Kotak Mahindra Bank: వడ్డీ రేట్లను సవరించిన మరో బ్యాంక్.. ఎఫ్‌డీలపై కోటక్ మహీంద్రా బ్యాంక్‌ అందిస్తున్న వ‌డ్డీ రేట్లు ఇవే

కొటక్ మహీంద్రా బ్యాంక్ (ప్రతీకాత్మక చిత్రం)

కోటక్ మహీంద్రా బ్యాంక్ డొమెస్టిక్/ఎన్ఆర్ఓ/ఎన్ఆర్ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించింది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచూరిటీ గల ఎఫ్‌డీలపై కొత్త రేట్లను ప్రకటించింది.

  • Share this:
కరోనా విజృంభించిన సమయం నుంచి భారతదేశంలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు వడ్డీరేట్లను ప్రకటిస్తున్నాయి. పెట్టుబడిదారులు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను కూడా బ్యాంకులు మారుస్తున్నాయి. ఈ క్రమంలోనే కోటక్ మహీంద్రా బ్యాంక్ డొమెస్టిక్/ఎన్ఆర్ఓ/ఎన్ఆర్ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించింది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచూరిటీ గల ఎఫ్‌డీలపై కొత్త రేట్లను ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు 2021 సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి వచ్చాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం వడ్డీ రేట్లు అనేవి ఖాతాదారుల సెలక్ట్ చేసుకున్న కాలపరిమితిని బట్టి మారుతూ ఉంటాయి.

రెగ్యులర్ ఖాతాదారులు రూ. 2 కోట్ల లోపు చేసే ఎఫ్‌డీల‌పై సవరించిన వడ్డీ రేట్లను బ్యాంకు ప్రకటించింది. 7- 14 రోజుల వ్యవధి గల ఎఫ్‌డీ‌లపై 2.50%, 15- 30 రోజుల ఎఫ్‌డీ‌పై 2.50%, 31-45 రోజుల ఎఫ్‌డీ‌పై 2.75%, 46- 90 రోజుల ఎఫ్‌డీ‌పై 2.75%, 91- 120 రోజుల ఎఫ్‌డీ‌పై 3.00%, 121- 179 రోజుల ఎఫ్‌డీ‌పై 3.25% , 180 రోజుల ఎఫ్‌డీ‌పై 3.60%, 12- 23 నెలల ఎఫ్‌డీ‌పై 4.75%, 2- 3 ఏళ్ల ఎఫ్‌డీ‌పై 5.00%, 3- 4 ఏళ్ల ఎఫ్‌డీ‌పై 5.10%, 4- 5 ఏళ్ల ఎఫ్‌డీ‌పై 5.20%, 5 - 10 ఏళ్ల మెచూరిటీ గల ఎఫ్‌డీల‌పై 5.25% వ‌ర‌కు వ‌డ్డీ రేట్ల‌ను కోటక్ మహీంద్రా బ్యాంక్ అందిస్తుంది.

సీనియర్ సిటిజన్లకు అందించే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. సీనియర్ సిటిజన్లకు 7- 14 రోజుల వ్యవధి గల ఎఫ్‌డీల‌పై 3.00%, 15- 30 రోజుల ఎఫ్‌డీ‌పై 3.00%, 31- 45 రోజుల ఎఫ్‌డీ‌పై 3.25%, 46- 90 రోజుల ఎఫ్‌డీ‌పై 3.25%, 91- 120 రోజుల ఎఫ్‌డీ‌పై 3.50%, 121- 179 రోజుల ఎఫ్‌డీ‌పై 3.75%, 180 రోజుల ఎఫ్‌డీ‌పై 4.75%, 12- 23 నెలల ఎఫ్‌డీ‌పై 5.25%, 2- 3 ఏళ్ల ఎఫ్‌డీ‌పై 5.50%, 3- 4 ఏళ్ల ఎఫ్‌డీ‌పై 5.60%, 4- 5 ఏళ్ల ఎఫ్‌డీ‌పై 5.70%, 5- 10 ఏళ్ల ఎఫ్‌డీ‌పై 5.75% వ‌ర‌కు వ‌డ్డీ రేట్ల‌ను కోటక్ మహీంద్రా బ్యాంక్ అందిస్తుంది.
Published by:Krishna Adithya
First published: