Electric Scooter News | ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కోమకి తాజాగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను (e-Scooter) మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని పేరు ఎల్‌వై ప్రో. ఈ స్కూటర్ (EV) ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1,37,500గా ఉంది. ఇందులో కంపెనీ డ్యూయెల్ బ్యాటరీస్‌ను అమర్చింది. ఈ రెండింటినీ రిమూవ్ చేయొచ్చు. అంటే డీటాచబుల్ బ్యాటరీలు అని చెప్పుకోవచ్చు. డ్యూయెల్ చార్జర్‌తో వీటిని చార్జ్ చేసుకోవచ్చు. దాదాపు 5 గంటల్లో బ్యాటరీలు ఫుల్ అవుతాయి.
ఈ కొత్త డ్యూయెల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉంది. ఇందులో ఆన్‌బోర్డు నావిగేషన్, సౌండ్ సిస్టమ్, బ్లూటూత్, కాలింగ్ ఆప్షన్ వంటివి ఉన్నాయి. అలాగే ఈ స్కూటర్‌లో మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్, టర్బో మోడ్ అనేవి ఇవి. కోమకి ఎల్‌వై ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 62 కిలోమీటర్లు.
నెలకు రూ.500 కడితే చాలు.. రూ.35 లక్షలు మీవే, ఎలా అంటే?
అలాగే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లో యాంటీస్కిడ్ టెక్నాలజీ ఉంది. హిల్స్‌పై ఈ స్కూటర్ స్కిడ్ కాకుండా ఉంటుంది. అలాగే ఇందులో 12 ఇంచుల ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. ఇంకా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3000 వాట్ హబ్ మోటార్ ఉంది. 38 ఏఎంపీ కంట్రోలర్స్ ఉన్నాయి. పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్ ఫంక్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
మోదీ సర్కార్ బంపరాఫర్.. మీ అకౌంట్‌లోకి ఉచితంగా రూ.లక్ష, పొందండిలా!
ఇంకా ఇందులో ఎల్ఈడీ లైట్స్, అలాయ్ వీల్స్, టెలీ స్కోపిక్ ఫ్రంట్ సన్సెన్షన్, డ్యూయెల్ డిస్క్ బ్రేక్స్, రిమోట్ కీ వంటి ప్రత్యేకతలు దీని సొంతం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఒక్కసారి ఫుల్‌గా చార్జింగ్ పెడితే ఏకంగా 160 కిలోమీటర్ల నుంచి 180 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఓలా ఎస్1, ఏథర్ 450 ప్లస్ జెన్ 3, టీవీఎస్ ఐక్యూబ్ వంటి మోడళ్లకు ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గట్టి పోటీ ఇవ్వొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
కాగా మరో వైపు మార్కెట్‌లో చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ధర ప్రాతిపదికన మీకు లభించే రేంజ్, ఫీచర్లు వంటివి మారుతాయి. రూ. 70 వేల నుంచి ధరలో కూడా మీరు మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ సొంతం చేసుకోవచ్చు. ఓలా స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తే రూ. 85 వేల నుంచి పెట్టుకోవాలి. అదే ఏథర్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి మోడల్స్ కావాలంటే రూ. లక్షకు పైనే డబ్బులు ఉండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: E scootor, Electric Scooter, Electric Vehicle, Electric Vehicles, Ev scooters, SCOOTER