ఈ రోజుల్లో కార్ కొనడం సాధారణ విషయమైపోయింది. మధ్యతరగతి కుటుంబాలు సైతం కారును ఒక అవసరంగా భావిస్తున్నాయి. ఇందుకు చాలామంది కార్ లోన్ (Car Loan) తీసుకుంటున్నారు. అయితే కారు కొనుగోలు చేసే సమయంలో వాహనాలకు ఇన్సూరెన్స్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగి కారుకు నష్టం సంభవిస్తే, బీమా రూపంలో పరిహారం లభిస్తుంది. ఈ విషయంలో చాలా మంది మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ ఆశిస్తారు. అయితే కొన్నిసార్లు మీ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ (Insurance Claim) తిరస్కరణకు గురికావచ్చు. పాలసీ పత్రాలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఎంతో మంది ఈ విషయంలో ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని విషయాలపై దృష్టిపెట్టి, తగిన జాగ్రత్తలు తీసుకుంటే క్లెయిమ్ రిజెక్ట్ అవ్వకుండా చూసుకోవచ్చు.
Credit Card Bill: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? బిల్లింగ్ సైకిల్, మినిమం పేమెంట్ రూల్స్ తెలుసా?
ఐడీవీ అనేది మీరు కొనుగోలు చేసే సమయానికి వాహనం విలువను సూచిస్తుంది. వాహనం దొంగతనానికి గురైనా, ఏదైనా నష్టం వాటిల్లినా.. ఆ మొత్తమే మీకు లభిస్తుంది. కాబట్టి సరైన ఐడీవీని పొందుపరచాలి. మార్కెట్ విలువ కంటే తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నా భవిష్యత్తులో అది మీ క్లెయిమ్ పై ప్రభావం చూపుతుంది.
పాలసీ సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ రిక్వెస్ట్ పెట్టకుండా పాలసీని రెన్యువల్ చేసేటప్పుడు, సదరు బీమా కంపెనీ మీకిచ్చే రివార్డే ఈ నో క్లెయిమ్ బోనస్. కాబట్టి కరెక్ట్ క్లెయిమ్ స్టేటస్‌ను ఎన్సీబీ రేంజ్‌కు తగినట్లుగా పొందుపరచాలి. సాధారణంగా ఇది 20 నుంచి 50 శాతం వరకు ఉంటుంది. తప్పుడు సమాచారం మీ క్లెయిమ్ ను ప్రభావితం చేస్తుంది.
ప్రమాదం జరిగిన తర్వాత ఆ విషయం గురించి ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పేందుకు కొంత గడువు ఉంటుంది. ఆలోపు పాలసీదారు సమాచారమివ్వాలి. ప్రమాదం జరిగిన రెండు, మూడు రోజుల్లో బీమా కంపెనీకి తెలియజేయడం మంచిది.
LIC Premium: ఎల్ఐసీ ప్రీమియం చెల్లించడానికి డబ్బులు లేవా? ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్
వాహనాన్ని నడిపే వ్యక్తికి లైసెన్స్ తప్పనిసరి. అందులోనూ వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలి. ఒకవేళ టూ-వీలర్ లైసెన్స్ ను కలిగి ఉండి, కారు నడిపి ప్రమాదానికి కారణమైతే.. క్లెయిమ్‌ను తిరస్కరిస్తారు. అంతేకాకుండా లైసెన్స్ గడువు ముగియకుండా ఉండాలి. అంటే ప్రమాదం జరిగే సమయానికి అప్ టూ డేట్ గా ఉండాలి.
కారు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ యజమాని పేరుమీద ఉండాలి. లేదంటే క్లెయిమ్ స్వీకరించలేరు. ఎందుకంటే ఆర్టీఓ ద్వారా యాజమాన్యపు హక్కులు న్యాయపరంగా మీకు ఉండవు. సింపుల్ గా చెప్పాలంటే పాలసీదారుడే వాహనం యజమానిగా ఉండాలి.
వాహనానికి ఏవైనా మార్పులు చేస్తే.. అంటే సీఎన్జీ కిట్ పొందుపరచడం, మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేయడం, ఆంప్లిఫైర్ లాంటి వాటిని ఇన్ స్టాల్ చేస్తే.. పాలసీదారు బీమా కంపెనీకి సమాచారమిచ్చి అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేయకపోతే మీ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది.
SBI Quick Personal Loan: ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఉందా? 15 నిమిషాల్లో రూ.20 లక్షల లోన్
మీరు పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీ కారు కండీషన్, గతంతో ఇన్సూరెన్స్ హిస్టరీ తదితర వివరాలను తప్పకుండా తెలపాలి. తప్పుడు సమాచారం ఇస్తే, బీమా కంపెనీ మీ పాలసీని ఇన్ వాలిడ్ గా మార్చి రద్దు చేస్తుంది.
మీ కారుకు తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీని క్రమం తప్పకుండా రెన్యువల్ చేయాలి. ఒకవేళ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్ చేయకపోతే.. ఆ సమయంలో మీ కారు ప్రమాదం జరిగితే, ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ ను రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరే సొంత డబ్బుతో ఖర్చులను భరించాల్సి ఉంటుంది.
కారు ఇన్సూరెన్స్ పాలసీలో జీరో డిప్రిసియేషన్ అంటే.. కారు విలువతో సంబంధం లేకుండా మొత్తం క్లెయిమ్ అమౌంట్ ను బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ ఆ కవర్ ను మీరు ఎంచుకోకపోతే క్లెయిమ్ చేసే సమయానికి శ్లాబ్ ప్రకారం డిప్రిసియేషన్ లేదా తరుగుదల వర్తిస్తుంది.
ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ అనేది కారు యజమానులు తమ వాహనం ఇంజిన్‌ను అనిశ్చిత నష్టం నుంచి రక్షించడానికి అందుబాటులో ఉపయోగించే యాడ్ ఆన్. ఈ యాడ్ ఆన్ ప్రాథమిక వాహన పాలసీకి జోడించిన్పపుడే ఈ పరిహారం అందుతుంది. ఇది ముఖ్యమైన యాడ్-ఆన్ గా మీరు ఎంచుకోవాలి. ఎందుకంటే నష్టం జరిగినప్పుడు ఇది మీకు చాలా డబ్బును ఆదా చేస్తుంది.
- మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టప్రకారం నేరం. ఒకవేళ మీరు ఇలా చేస్తే, బీమా కంపెనీ మీ క్లెయిమ్‌ను తిరస్కరిస్తుంది.
- మీ ప్రైవేటు వాహనాన్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించినప్పుడు
- మీరు పాలసీలో పేర్కొన్న భౌగోళిక పరిధికి వెలుపల వాహనం నడిపినప్పుడు
ఇన్సూరెన్స్ కంపెనీలు ఎప్పుడూ మీ పాలసీని కావాలని రిజెక్ట్ చేయవు. మీరు సరైన సమాచారం ఇస్తే మీ డబ్బు మీ వద్దకే వస్తుంది. అందుకని తప్పకుండా మీరు బీమా పత్రాలను క్షుణ్నంగా పరిశీలించి తగిన సమాచారాన్ని ఇవ్వాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto News, Automobiles, CAR, Car loans, Cars, Insurance