Bank News | ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రికరింగ్ డిపాజిట్లపై (RD) వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కన్నా ఇకపై కస్టమర్లకు అధిక రాబడి వస్తుంది. బ్యాంక్ (Bank) ఆర్‌డీ రేట్ల పెంపు నిర్ణయం నేటి నుంచే అమలులోకి వస్తుందని తెలిపింది. అంటే డిసెంబర్ 28 నుంచి కొత్త రేట్లు వర్తిస్తాయి.
కోటక్ మహీంద్రా బ్యాంక్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్లపై వడ్డీ రేట్లు పెంచడం ఇది ఈ నెలలో రెండోసారి కావడం గమనార్హం. చివరిగా బ్యాంక్ డిసెంబర్ 9న ఆర్‌డీ అకౌంట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రేట్ల పెంపు తర్వాత చూస్తే.. రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 7 శాతానికి చేరింది. 15 నెలల నుంచి 21 నెలల టెన్యూర్‌లోని ఆర్‌డీ ఖాతాలకు ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది.
భయపెడుతున్న బంగారం.. కొండెక్కిన ధర!
ఎంపిక చేసిన టెన్యూర్లపై కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్ల వరకు పెంచేసింది. ఇది అధిక వడ్డీ రేట్లు పెంపుగా చెప్పుకోవచ్చు. 6 నెలలు, 12 నెలలు, 15 నెలలు, 18 నెలలు, 21 నెలల టెన్యూర్‌లోని రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంక్ తాజాగా పెంచింది. ఆరు నెలల ఆర్‌డీ అకౌంట్లపై వడ్డీ రేటు 5.75 శాతానికి చేరింది. ఇదివరకు ఈ వడ్డీ రేటు 5 శాతంగా ఉంది.
గ్యాస్ సిలిండర్‌పై భారీ తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్!
అలాగే 12 నెలల టెన్యూర్‌లోని ఆర్‌డీ ఖాతాలపై వడ్డీ రేటు 6.25 శాతం నుంచి 6.75 శాతానికి ఎగసింది. 15 నెలల కాల పరిమితిలోని ఆర్‌డీలపై అయితే వడ్డీ రేటు 6.5 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. ఇంకా 18 నెలల టెన్యూర్‌లోని రికరింగ్ డిపాజిట్లపై అయితే వడ్డీ రేటు 6.5 శాతం నుంచి 7 శాతానికి ఎగసింది. ఇంకా 21 నెలల టెన్యూర్‌లోని ఆర్‌డీలపై కూడా ఇదే వడ్డీ రేటు ఉంది.
ఇంకా సీనియర్ సిటిజన్స్ ఆర్‌డీ అకౌంట్లపై కూడా వడ్డీ రేట్లు పెరిగాయి. అయితే వీటిపై వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్ల వరకే పైకి కదిలింది. ఆరు నెలల ఆర్‌డీలపై వడ్డీ రేటు 6 శాతం నుంచి 6.25 శాతానికి చేరింది. 12 నెలల ఆర్‌డీలపై అయితే వడ్డీ రేటు 6.75 శాతం నుంచి 7.25 శాతానికి ఎగసింది. 15 నెలలు, 18 నెలలు, 21 నెలలు ఆర్‌డీలపై వడ్డీ రేటు 7 శాతం నుంచి 7.5 శాతానికి చేరింది. కాగా బ్యాంక్‌లో 6 నెలల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బులు రికరింగ్ డిపాజిట్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, FD rates, Fixed deposits, Kotak Mahindra Bank, Money, Personal Finance, Recurring Deposits