HOME »NEWS »BUSINESS »know which banks offers more than 8 percent interest rate on fixed deposits ss

Personal Finance: డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే

Personal Finance: డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Fixed Deposit Interest Rates | కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు వడ్డీ తక్కువగా ఇస్తుంటాయి. అయితే మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం బ్యాంకును ఎంచుకునే ముందు ఆ బ్యాంకు ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవడం మంచిది.

  • Share this:
    పెట్టుబడులపై ఎలాంటి రిస్క్ లేకుండా లాభం పొందాలనుకునేవారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి ఆప్షన్. రిస్క్ చాలా తక్కువ. అయితే రిటర్న్స్ కూడా తక్కువే. అయినా తమ డబ్బులు సురక్షితంగా ఉండాలన్న ఆలోచనతో ఎక్కువ మంది బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తుంటారు. అయితే ఇటీవల బ్యాంకులు వడ్డీ రేట్లను బాగా తగ్గిస్తున్నాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాలపైనా వడ్డీ రేట్లు బాగా తగ్గాయి. ఎంత తగ్గాయో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా వడ్డీ రేట్లు తగ్గుతుండటంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఖాతాదారులకు వచ్చే లాభం తగ్గుతుంది. అయితే ఇప్పటికీ కొన్ని బ్యాంకులు 8% కన్నా ఎక్కువ వడ్డీ ఇస్తుంటాయి. ఆ బ్యాంకులు ఏవో తెలుసుకోండి.పెట్టుబడులపై ఎలాంటి రిస్క్ లేకుండా లాభం పొందాలనుకునేవారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి ఆప్షన్. రిస్క్ చాలా తక్కువ. అయితే రిటర్న్స్ కూడా తక్కువే. అయినా తమ డబ్బులు సురక్షితంగా ఉండాలన్న ఆలోచనతో ఎక్కువ మంది బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తుంటారు. అయితే ఇటీవల బ్యాంకులు వడ్డీ రేట్లను బాగా తగ్గిస్తున్నాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాలపైనా వడ్డీ రేట్లు బాగా తగ్గాయి. ఎంత తగ్గాయో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా వడ్డీ రేట్లు తగ్గుతుండటంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఖాతాదారులకు వచ్చే లాభం తగ్గుతుంది. అయితే ఇప్పటికీ కొన్ని బ్యాంకులు 8% కన్నా ఎక్కువ వడ్డీ ఇస్తుంటాయి. ఆ బ్యాంకులు ఏవో తెలుసుకోండి.

    Fincare Small Finance Bank: ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 36 నెలల 1 రోజు నుంచి 42 నెలల వరకు 9.00% నుంచి 9.50%


    Jana Small Finance Bank: జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 1555 రోజులకు 8.25% నుంచి 8.75%
    Utkarsh Small Finance Bank: ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 777 రోజులకు 9.00% నుంచి 9.50%
    Equitas Small Finance Bank: ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 888 రోజులకు 8.25% నుంచి 9.85%
    DCB Bank: డీసీబీ బ్యాంక్‌లో 36 నెలలకు 7.70% నుంచి 8.00%
    IDFC First Bank: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులో 500 రోజులకు 7.50% నుంచి 8.20%
    RBL Bank: ఆర్‌బీఎల్ బ్యాంకులో 24 నెలల నుంచి 36 నెలల డిపాజిట్లకు 7.45% నుంచి 8.00%

    ఇక కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు వడ్డీ తక్కువగా ఇస్తుంటాయి. అయితే మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం బ్యాంకును ఎంచుకునే ముందు ఆ బ్యాంకు ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవడం మంచిది. ఎక్కువ వడ్డీ ఇస్తున్నారని బ్యాంకును సెలెక్ట్ చేసుకోవడం సరైన పద్ధతి కాదు. ఇటీవల యెస్ బ్యాంక్ సంక్షోభం అందరికీ తెలిసిందే. అందుకే బ్యాంకు నిర్వహణలో సమస్యలు ఉంటే ఇలాంటి సంక్షోభాలు రావొచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వం రూ.5,00,000 వరకు డిపాజిట్ ఇన్స్యూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్-DICGC బీమా కవర్ ఇస్తుంది. అంటే ఒక వేళ బ్యాంకు దివాళా తీసినా మీ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో రూ.5,00,000 వరకు ఇన్స్యూరెన్స్ పొందొచ్చు.

    ఇవి కూడా చదవండి:

    Savings Account: ఏ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్‌తో ఎక్కువ లాభం... తెలుసుకోండి

    Moratorium: 3 ఈఎంఐలు వాయిదా వేస్తే 16 ఈఎంఐలు ఎక్కువగా కట్టాలి... ఎందుకంటే

    Aadhaar SMS Services: మీ ఇంట్లోంచే ఈ ఆధార్ సేవలు పొందండి
    Published by:Santhosh Kumar S
    First published:April 10, 2020, 10:32 IST

    टॉप स्टोरीज