హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF withdrawals: ఈపీఎఫ్‌ నుంచి డబ్బు తీసుకుంటున్నారా? ఒక్క నిమిషం.. ముందు ఈ విషయాలు తెలుసుకోండి

EPF withdrawals: ఈపీఎఫ్‌ నుంచి డబ్బు తీసుకుంటున్నారా? ఒక్క నిమిషం.. ముందు ఈ విషయాలు తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

EPF Withdrawals: రిటైర్మెంట్ లేదా మెచూరిటీ తీరిన తరువాత పీఎఫ్ డబ్బు మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చు. కానీ కొన్ని అత్యవసర ఖర్చుల కోసం ఈపీఎఫ్‌ అకౌంట్ నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. వీటికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలపై ఉద్యోగులు అవగాహన పెంచుకోవాలి.

ఇంకా చదవండి ...

ప్రభుత్వం భద్రత కల్పిస్తున్న పెట్టుబడి మార్గమైన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ఉద్యోగులు మంచి లబ్ధి పొందవచ్చు. మార్కెట్ రిస్క్‌ లేకుండా చేసే పెట్టుబడులో EPF ప్రధానమైంది. దీర్ఘకాలంలో ఈ పెట్టుబడులు మెరుగైన రాబడిని అందిస్తాయి. ఈ పెన్షన్ పథకాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. కొన్ని పరిమితులకు లోబడి ఈపీఎఫ్ నుంచి డబ్బును పాక్షికంగా విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఈ కార్పస్‌లో 100 శాతం విత్ డ్రా చేయడానికి కస్టమర్లకు కనీసం 58 సంవత్సరాలు రావాలి. 57 ఏళ్ల వయసులో కూడా 90 శాతం వరకు పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. రిటైర్మెంట్ లేదా మెచూరిటీ తీరిన తరువాత పీఎఫ్ డబ్బు మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చు. కానీ కొన్ని అత్యవసర ఖర్చుల కోసం ఈపీఎఫ్‌ అకౌంట్ నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. వీటికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలపై ఉద్యోగులు అవగాహన పెంచుకోవాలి.

ఉద్యోగులు తమ పెళ్లి ఖర్చుల కోసం లేదా కుటుంబ సభ్యుల పెళ్లి కోసం పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకు ఎంప్లాయీ కాంట్రిబూషన్ నుంచి సగం వరకు డబ్బు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి వినియోగదారుడు కనీసం 7 సంవత్సరాలు ఉద్యోగం చేయాలనే నిబంధన ఉంది.

వినియోగదారుల మెడికల్ ఖర్చుల కోసం లేదా డిపాజిటరు కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కోసం పీఎఫ్ కార్పస్ నుంచి డబ్బు తీసుకోవచ్చు. ఈ అవసరం కోసం అత్యధికంగా ఆరు నెలల బేసిక్ సాలరీకి సమానమైన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. డీయర్‌నెస్ అలవెన్సులు లేదా ఉద్యోగులకు చెల్లించే వడ్డీలో ఏది తక్కువగా ఉంటే దాన్ని ఆరు నెలల జీతానికి కలపాలి. ఇలా వైద్య ఖర్చుల కోసం ఉద్యోగుల జీతానికి 6 రెట్ల వరకు డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి మినిమం డ్యూరేషన్ ఎంప్లాయిమెంట్ నిబంధనలు కూడా ఉండవు.


కనీసం పది సంవత్సరాల వరకు ఉద్యోగాలు చేసినవారు, తమ హోమ్ లోన్ రీయంబర్స్‌మెంట్ కోసం ఈపీఎఫ్ డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎంప్లాయర్, ఎంప్లాయీ కాంట్రిబూషన్ నుంచి 90 శాతం వరకు డబ్బు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇందుకు సంబంధించిన ఆస్తి ఉద్యోగి పేరుమీద లేదా ఉద్యోగి జీవిత భాగస్వామి పేరుతో ఉమ్మడిగా అయినా నమోదై ఉండాలి. హోమ్ లోన్ రీయంబర్స్‌మెంట్ కోసం ఉద్యోగుల జీతానికి 36 రెట్ల వరకు డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.

ఉద్యోగులు తమ ఉన్నత చదువుల కోసం లేదా పిల్లల ఉన్నత చదువుల కోసం పీఎఫ్‌ అకౌంట్ నుంచి డబ్బు తీసుకోవచ్చు. కార్పస్ ఫండ్ నుంచి 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ ఇందుకు కూడా కనీసం ఏడు సంవత్సరాల వరకు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. పెళ్లి లేదా ఉన్నత చదువుల కోసం అత్యధికంగా 50 శాతం వరకు డబ్బు తీసుకునే అవకాశం ఉంది.

ఇంటి పునర్నిర్మాణం కోసం కూడా పీఎఫ్ నుంచి డబ్బు తీసుకోవచ్చు. ఇందుకు వినియోగదారులు కనీసం 5 సంవత్సరాలు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఇంటి పునర్నిర్మాణం కోసం ఉద్యోగుల జీతానికి 12 రెట్లు విత్ డ్రా చేసుకోవచ్చు. భూమి లేదా ఇతర ఆస్తుల కొనుగోలుకు ఉద్యోగుల జీతానికి 24 రెట్ల వరకు డబ్బును పీఎఫ్‌ కార్పస్ నుంచి తీసుకోవచ్చు.

First published:

Tags: EPFO, Personal Finance

ఉత్తమ కథలు