Home /News /business /

KNOW WHICH GOVERNMENT SERVICES WILL STOP IF YOU DO NOT LINK YOUR AADHAAR NUMBER TO PAN CARD SS

PAN Card: పాన్ కార్డుపై ఈ ప్రభుత్వ సేవలు లభించవు... ఎందుకంటే

PAN Card: పాన్ కార్డుపై ఈ ప్రభుత్వ సేవలు లభించవు... ఎందుకంటే
(ప్రతీకాత్మక చిత్రం)

PAN Card: పాన్ కార్డుపై ఈ ప్రభుత్వ సేవలు లభించవు... ఎందుకంటే (ప్రతీకాత్మక చిత్రం)

PAN Card | మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఆధార్ నెంబర్ లింక్ చేశారా? పాన్ ఆధార్ లింక్ (PAN Aadhaar Linking) చేయకపోతే కొన్ని ప్రభుత్వ సేవలు పొందలేరు. అవేంటో తెలుసుకోండి.

పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలంటూ ఆదాయపు పన్ను శాఖ అనేకసార్లు గడువు పొడిగించింది. చివరిసారిగా పొడిగించిన గడువు 2022 మార్చి 31న ముగిసింది. అయినా పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ (PAN Aadhaar Linking) చేయనివారు 2023 మార్చి 31 వరకు ఈ పనిచేయొచ్చు. కానీ మొదటి మూడు నెలలు రూ.500, తర్వాత 9 నెలలు రూ.1,000 జరిమానా చెల్లించాలి. అప్పటివరకు పాన్ కార్డు (PAN Card) పనిచేస్తుంది. 2023 మార్చి 31 లోగా కూడా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ (Aadhaar Card) లింక్ చేయకపోతే ఆ పాన్ కార్డ్ ఇనాపరేటీవ్‌గా మారిపోతుంది. అంటే ఆ పాన్ కార్డ్ ఇక చెల్లదు. ఆ పాన్ కార్డును ఎక్కడా లావాదేవీల్లో ఉపయోగించడానికి వీల్లేదు. ఒకవేళ లావాదేవీల్లో పాన్ నెంబర్ ఇచ్చినా ఆ లావాదేవీ చెల్లదు. అంతేకాదు... ప్రభుత్వ సేవలు పొందడానికి కూడా వీల్లేదు.

పాన్ కార్డు హోల్డర్లు 2023 మార్చి 31 లోగా ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే వారికి ఆదాయపు పన్ను రిటర్న్స్, రీఫండ్స్ ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఇప్పటికే వెల్లడించింది. మరి పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసుకోండి.

StandUp India Scheme: ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల వారికి, మహిళలకు రూ.10 లక్షల నుంచి లోన్

1. ఇనాపరేటీవ్ పాన్ ఉపయోగించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడం కుదరదు.

2. పెండింగ్‌లో ఉన్న రిటర్న్స్ ప్రాసెస్ కావు.

3. పెండింగ్‌లో ఉన్న రీఫండ్స్ విడుదల కావు.

4. పాన్ ఇనాపరేటీవ్‌గా మారితే రిటర్న్స్‌లో ఏవైనా తప్పులు ఉన్నా సరిదిద్దుకునే అవకాశం ఉండదు.

5. పాన్ ఇనాపరేటీవ్‌గా మారుతుంది కాబట్టి ఎక్కువగా పన్నులు చెల్లించాలి.

వీటితో పాటు ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ నెంబర్లతో ఉన్న బ్యాంక్ అకౌంట్లు, డీమ్యాట్ అకౌంట్లు, మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్‌లలో సేవల్లో ఇబ్బందులు కూడా కలుగుతాయి. మరి మీరు మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో కావాలి.

Driving License: డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా? ఇలా చేస్తే చలాన్ కట్టాల్సిన అవసరం లేదు

ముందుగా ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ https://www.incometax.gov.in/ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలోనే Link Aadhaar లింక్ పైన క్లిక్ చేయాలి.
మొదట పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
రెండో కాలమ్‌లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు టైప్ చేయాలి.
తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఒకవేళ మీ ఆధార్ కార్డుపై పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే I have only year of birth in Aadhaar card సెలెక్ట్ చేయాలి.
ఆ తర్వాత I agree to validate my Aadhaar details సెలెక్ట్ చేయాలి.
తర్వాత Link Aadhaar క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి Validate పైన క్లిక్ చేయాలి. మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.
ఒకవేళ మీ పాన్, ఆధార్ నెంబర్ ముందే లింక్ అయితే Your PAN is already linked to given Aadhaar అనే మెసేజ్ కనిపిస్తుంది.

2023 మార్చి 31 వరకు పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలంటే రూ.1,000 వరకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Aadhaar Card, AADHAR, PAN card

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు