డబ్బులు పొదుపు చేయడానికి అనేక మార్గాలున్నాయి. అయితే రిస్క్ లేకుండా చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్లను ఎంచుకుంటారు. వడ్డీ తక్కువైనా పర్లేదు రిస్క్ ఉండదు కదా అన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా రిటైర్ అయిన వాళ్లు వృద్ధాప్యంలో తమకు వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది కదా అని ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు మొగ్గుచూపుతారు. అందుకే బ్యాంకులు పోటీ పడి మరీ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుంటాయి. సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 7-8 శాతం ఉంటాయి. అయితే అంతకన్నా ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఉన్నాయి. మరి మీరు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? మరి ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంకులు ఏవో తెలుసుకోండి.
Read this:
Flipkart Mobiles Bonanza: ఈ 15 స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు

1 ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్
ఇండస్ఇండ్ బ్యాంక్- 8 శాతం
ఆర్బీఎల్ బ్యాంక్- 8 శాతం
లక్ష్మీవిలాస్ బ్యాంక్- 7.6 శాతం
కర్నాటక బ్యాంక్- 7.5 శాతం
సిటీ యూనియన్ బ్యాంక్- 7.35 శాతం
Read this:
మీ అమ్మాయి పెళ్లికి రూ.1 కోటి... సేవింగ్స్‌లో ఏ స్కీమ్ బెటర్?
2 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 8.25 శాతం
ఆర్బీఎల్ బ్యాంక్- 8.05 శాతం
లక్ష్మీవిలాస్ బ్యాంక్- 7.6 శాతం
సౌత్ ఇండియన్ బ్యాంక్- 7.6 శాతం
యాక్సిస్ బ్యాంక్- 7.5 శాతం
Read this:
IRCTC Discount: టికెట్ బుకింగ్‌లో వృద్ధులకు మినహాయింపు... నిబంధనలు ఇవే

3 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 8.5 శాతం
డీసీబీ బ్యాంక్- 8.05 శాతం
ఐడీఎఫ్సీ బ్యాంక్- 8 శాతం
లక్ష్మీవిలాస్ బ్యాంక్- 7.75 శాతం
సౌత్ ఇండియన్ బ్యాంక్- 7.6 శాతం
Read this:
Good News: ప్యాకేజీల ధరలు తగ్గిస్తున్న డిష్‌టీవీ, సన్‌డైరెక్ట్, టాటాస్కై
5 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్
ఐడీఎఫ్సీ బ్యాంక్- 8.25 శాతం
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 8 శాతం
డీసీబీ బ్యాంక్- 7.75 శాతం
లక్ష్మీవిలాస్ బ్యాంక్- 7.75 శాతం
ఆర్బీఎల్ బ్యాంక్- 7.6 శాతం
1 ఏడాది, 2 ఏళ్లు, 3 ఏళ్లు, 5 ఏళ్లు ఇలా మీరు ఎంచుకునే కాలపరిమితిని బట్టి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు మారుతుంటాయి. కాబట్టి మీ ఆర్థిక లక్ష్యాలు, అవసరాలతో పాటు వడ్డీ రేట్లను పరిగణలోకి తీసుకొని ఫిక్స్డ్ డిపాజిట్లలో సేవింగ్స్ చేయడం మంచిది.
Photos: భారత ప్రభుత్వం ఖజానా నింపుతున్న చారిత్రక కట్టడాలు ఇవే...
ఇవి కూడా చదవండి:
Jobs in Amazon: ఆ భాషలు తెలిస్తే అమెజాన్‌లో ఉద్యోగం... రూ.40 వేల జీతం
Whatsapp Ranking: వాట్సప్‌లో ఆకట్టుకోనున్న మరో కొత్త ఫీచర్ 'ర్యాంకింగ్'
Railway Jobs: 1,30,000 రైల్వే ఉద్యోగాలకు ఆర్ఆర్బీ ప్రకటన