Fixed Deposits | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా తీపికబురు అందించింది. బ్యాంక్ కస్టమర్లకు ఊరట కలిగే ప్రకటన చేసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లు పెంచేసింది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుంది. గతంలో కన్నా ఇకపై బ్యాంక్‌లో (Bank) డబ్బులు దాచుకుంటే అధిక వడ్డీ బెనిఫిట్ పొందొచ్చు.
కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ.2 కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేసింది. రేట్ల పెంపు నిర్ణయం జనవరి 16 నుంచే అమలులోకి వచ్చింది. బ్యాంక్ గరిష్టంగా ఎఫ్‌డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచేసింది. రెండేళ్ల నుంచి మూడేళ్ల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. ఇప్పుడు బ్యాంక్ ఇతర టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.
7 రోజుల నుంచి 14 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 2.75 శాతంగా ఉంది. 15 నుంచి 30 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 3 శాతంగా కొనసాగుతోంది. 31 రోజుల నుంచి 45 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 3.25 శాతంగా, 46 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 3.5 శాతంగా ఉంది. 91 రోజుల నుంచి 120 రోజుల ఎఫ్‌డీలపై 4 శాతం వడ్డీ పొందొచ్చు.
బస్ టికెట్ ధరకే విమాన టికెట్.. కంపెనీ రూ.1,199 ఆఫర్ అదిరింది!
121 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4.25 శాతంగా ఉంది. 180 రోజుల నుంచి 363 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.75 శాతంగా కొనసాగుతోంది. 364 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6 శాతంగా ఉంది. 365 నుంచి 389 రోజుల ఎఫ్‌డీలపై 6.75 శాతం వడ్డీ ఉంది. 390 రోజుల నుంచి రెండేళ్ల ఎఫ్‌డీలపై 7 శాతం వడ్డీ పొందొచ్చు. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై వడ్డీ 6.75 శాతంగా ఉంది. 4 ఏళ్ల నుంచి ఐదేళ్ల ఎఫ్‌డీలపై వడ్డీ 6.25 శాతం వడ్డీ లభిస్తోంది. ఆపైన ఎప్‌డీలపై 6.2 శాతం వడ్డీ ఉంది.
కాగా ఇప్పటికే చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేశాయి. ఇప్పుడు కోటక్ బ్యాంక్ కూడా ఈ జాబితాలో చేరింది. ఆర్‌బీఐ రెపో రేటు పెంచుకుంటూ వెళ్లడంతో బ్యాంకులు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. డిపాజిట్ రేట్లను పెంచేస్తున్నాయి. ఇప్పటికే ఎస్‌బీఐ , హెచ్‌ఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పీఎన్‌బీ వంటి చాలా బ్యాంకులు రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఎక్కువ వడ్డీ వచ్చే బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవడం ఉత్తమం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank news, Banks, FD rates, Fixed deposits, Kotak Mahindra Bank, Personal Finance