మీరు రెగ్యులర్‌గా రైలులో వెళ్తుంటారా? మీరు వెళ్లే రైలు బోగీ ఏ కలర్లో ఉంటుంది? రైళ్లు బ్లూ, రెడ్, గ్రీన్ కలర్స్‌లో కనిపిస్తుంటాయి. మరి వీటికి అర్థం ఏంటో తెలుసా? ఆసియాలోనే రెండో అతిపెద్ద, ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్ నెట్వర్క్ అయిన భారతీయ రైల్వే (Indian Railways) దేశంలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ రైళ్లను నడుపుతూ ఉంటుంది. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లల్లో ప్రయాణిస్తుంటారు. అయితే రైలు బోగీల రంగులు వేర్వేరుగా ఎందుకు ఉంటాయని ఆలోచించేవారు తక్కువే. రైలు బోగీలు ఆ రైలు మోడల్ని తెలియజేస్తుంటాయి. అందుకే వాటి రంగులు వేర్వేరుగా ఉంటాయి.
ఎక్కువగా రైలు బోగీలు బ్లూ కలర్లో అంటే నీలం రంగులో ఉంటాయి. ఈ బోగీలను ఇంటిగ్రేటెడ్ కోచ్‌లో లేదా ఐసీఎఫ్ కోచ్‌లు అంటారు. ఈ రైళ్ల వేగం గంటకు 70 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఈ బోగీలు మెయిల్ ఎక్స్‌ప్రెస్ లేదా సూపర్‌ఫాస్ట్ రైళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఇనుముతో తయారుచేసిన బోగీలు. ఎయిర్ బ్రేక్‌లతో అమర్చబడి ఉంటాయి.
IRCTC Shri Ramayana Yatra: శ్రీరామ భక్తులకు శుభవార్త... 18 రోజుల పాటు ఐఆర్సీటీసీ శ్రీరామాయణ యాత్ర
ఇక భారతీయ రైల్వే ఎరుపు రంగు కోచ్‌లతో పలు రైళ్లను నడుపుతోంది. ఈ రైలు బోగీలను లింక్ హాఫ్మన్ బుష్ అంటే ఎల్‌హెచ్‌బీ కోచెస్ అంటారు. జర్మనీ నుంచి ఈ బోగీలు 2000 సంవత్సరంలో వచ్చాయి. గతంలో ఈ బోగీలు వేర్వేరు దేశాల్లో తయారయ్యేవి. ప్రస్తుతం పంజాబ్‌లోని కపుర్తలాలో భారతీయ రైల్వే తయారు చేస్తోంది.
ఈ కోచ్‌లో అల్యూమినియంతో తయారవుతాయి. కాబట్టి బరువు తక్కువ. డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఈ రైళ్లు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. బోగీల బరువు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. రాజధాని, శతాబ్ది రైళ్లల్లో ఎల్‌హెచ్‌బీ బోగీలు చూడొచ్చు. ఈ రైళ్లన్నీ ఎక్కువ వేగంతో ప్రయాణించేవే.
PAN Card Rule: పాన్ కార్డ్ ఉన్నవారికి నేటి నుంచి కొత్త రూల్... వివరాలు ఇవ్వాల్సిందే
ఇక గ్రీన్ కలర్ బోగీలు గరీబ్ రథ్ రైళ్లకు కనిపిస్తాయి. మీటర్ గేజ్ రైళ్లకు గోధుమ రంగు బోగీలు ఉంటాయి. నారో గేజ్ రైళ్లు కూడా ఇదే కలర్లో ఉంటాయి. అయితే ప్రస్తుతం భారతదేశంలో నారో గేజ్ రైళ్లు దాదాపుగా లేనట్టే.
రంగులు కాకుండా ఐసీఎఫ్ కోచ్‌ల పైన పలు రంగులతో గీతలు ఉంటాయి. కొన్ని కోచ్‌లలో చివరి విండోను గుర్తించడానికి ఈ గీతల్ని పెయింట్ చేస్తారు. నీలిరంగు రైల్వే కోచ్‌లపై తెల్లటి చారలు కనిపిస్తాయి. అన్ రిజర్వ్డ్ సెకండ్-క్లాస్ బోగీలను గుర్తించడానికి ఇవి ఉంటాయి. ఆకుపచ్చ చారలతో ఉన్న బూడిద రంగు కోచ్‌లు మహిళలకు మాత్రమే అని సూచిస్తాయి.
గ్రే కోచ్‌లపై ఎరుపు గీతలు EMU/MEMU రైళ్లలో ఫస్ట్-క్లాస్ క్యాబిన్లను సూచిస్తాయి. ముంబై లోకల్ రైళ్లకు పశ్చిమ రైల్వే ఇలాగే గీతల్ని ఉపయోగిస్తుంది. రైలుకు సంబంధించిన సమాచారాన్ని ప్రయాణికులు అర్థం చేసుకోవడానికి భారతీయ రైల్వే ఉపయోగించే అనేక గుర్తుల్లో ఈ గీతలు కూడా ఒకటి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railways, IRCTC, Railways, Special Trains