హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF Claim: మీ ఈపీఎఫ్ డబ్బులు క్లెయిమ్ చేసుకోకపోతే ఏమవుతాయో తెలుసా?

EPF Claim: మీ ఈపీఎఫ్ డబ్బులు క్లెయిమ్ చేసుకోకపోతే ఏమవుతాయో తెలుసా?

EPF Claim: మీ ఈపీఎఫ్ డబ్బులు క్లెయిమ్ చేసుకోకపోతే ఏమవుతాయో తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)

EPF Claim: మీ ఈపీఎఫ్ డబ్బులు క్లెయిమ్ చేసుకోకపోతే ఏమవుతాయో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

EPF | ఈపీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్ల నుంచి డబ్బులు క్లెయిమ్ చేసుకోకపోతే ఏమవుతాయో తెలుసా? ఆ డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా?

  మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? తరచూ పాస్‌బుక్ చెక్ చేస్తుంటారా? ఇటీవల టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఈపీఎఫ్ పాస్‌బుక్‌ను వెబ్‌సైట్‌లో చెక్ చేసుకుంటున్నారు. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. చాలామంది ఉద్యోగం మానేసిన తర్వాత అసలు తమ ఈపీఎఫ్ అకౌంట్ గురించి పట్టించుకోరు. అందులో డబ్బులు ఉన్నాయన్న సంగతి కూడా గుర్తుండదు. తరచూ ఉద్యోగాలు మారుతున్నవారు తమ ఈపీఎఫ్ అకౌంట్ల గురించి పట్టించుకోరని ఓ పరిశీలనలో తేలింది. యూనివర్సల్ అకౌంట్ నెంబర్-UAN వచ్చిన తర్వాత కూడా ఈపీఎఫ్ అకౌంట్ల గురించి పట్టించుకోని వారి సంఖ్య ఎక్కువే. పాత అకౌంట్ నుంచి కొత్త అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చన్న విషయం కూడా తెలియదు. దీంతో పాత అకౌంట్‌లోనే డబ్బులు ఉండిపోతాయి. తమకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందన్న విషయం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకపోవడంతో ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ చనిపోయిన తర్వాత వారి అకౌంట్‌లోని డబ్బుల్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు.

  ATM Rules: జూలై 1 నుంచి ఏటీఎం విత్‌డ్రా రూల్స్ మారే ఛాన్స్

  Jio offer: జియో నుంచి డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం... పొందండి ఇలా

  మరి ఇలా క్లెయిమ్ చేసుకోని ఈపీఎఫ్ డబ్బులు ఎక్కడికిపోతాయి? చాలామందికి ఇదే సందేహం ఉంటుంది. 2015 నాటి లెక్కల ప్రకారమే ఈపీఎఫ్ అకౌంట్లలో ఇలా క్లెయిమ్ చేసుకోని డబ్బుల మొత్తం రూ.6,000 కోట్లు ఉంది. ఇలా ఈపీఎఫ్ అకౌంట్లు మాత్రమే కాదు, చిన్న మొత్తాల పొదుపు పథకాలు, ఇన్స్యూరెన్స్ కంపెనీల దగ్గర ఖాతాదారులు క్లెయిమ్ చేసుకోని డబ్బు వేల కోట్లు ఉంది. ఇలా క్లెయిమ్ చేసుకోని డబ్బును తిరిగి ప్రజలకే ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో సీనియర్ సిటిజన్ వెల్‌ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసింది. ఈపీఎఫ్ అకౌంట్‌తో పాటు ఇతర ఏ అకౌంట్ అయినా ఏడేళ్ల పాటు ఇనాపరేటీవ్‌గా ఉంటే అందులోని డబ్బును సీనియర్ సిటిజన్ వెల్‌ఫేర్ ఫండ్‌కు తరలించాలన్న నియమనిబంధనలున్నాయి. ఈపీఎఫ్ అకౌంట్‌లో 36 నెలల పాటు డబ్బులు జమ కాకపోయినా, విత్‌డ్రా చేయకపోయినా ఆ అకౌంట్‌ను ఇనాపరేటీవ్‌గా భావిస్తారు.

  Paytm: డబ్బులు లేవా? అయినా రూ.1,00,000 వరకు షాపింగ్ చేయొచ్చు

  SBI: కరెన్సీ నోట్లు పాడయ్యాయా? ఎస్‌బీఐలో ఫ్రీగా మార్చుకోండి ఇలా

  ఒకవేళ అకౌంట్ ఇనాపరేటీవ్‌గా మారిన ఏడేళ్ల తర్వాత సదరు ఖాతాదారులో లేక వారి కుటుంబ సభ్యులో క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదా అన్న సందేహం రావొచ్చు. సీనియర్ సిటిజన్ వెల్‌ఫేర్ ఫండ్‌కు డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత 25 ఏళ్ల లోపు ఎప్పుడైనా సంబంధిత వ్యక్తులు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఒక అకౌంట్ ఇనాపరేటీవ్‌గా మారిన 32 ఏళ్ల వరకు ఎప్పుడైనా తమ డబ్బులు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Business, BUSINESS NEWS, EPFO, Personal Finance

  ఉత్తమ కథలు