నుంచి అమల్లోకి వచ్చాయి.

కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సవరించిన వార్షిక వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..
- 7 రోజుల నుంచి 14 రోజుల వరకు చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లకు సాధారణ ప్రజలకు 2.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.00 శాతం వడ్డీ లభిస్తుంది. అదే విధంగా
- 15 రోజుల నుంచి 30 రోజుల వరకు సాధారణ ప్రజలకు 2.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.00 శాతం
- 31 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం
- 46 రోజుల నుంచి 90 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం
- 91 రోజుల నుంచి 120 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం
Business Idea: వ్యవసాయంలో లక్షలు పొందాలనుకుంటున్నారా? అయితే.. ఈ చెట్లు పెంచితే రూ. 50 లక్షల లాభం.. తెలుసుకోండి

- 121 రోజుల నుంచి 179 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం
- 180 రోజులకు సాధారణ ప్రజలకు 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం
- 181 రోజుల నుంచి 269 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం
- 270 రోజులకు సాధారణ ప్రజలకు: 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం
- 271 రోజుల నుంచి 363 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం
- 364 రోజులు సాధారణ ప్రజలకు 5.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.75 శాతం

- 365 రోజుల నుంచి 389 రోజుల వరకు సాధారణ ప్రజలకు 5.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.90 శాతం
- 390 రోజులు (12 నెలల 25 రోజులు) సాధారణ ప్రజలకు: 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.00 శాతం
- 391 రోజుల నుంచి 23 నెలల కంటే తక్కువ వ్యవధికి సాధారణ ప్రజలకు 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.00 శాతం
- 23 నెలలకు సాధారణ ప్రజలకు: 5.60 శాతం, సీనియర్ సిటిజన్లకు: 6.10 శాతం
- 23 నెలల 1 రోజుల నుంచి 2 ఏళ్ల కంటే తక్కువ వ్యవధికి సాధారణ ప్రజలకు 5.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.10 శాతం

- 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు 5.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.10 శాతం
- 3 ఏళ్లు, అంతకంటే ఎక్కువ.. 4 ఏళ్ల కంటే తక్కువ వ్యవధికి సాధారణ ప్రజలకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం
- 4 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కానీ 5 ఏళ్ల కంటే తక్కువ వ్యవధికి సాధారణ ప్రజలకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం
- 5 ఏళ్లు, అంతకంటే ఎక్కువ, 10 ఏళ్లకు కలుపుకొని సాధారణ ప్రజలకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం వడ్డీ రేట్లు చెల్లిస్తారు.

బంధన్ బ్యాంక్‌లో రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సవరించిన వార్షిక వడ్డీ రేట్లు ఇలా..
- 7 రోజుల నుంచి 14 రోజుల కాలానికి చేసి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం వడ్డీ లభిస్తుంది.
- 15 రోజుల నుంచి 30 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం
- 31 రోజుల నుంచి 2 నెలల కంటే తక్కువ కాలపరిమితికి సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.25 శాతం
- 2 నెలల నుంచి 3 నెలల కంటే తక్కువ కాలపరిమితికి సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.25 శాతం

- 3 నెలల నుంచి 6 నెలల కంటే తక్కువ వ్యవధికి సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.25 శాతం
- 6 నెలల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ వ్యవధికి సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం
- 1 సంవత్సరం నుంచి 18 నెలల వరకు సాధారణ ప్రజలకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం

- 18 నెలల నుంచి 2 ఏళ్ల కంటే తక్కువ కాలపరిమితికి సాధారణ ప్రజలకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం
- 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల కంటే తక్కువ వ్యవధికి సాధారణ ప్రజలకు 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.00 శాతం
- 5 నుంచి 10 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 5.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.35 శాతం వడ్డీ అందుతుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Bank, Kotak Mahindra Bank, Reserve Bank of India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు