Loan EMI | ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న కోటక్ మహీంద్రా బ్యాంక్ తన కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది. భారీ షాకిచ్చింది. రుణ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్ (Bank) కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారికి నెలవారీ ఈఎంఐ (EMI) పైకి చేరనుంది. అలాగే కొత్తగా లోన్ తీసుకోవాలని భావిస్తే.. అధిక వడ్డీ భారం మోయాల్సి వస్తుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ రుణ రేట్లను 5 బేసిస్ పాయింట్ల మేర పెంచేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంఈఎల్ఆర్) రేటు పెంపు నిర్ణయం ఇప్పటికే అమలులోకి వచ్చేసింది. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 8.25 శాతానికి ఎగసింది. అలాగే నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 8.5 శాతానికి పెరిగింది. అలాగే మూడు నెలల ఎంసీఎల్ఆర్ అయితే 8.65 శాతంగా ఉంది. ఇంకా ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.85 శాతంగా కొనసాగుతోంది.
ఎలక్ట్రిక్ కారు, స్కూటర్, బైక్ కొనే వారికి కేంద్రం అదిరే ఆఫర్.. అకౌంట్లలోకి రూ.1.5 లక్షలు!
అదేసమయంలో ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును గమనిస్తే.. 9.05 శాతంగా ఉంది. 2 ఏళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 9.1 శాతానికి చేరింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 9.25 శాతానికి ఎగసింది. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ రేటు కన్నా తక్కువ వడ్డీ రేటుకు కస్టమర్లకు రణాలు అందించవు. ఎంసీఎల్ఆర్‌ను కనీస రుణ రేటుగా పేర్కొంటారు. బ్యాంకులు సాధారణంగా ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును రుణాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి.
రూ.1,200 పెట్టి గ్యాస్ సిలిండర్ కొనక్కర్లేదు.. ఈ స్టవ్‌తో రూ.1 ఖర్చు లేకుండా వంట చేసుకోవచ్చు!
అందువల్ల బ్యాంకులు ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు పెంచితే.. ఆ ప్రభావం రుణ గ్రహాతలపై ఉంటుంది. బ్యాంక్ నుంచి ఎంసీఎల్ఆర్ రేటు ప్రాతిపదికన రుణాలు తీసుకొని ఉంటే.. అప్పుడు ఎంసీఎల్ఆర్ రేటు పెరిగినప్పుడు రుణ రేట్లు కూడా పెరుగుతాయి. రుణాలకు రీసెట్ డేట్ ఉంటుంది. ఈ డేట్ నుంచి రుణ రేటు పెంపు వర్తిస్తుంది. అంటే అప్పటి నుంచి కస్టమర్ల నెలవారీ ఈఎంఐ కూడా పైకి చేరుతుంది. లేదంటే లోన్ టెన్యూర్‌ను అందుకు అనుగుణంగా పెరుగుతుంది.
దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు పెంచుకుంటూ వెళ్లడంతో బ్యాంకులు కూడా వరుస పెట్టి రుణ రేట్లు పెంచేస్తున్నాయి. ఇప్పటికే దిగ్గజ బ్యాంకులు చాల వరకు రుణ రేట్లు పెంచేశాయి. ఇప్పుడు కోటక్ బ్యాంక్ కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరింది. కాగా రానున్న రోజుల్లో కూడా రెపో రేటు పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే మళ్లీ రుణ రేట్లు కూడా పైపైకి చేరే ఛాన్స్ ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank news, Banks, EMI, Interest rates, Kotak Mahindra Bank