Fixed Dipositsపై వడ్డీ రేట్లను సవరించిన Kotak Mahindra.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

కోటాక్ మహింద్ర బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. 7 నుంచి 30 రోజుల గడువుతో కూడిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.5 శాతం వడ్డీని అందించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  ప్రముఖ కోటక్ మహింద్ర బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 7 నుంచి 30 రోజుల గడువుతో కూడిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు 2.5 శాతం వడ్డీని అందించనుంది. 31 నుంచి 90 రోజుల గడువు కలిగిన ఎఫ్డీలపై 2.75 శాతం వడ్డీ అందిచనుంది. ఇంకా 91 నుంచి 179 రోజుల ఎఫ్డీపై 3.25 శాతం వడ్డీ అందించనున్నట్లు తెలిపింది. 180 రోజుల నుంచి ఏడాదిలోపు గడువు కలిగిన టర్మ్ డిపాజిట్లపై 4.40 శాతం వడ్డీ అందించనున్నట్లు కొటక్ మహీంద్ర బ్యాంక్ తెలిపింది. ఏడాది నుంచి 389 గడువు కలిగిన డిపాజిట్లపై బ్యాంక్ 4.50 శాతం వడ్డీ అందించనున్నట్లు ప్రకటించింది. ఇక 390 రోజుల నుంచి 23 నెలల లోపు కాల పరిమితి కలిగిన ఎఫ్డీలపై 4.90 శాతం వడ్డీని బ్యాంక్ అందించనుంది. 23 నెలల నుంచి మూడేళ్ల పరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్ పై బ్యాంక్ 5 శాతం వడ్డీని అందించనున్నట్లు తెలిపింది. మూడేళ్లపైగా నాలుగేళ్ల లోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై బ్యాంకు 5.10 శాతం వడ్డీ అందించనుంది.

  నాలుగేళ్ల నుంచి ఐదేళ్ల లోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీని అందించనుంది. ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై అత్యధికంగా 5.30 శాతం వడ్డీని అందించనుంది. ఈ రేట్లు ఈ నెల 25 నుంచి అమలులోకి రానున్నాయి. సీనియర్ సిటిజన్లకు బ్యాంకు బ్యాంకు 50 బేసిక్ పాయింట్లు ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్ అందిస్తుంది. 7 రోజుల నుంచి పదేళ్ల పరిమితి కలిగిన ఎప్డీలపై 3 నుంచి 5.8 శాతం వడ్డీ అందిస్తోంది.

  ఇదిలా ఉంటే.. కరోనా తరువాత ఎక్కువ మంది ఉద్యోగులు సొంత ఇల్లు లేదా ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి కస్టమర్ల కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీతో హోమ్ లోన్లను అందిస్తున్నాయి. ప్రస్తుతం వివిధ సంస్థలు తక్కువ వడ్డీతో హోమ్ లోన్లను అందిస్తున్నాయి. తాజాగా LIC హౌసింగ్ ఫైనాన్స్ తమ కస్టమర్లకు కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఏకంగా ఆరు నెలలకు సమానమైన హోమ్ లోన్ EMIలను రద్దు చేస్తామని ఆ సంస్థ గురువారం వెల్లడించింది. గృహ వరిష్ట (Griha Varishtha) హోమ్ లోన్ ప్రొడక్ట్‌ను ఎంచుకున్న కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. నెలవారీ జీతం పొందే ఉద్యోగులు, డిఫైన్డ్ బెనిఫిట్ పెన్షన్ స్కీం (DBPS) పరిధిలోకి వచ్చే పెన్షనర్లు ఈ పథకానికి అర్హులు. కొత్త ఆఫర్ ప్రకారం 37, 38, 73, 74, 121, 122వ EMIలకు మినహాయింపు ఉంటుంది. బకాయి ఉన్న ఈఎంఐలు, తరువాతి నెలల ప్రిన్సిపల్ అమౌంట్‌కు యాడ్ చేసిన మొత్తాన్ని ఆఫర్లో భాగంగా రద్దు చేస్తారు.
  Published by:Nikhil Kumar S
  First published: