Home /News /business /

KNOW YOUR CIBIL SCORE OR CREDIT SCORE ON WHATSAPP FOLLOW THESE STEPS SS

CIBIL Score: వాట్సప్‌లో క్రెడిట్ స్కోర్... ఇలా తెలుసుకోవచ్చు

CIBIL Score: వాట్సప్‌లో క్రెడిట్ స్కోర్... ఇలా తెలుసుకోవచ్చు

CIBIL Score: వాట్సప్‌లో క్రెడిట్ స్కోర్... ఇలా తెలుసుకోవచ్చు

CIBIL Score in WhatsApp | వాట్సప్‌లో ఉచితంగా సిబిల్ స్కోర్ అందిస్తోంది విష్‌‌ఫిన్ సంస్థ. అది కూడా ఏడాది పాటు ఉచితంగా. వాట్సప్‌లో ఉచితంగా క్రెడిట్ స్కోర్ అందించడం ఇదే మొదటిసారి.

    క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్... లోన్లు, క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేసుకునేవాళ్లకు చాలా ముఖ్యమైన స్కోర్ ఇది. మీరు లోన్‌కు అప్లై చేసినా, క్రెడిట్ కార్డు తీసుకోవాలని అనుకున్నా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ముందుగా మీ క్రెడిట్ స్కోర్‌ను పరిశీలిస్తాయి. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటేనే మిమ్మల్ని నమ్మి రుణాలు, క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు ముందుకొస్తాయి. అందుకే క్రెడిట్ స్కోర్ ఎవరికైనా ముఖ్యమే. సాధారణంగా క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ 300 నుంచి 900 పాయింట్ల మధ్య ఉంటుంది. 750 కన్నా ఎక్కువ స్కోర్ ఉన్నవారికి మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్నట్టు లెక్క. చాలామంది లోన్ లేదా క్రెడిట్ కార్డుకు అప్లై చేసే ముందే తమ క్రెడిట్ స్కోర్ ఎంతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఉచితంగా క్రెడిట్ స్కోర్ అందించే సంస్థలున్నాయి. డబ్బులు చెల్లించి కూడా క్రెడిట్ స్కోర్ తెలుసుకోవచ్చు. వాట్సప్‌లో ఉచితంగా సిబిల్ స్కోర్ అందిస్తోంది విష్‌‌ఫిన్ సంస్థ. అది కూడా ఏడాది పాటు ఉచితంగా. వాట్సప్‌లో ఉచితంగా క్రెడిట్ స్కోర్ అందించడం ఇదే మొదటిసారి. మరి ఆ సంస్థ ఏది? ఉచితంగా సిబిల్ స్కోర్ వాట్సప్‌లో ఎలా సాధ్యం? తెలుసుకోండి.

    వాట్సప్‌లో సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడానికి స్టెప్స్...


    ముందుగా 8287151151 నెంబర్‌కు కాల్ చేయాలి.
    మీ నెంబర్‌ వాట్సప్ ఛాట్‌లో యాడ్ అవుతుంది.
    మీ పేరు, పుట్టినరోజు లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
    మీ పాన్ నెంబర్ ఎంటర్, అడ్రస్ ఎంటర్ చేయాలి.
    మీరు నివసించే ప్రాంతం, రాష్ట్రం, పిన్ కోడ్ వివరాలు ఇవ్వాలి.
    చివరగా మీ ఇ-మెయిల్ ఐడీ టైప్ చేయాలి.
    మీ లేటెస్ట్ సిబిల్ స్కోర్ మీ వాట్సప్ ఛాట్ బాక్స్‌లో కనిపిస్తుంది.
    ఇలా మీరు ఏడాది పాటు ఉచితంగా వాట్సప్‌లో సిబిల్ స్కోర్ పొందొచ్చు.

    Holi 2019: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు... కలర్‌ఫుల్ ఫోటోలు చూడండి

    ఇవి కూడా చదవండి:

    BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో 400 ఖాళీలు... అర్హతలు ఇవే...

    SBI Jobs 2019: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు

    IRCTC E-Ticket: రైలు టికెట్‌పై పేరు మార్చుకోవచ్చు ఇలా...
    First published:

    Tags: Credit cards, Home loan, Personal Finance, Whatsapp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు