KNOW WHY POST OFFICE SAVINGS ACCOUNT IS BETTER THAN BANK ACCOUNT SS
Post Office Savings Account: బ్యాంకు కన్నా పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌తో లాభం ఎక్కువ... ఎందుకంటే
Post Office Savings Account: బ్యాంకు కన్నా పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌తో లాభం ఎక్కువ... ఎందుకంటే
(ప్రతీకాత్మక చిత్రం)
Post Office Savings Account | మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దామనుకుంటున్నారా? బ్యాంకు అకౌంట్ కన్నా పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే లాభాలు ఎక్కువ. ఎందుకో తెలుసుకోండి.
డబ్బులు దాచుకోవడానికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చాలా సురక్షితమని చెబుతూ ఉంటారు. మీ డబ్బుకు ఎలాంటి రిస్క్ ఉండకూడదంటే పోస్ట్ ఆఫీస్‌లో దాచుకోవడమే మంచిది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లలోనే డబ్బులు దాచుకుంటూ ఉంటారు. బ్యాంకులతో పోలిస్తే పోస్ట్ ఆఫీస్‌లోని ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ ఎక్కువ. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 3.75 శాతం నుంచి 7.25 శాతం మధ్య ఉంటాయి. అదే పోస్ట్ ఆఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు చూస్తే 6.25 శాతం నుంచి 7.50 శాతం మధ్య ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్ కాకుండా సేవింగ్స్ అకౌంట్లోనే 4 శాతం వడ్డీ వస్తుంది.
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి. ఈ అకౌంట్ ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. మైనర్ పేరు మీద కూడా అకౌంట్ తీసుకోవచ్చు. 10 ఏళ్లు దాటిన మైనర్ తన పేరు మీదే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఒకరి పేరు మీద ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయొచ్చు. నామినేషన్ సదుపాయం ఉంటుంది. కనీసం రూ.500 నుంచి ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు. కనీసం రూ.50 కూడా విత్‌డ్రా చేసే అవకాశం ఉంటుంది. మీకు దగ్గర్లోని పోస్ట్ ఆఫీసుకి వెళ్లి సేవింగ్స్ అకౌంట్ ఫామ్ పూర్తి చేసి, కేవైసీ వివరాలు సబ్మిట్ చేసి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
మీరు పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లే అవకాశం లేకపోతే మీ ఇంటి దగ్గరే సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇందుకోసం పోస్ట్ ఆఫీస్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల్ని అందిస్తోంది. డోర్ స్టెబ్ బ్యాంకింగ్ ద్వారా మీరు సులువుగా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అంతేకాదు... క్యాష్ డిపాజిట్, విత్‌డ్రాయల్స్, మనీ ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. ఇందుకోసం 155299 నెంబర్‌కు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ కన్ఫర్మేషన్ వస్తుంది. పోస్ట్ ఆఫీస్ ప్రతినిధి మీ ఇంటికి వచ్చి సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి సాయం చేస్తారు.
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.500 మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఏడాదికి ఓసారి రూ.100 అకౌంట్ మెయింటనెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అకౌంట్ బ్యాలెన్స్ సున్నా అయితే అకౌంట్ ఆటోమెటిక్‌గా క్లోజ్ అవుతుంది. మూడేళ్ల పాటు డబ్బులు జమ చేయకపోయినా, విత్‌డ్రా చేయకపోయినా సైలెంట్ అకౌంట్‌గా మారిపోతుంది. మళ్లీ రివైవ్ చేయాలంటే కేవైసీ అప్డేట్ చేయించాలి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసేవారికి చెక్ బుక్, ఏటీఎం కార్డ్, ఇబ్యాంకింగ్ సదుపాయం లాంటివి లభిస్తాయి. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లాంటి పథకాలు పొందొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.