నష్టభయం తక్కువగా ఉండే పెట్టుబడుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ముఖ్యమైనవి. రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడని ఇన్వెస్టర్లు ఎఫ్డీలలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ జాబితాలో ఎక్కువ రాబడిని అందించే వాటిని వినియోగదారులు ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పోస్టాఫీసులు అందించే ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులతో మంచి వడ్డీరేట్లు, ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. మెరుగైన భద్రత, ప్రభుత్వ హామీ ఉండటం వల్ల అత్యంత సురక్షిత పెట్టుబడిగా వీటిని చెప్పుకోవచ్చు. పోస్టాఫీసుల్లో ఎఫ్డీగా డిపాజిట్ చేసిన మొత్తంపై వడ్డీని వార్షిక ప్రాతిపదికన ఇస్తారు. కానీ వడ్డీ రేట్లను త్రైమాసిక ప్రాతిపదికన లెక్కిస్తారు. ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు మెచూరిటీ ఉండే ఎఫ్డీలను వినియోగదారులు ఎంచుకోవచ్చు.
కస్టమర్లు చెక్ లేదా క్యాష్ ద్వారా పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. ఒకవేళ ఎఫ్డీ అకౌంట్‌ను చెక్ ద్వారా ఓపెన్ చేస్తే.. ఆ డబ్బు ప్రభుత్వ ఖాతాలో డిపాజిట్ అయిన రోజును ఎఫ్డీ ఖాతా తెరిచిన తేదీగా పరిగణిస్తారు. కనీసం రూ.1000తో ఎఫ్డీ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. పరిమితి లేకుండా ఎంతమొత్తాన్నైనా పోస్టాఫీస్ ఎఫ్డీలో డిపాజిట్ చేసుకోవచ్చు.
LIC Policy: ఒక్కసారి ప్రీమియం కడితే ప్రతీ నెల రూ.19,000 మీ అకౌంట్లోకి
IRCTC: రొటీన్ లైఫ్ బోర్ కొట్టేసిందా? ఐఆర్సీటీసీ అండమాన్ టూర్‌కు వెళ్లండిలా
పోస్టాఫీసులో ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు చేసే ఎఫ్డీలపై 5.50 నుంచి 6.70 శాతం వడ్డీ రేట్లు పొందవచ్చు. ఐదేళ్ల ఎఫ్డీపై అత్యధికంగా 6.70 శాతం వడ్డీ లభిస్తుంది.
ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు ఎఫ్డీ అకౌంట్‌ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు ఉండే ప్రాంతంలోని పోస్టాఫీసుకు ఎఫ్డీ అకౌంట్‌ను సులభంగా మార్చుకోవచ్చు. ఉద్యోగాలకోసం వివిధ ప్రాంతాలకు మారేవారికి ఈ సదుపాయం ఉపయోగపడుతుంది.
Home Loan: భారీగా పడిపోయిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు... సొంతిల్లు కొనడానికి ఇదే సరైన సమయమా?
JioPhone: జియోఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.50,000 గెలుచుకోండి ఇలా
పోస్టాఫీసులో కస్టమర్లు తీసుకునే పర్సనల్ ఎఫ్డీ అకౌంట్‌ను జాయింట్ అకౌంట్‌గా మార్చుకోవచ్చు. ఒకవేళ ఇంతకు ముందే జాయింట్ ఎఫ్డీ అకౌంట్ ఉంటే, దాన్ని మళ్లీ సింగిల్ అకౌంట్‌గా మార్చుకోవచ్చు.
పోస్టాఫీస్ ఎఫ్‌డీల్లో నామినీకి సంబంధించిన మార్పులను సులభంగా చేసుకోవచ్చు. కొత్తగా నామినీని చేర్చడానికి, మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఎఫ్డీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా వినియోగదారులు నామినీని యాడ్ చేసుకోవచ్చు. మైనర్ కూడా ఎఫ్డీ ఖాతా తెరవవచ్చు. మేజర్‌గా మారిన తరువాత తన పేరు మీదకు అకౌంట్‌ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Bank account, Banking, India post, India post payments bank, Personal Finance, Post office, Save Money