కేంద్ర బడ్జెట్‌ను రూపొందించడంలో కొన్ని సంప్రదాయాలు ఆసక్తికరంగా, ఆశ్చర్యంగా ఉంటాయి. హల్వా కార్యక్రమం, లెదర్ సూట్‌కేస్‌లో బడ్జెట్ తీసుకెళ్లడం, కొన్ని నెలల ముందు నుంచే రహస్యంగా మెయింటైన్ చేయడం అన్నీ ఆశ్చర్యపర్చేవే. బడ్జెట్‌ను రూపొందించే నార్త్ బ్లాక్ వైపు వెళ్లే రోడ్లన్నీ బ్లాక్ చేసేస్తారు. బయటివ్యక్తులెవర్నీ లోపలికి వెళ్లనివ్వరు. మీడియా ప్రతినిధులకు సైతం ఎంట్రీ లేదు. నార్త్‌బ్లాక్‌ని దిగ్బంధం చేస్తారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్‌లో సెక్యూరిటీ సిబ్బంది పహారా ఉంటుంది. ఢిల్లీ పోలీసుల సాయంతో ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘా ఉంటుంది. బడ్జెట్ తయారీలో పాత్రధారులుగా ఉండే అధికారుల గదుల్లోకి ఎవరు వెళ్తున్నారని క్షణక్షణం గమనిస్తుంటారు. ఆర్థిక శాఖలోని అన్ని కంప్యూటర్లకు ఇమెయిల్ వ్యవస్థను నిలిపివేస్తారు.
బడ్జెట్ రూపొందించే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక గణాంకాలన్నింటినీ బ్లూ షీట్‌లో రహస్యంగా ఉంటాయి.ఈ గణాంకాలు మూడో కంటికి కూడా తెలియకుండా జాగ్రత్తపడతారు. కేవలం జాయింట్ సెక్రెటరీ(బడ్జెట్)కి మాత్రమే ఈ సీక్రెట్ పేపర్‌లో ఏం ఉందో తెలుస్తుంది. ఈ గణాంకాలు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆవరణ నుంచి తీసుకెళ్లేందుకు కనీసం ఆర్థిక మంత్రికి కూడా అనుమతి ఉండదు. సరిగ్గా రెండు వారాల ముందు బడ్జెట్ పేపర్స్ ప్రింట్ చేస్తారు. ఇది కూడా రహస్యంగా జరుగుతుంది. నార్త్‌బ్లాక్‌లోని బేస్‌మెంట్‌లో ఈ ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది. ప్రింటింగ్ వ్యవహారాలను చూసే సిబ్బందిని ఇంటికి కూడా వెళ్లనివ్వరు. కంప్యూటర్లపై సైబర్ దాడి చేసి బడ్జెట్ డేటాను కొట్టేయకుండా ఉండేందుకు నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్ సర్వర్ల నుంచి డీలింక్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా బడ్జెట్ డాక్యుమెంట్స్ లీక్ చేస్తే అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద శిక్ష తప్పదు.
ఇప్పటివరకు దాదాపు అన్ని కేంద్ర బడ్జెట్లను రహస్యంగానే రూపొందించారు. 1950లో బడ్జెట్‌లో కొంత భాగం లీకైన తర్వాత ఇంకా కఠినంగా ఉంటున్నారు. అప్పుడు రాష్ట్రపతి భవన్‌లో బడ్జెట్‌ను ప్రింట్ చేసేవాళ్లు. అదే ఏడాది మింటో రోడ్‌లోని ప్రభుత్వ ప్రెస్‌కు మార్చారు. 1980 వరకు బడ్జెట్ పత్రాలు అక్కడే ప్రింట్ అయ్యేవి. ఆ తర్వాత నార్త్ బ్లాక్‌లోని బేస్‌మెంట్‌లో ప్రింటింగ్ చేస్తున్నారు. పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టేవరకు అంతా రహస్యమే. అసలు బడ్జెట్ రూపొందించడాన్ని అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటీ? బడ్జెట్‌లో ఏం ఉంటాయో ముందే ప్రజలకు తెలిస్తే నష్టమేంటీ? అన్న సందేహాలు అందరిలో ఉండేవే.
బడ్జెట్ విషయంలో ఈ స్థాయి రహస్యం అవసరం లేదన్నది నిపుణుల వాదన. గతంలో అంటే పన్నులు బడ్జెట్‌లో భాగంగా ఉండేవి. కానీ ఇప్పుడు జీఎస్‌టీ బడ్జెట్‌లో భాగం కాదు. చాలావరకు దేశాల్లో బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి మూడు నెలల ముందు ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.
Realme C2: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ సీ2... ధర రూ.5,999 మాత్రమే
ఇవి కూడా చదవండి:
PM Kisan Yojana: పీఎం కిసాన్ పథకానికి ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
UPI Apps: గూగుల్ పే, ఫోన్‌పే వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Mobile Insurance: మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ ఎందుకు అవసరమో తెలుసా?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.