KNOW YOUR AADHAAR CARD AUTHENTICATION HISTORY IN UIDAI WEBSITE FOLLOW THESE STEPS SS
Aadhaar Card: మీ ఆధార్ కార్డు ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోండి
Aadhaar Card: మీ ఆధార్ కార్డు ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోండి
Aadhaar Authentication History | తమ ఆధార్ కార్డును ఎక్కడ వాడారో, ఎక్కడైనా దుర్వినియోగమైందో అన్న ఆందోళన సామాన్యుల్లో ఉంది. అయితే ఇప్పటి వరకు మీ ఆధార్ కార్డును ఎక్కడెక్కడ వాడారో మీరు తెలుసుకోవచ్చు.
ఆధార్ కార్డ్... ప్రతీ ఒక్కరికీ అవసరమైపోయింది. ఏ పనికి వెళ్లినా ఆధార్ కార్డు ఉందా? ఆధార్ నెంబర్ ఉందా అని అడుగుతుంటారు. కొన్ని పథకాలు పొందేందుకు ఆధార్ తప్పనిసరి అవుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ(PDS) ఇచ్చే సరుకులు తీసుకోవాలంటే ఆధార్ తప్పనిసరి. ఇక ఇప్పటికే సిమ్ కార్డుల కోసం, బ్యాంకు అకౌంట్ తెరిచేందుకు ఆధార్ కార్డును ఐడీ ప్రూఫ్‌గా ఇచ్చేసి ఉంటారు. తమ ఆధార్ కార్డును ఎక్కడ వాడారో, ఎక్కడైనా దుర్వినియోగమైందో అన్న ఆందోళన సామాన్యుల్లో ఉంది. అయితే ఇప్పటి వరకు మీ ఆధార్ కార్డును ఎక్కడెక్కడ వాడారో మీరు తెలుసుకోవచ్చు. ఆధార్ సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఈ అవకాశాన్ని కల్పించింది. మీరే ఆన్లైన్లో మీ ఆధార్ కార్డును ఎక్కడ వాడారో సులువుగా తెలుసుకోవచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవండి.
Aadhaar Card: మీ ఆధార్ కార్డ్ యూసేజ్ హిస్టరీని తెలుసుకోండి ఇలా...
ముందుగా uidai.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయండి.
‘My Aadhaar’ డ్రాప్‌డౌన్ క్లిక్ చేస్తే ‘Aadhaar Services’ సెక్షన్ కనిపిస్తుంది.
అందులో ‘Aadhaar Authentication History’ పైన క్లిక్ చేయండి.
మీ ఆధార్ నెంబర్‌తో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
మీ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
తర్వాతి పేజీలో ఆథెంటికేషన్ టైప్‌లో కావాల్సినది ఎంచుకోవాలి.
ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకో సెలెక్ట్ చేయాలి.
మొత్తం ఎన్ని రికార్డ్స్ చూడాలనుకుంటున్నారో టైప్ చేయాలి.
చివరగా మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి Submit పైన క్లిక్ చేయాలి.
మీ ఆధార్ వివరాలను ఎక్కడెక్కడ వాడారో తెలుస్తుంది.
ఆ రికార్డ్‌ను మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.
డౌన్లోడ్ చేసిన ఫైల్ ఓపెన్ చేయాలంటే మీ పేరులోని మొదటి 4 లెటర్స్ అప్పర్కేస్లో టైప్ చేసి మీరు పుట్టిన సంవత్సరాన్ని కలిపి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి.
మీ ఆధార్ నెంబర్‌ను మీకు తెలియకుండా వాడినట్టు అనుమానం వస్తే 1947 నెంబర్‌కు కాల్ చేసి లేదా help@uidai.gov.in ఇమెయిల్ ఐడీకి కంప్లైంట్ చేయొచ్చు.
Photos: రెడ్మీ 7 రిలీజ్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.