IRCTC: ఐఆర్‌సీటీసీ ఫ్లెక్సీ ఫేర్ సిస్టమ్... ఎలా పనిచేస్తుందో తెలుసా?

IRCTC flexi-fare system | టికెట్ బుకింగ్స్ పెరుగుతున్నకొద్దీ బేస్ ఫేర్ పెరుగుతుంది. 50 శాతం టికెట్లు బుక్ అయ్యే వరకు మాత్రమే బేస్ ఫేర్ పెరుగుతుంది.

news18-telugu
Updated: July 21, 2019, 12:59 PM IST
IRCTC: ఐఆర్‌సీటీసీ ఫ్లెక్సీ ఫేర్ సిస్టమ్... ఎలా పనిచేస్తుందో తెలుసా?
IRCTC: ఐఆర్‌సీటీసీ ఫ్లెక్సీ ఫేర్ సిస్టమ్... ఎలా పనిచేస్తుందో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 21, 2019, 12:59 PM IST
రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ధి ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్ లాంటి రైళ్లల్లో టికెట్లు బుక్ చేసేప్పుడు ఫ్లెక్సీ ఫేర్ సిస్టమ్ అని కనిపిస్తూ ఉంటుంది. లగ్జరీ, సూపర్‌ఫాస్ట్ రైలు సర్వీసులకు ఫ్లెక్సీ ఫేర్ సిస్టమ్‌ను అమలు చేస్తోంది భారతీయ రైల్వే. 2016లో ఫ్లెక్సీ ఫేర్ విధానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టింది భారతీయ రైల్వే. దీన్నే డైనమిక్ ప్రైసింగ్ అని అంటారు. టికెట్ల బుకింగ్ పెరుగుతున్నాకొద్దీ టికెట్ ధర కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం 100 పైగా రైళ్లల్లో ఫ్లెక్సీ ఫేర్ సిస్టమ్‌ ఉంది. ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్-CAG రివ్యూ కమిటీ సూచనల మేరకు ఫ్లెక్సీ ఫేర్ సిస్టమ్‌లో కొన్ని మార్పులు చేసింది రైల్వే. 15 ప్రీమియం రైళ్లల్లో ఫ్లెక్సీ ఫేర్ విధానాన్ని తొలగించింది. అంతేకాదు... రద్దీ తక్కువగా ఉండే సమయంలోనూ 32 రైళ్లల్లో ఫ్లెక్సీ ఫేర్ విధానం ఉండదు.

ఫ్లెక్సీ ఫేర్ అమలులో ఉన్న రైళ్లల్లో టికెట్ బుక్ చేయాలనుకుంటే మొదట బేస్ ప్రైస్ ఒకలా ఉంటుంది. 10 శాతం బెర్తులు బుక్ అయిన ప్రతీసారి బేస్ ఫేర్ 10 శాతం పెరుగుతూ ఉంటుంది. అంటే రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ధి ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో మొదటి 10 శాతం టికెట్లు మాత్రమే మీకు అసలు ధరకే టికెట్ లభిస్తుంది. టికెట్ బుకింగ్స్ పెరుగుతున్నకొద్దీ బేస్ ఫేర్ పెరుగుతుంది. 50 శాతం టికెట్లు బుక్ అయ్యే వరకు మాత్రమే బేస్ ఫేర్ పెరుగుతుంది. ఆ తర్వాత 50 శాతం దగ్గర టికెట్ ధర ఎంత ఉందో మిగతా టికెట్లన్నీ అదే ధరకు అమ్ముతుంది రైల్వే. డైనమిక్ ప్రైసింగ్ బేస్ ఫేర్‌కు మాత్రమే ఉంటుంది. రిజర్వేషన్ ఛార్జీలు, కేటరింగ్ ఛార్జీలు, సర్వీస్ ట్యాక్స్ లాంటివన్నీ మామూలుగానే ఉంటాయి.

Realme 3i: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 3ఐ ఎలా ఉందో చూశారా?




ఇవి కూడా చదవండి:

e-PAN Card: ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా...

Shopping Tips: వీకెండ్ షాపింగా? ఈ 9 టిప్స్‌తో డబ్బు ఆదా చేయండి

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి షిమ్లా టూర్ ప్యాకేజీ... వివరాలివే
First published: July 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...