Bank News | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ (Bank) కస్టమర్లకు ఊరట కలిగే ప్రకటన చేసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ. 2 కోట్లలోపు ఎఫ్‌డీలకు (FD) ఈ పెంపు వర్తిస్తుంది. డిసెంబర్ 15 నుంచి ఎఫ్‌డీ రేట్ల పెంపు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. అంటే ఈరోజు నుంచే కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి.
డొమెస్టిక్, ఎన్ఆర్వో, ఎన్ఆర్ఈ డిపాజిట్లకు వడ్డీ రేట్ల పెంపు వర్తిస్తుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. డిసెంబర్ 9 నుంచి చూస్తే బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు పెంచడం ఇది వరుసగా మూడో సారి కావడం గమనార్హం. రేట్ల పెంపు నేపథ్యంలో బ్యాంక్ లేటెస్ట్ ఎఫ్‌డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. 390 రోజుల ఎఫ్‌డీలపై 7 శాతం వడ్డీ పొందొచ్చు. అలాగే 391 రోజుల నుంచి 23 నెలల ఎఫ్‌డీలపై కూడా ఇదే రేటు ఉంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!
అలాగే 180 రోజుల ఎఫ్‌డీలపై 5.75 శాతం వడ్డీని అందిస్తోంది. అలాగే 181 రోజుల నుంచి 270 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా ఇదే రేటు వర్తిస్తుంది. అలాగే 365 రోజుల నుంచి 389 రోజుల ఎఫ్‌డీలపై అయితే 6.75 శాతం వడ్డీ పొందొచ్చు. 23 నెలల నుంచి రెండేళ్లలోపు ఎఫ్‌డీలపై అయితే 6.5 శాతం వడ్డీ ఉంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల ఎఫ్‌డీలపై అయితే 6.4 శాతం వడ్డీ పొందొచ్చు. మూడేళ్ల నుంచి 4 ఏళ్ల ఎఫ్‌డీలపై 6.3 శాతం, నాలుగేళ్ల నుంచి ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక ఐదేళ్ల నుంచి పదేళ్ల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై అయితే 6.2 శాతం వడ్డీ వస్తుంది.
కస్టమర్లకు భారీ షాకిచ్చిన ఎస్‌బీఐ .. కీలక నిర్ణయం, ఈరోజు నుంచి..
అలాగే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 0.5 శాతం మేర అధిక వడ్డీ వస్తుంది. వీరికి 7 రోజుల నుంచి 10 ఏళ్ల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై 3.25 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. అదేసమయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ రికరింగ్ డిపాజిట్ల విషయానికి వస్తే.. ఈ ఆర్‌డీ అకౌంట్లపై 6 నెలల నుంచి పదేళ్ల కాల పరిమితిపై 5.75 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 6.25 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీ అందుబాటులో ఉంది. అంటే వీరికి అధిక వడ్డీ రేటు లభిస్తోందని చెప్పుకోవచ్చు. కాగా ఇప్పటికే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సహా పలు ప్రముఖ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేశాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, FD rates, Fixed deposits, Kotak Mahindra Bank, Money