జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలు చాలావరకు నిర్ధిష్ట కాలపరిమితితో వస్తాయి. ఈ పాలసీల కాంట్రాక్టులను వార్షికంగా రెన్యువల్ చేసుకోవాల్సిన ఉంటుంది. రెన్యువల్ సమయంలో మీరు మీ కాంట్రాక్టును సమీక్షించవచ్చు. తద్వారా మీరు మీ కవర్‌ను అప్‌గ్రేడ్ చేయవచ్చు, అలాగే మెరుగుపరచవచ్చు. మీ మోటారు బీమా పాలసీని రెన్యువల్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలేంటో తెలుసుకుందాం.
*ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV)
మీ మోటారు బీమా పాలసీలోని ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV) అనేది ప్రీమియంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఐడీవీ అనేది పూర్తిగా నష్టపోయినప్పుడు లేదా మీ వాహనం దొంగిలించినప్పుడు మీ బీమా సంస్థ నుంచి మీరు పొందే బీమా మొత్తం లేదా గరిష్ఠ విలువ. రెన్యువల్ సమయంలో మరొక బీమా సంస్థ మీకు తక్కువ ప్రీమియం చెల్లించే అవకాశం ఇవ్వొచ్చు. అయితే ప్రీమియం తగ్గితే ఐడీవీ కూడా తగ్గుతుందనేది మీరు గమనించాలి. అందుకే ఎప్పుడూ కూడా తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది కదా అని ఐడీవీ విషయంలో రాజీ పడకూడదు. తక్కువ ప్రీమియం వల్ల మీ బీమా తగ్గి క్లెయిమ్‌లపై ప్రభావం పడుతుందనేది గుర్తుంచుకోవాలి.
*నో క్లెయిమ్ బోనస్ (NCB)
మీరు మునుపటి పాలసీ వ్యవధిలో ఎలాంటి క్లెయిమ్‌ను దాఖలు చేయనట్లయితే, మీరు నో క్లెయిమ్ బోనస్ పొందేందుకు అర్హత సాధిస్తారు. ప్రతి క్లెయిమ్-ఫ్రీ సంవత్సరానికి మీ బీమా సంస్థ మీకు ఎన్‌సీబీ రివార్డ్ అందిస్తుంది. వరుసగా ఐదేళ్లు పాటు 5 క్లెయిమ్-ఫ్రీలు ఉన్నట్లయితే.. మీరు గరిష్టంగా 50 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఎన్‌సీబీ డిస్కౌంట్ మీ స్వంత నష్టం (Own Damage) ప్రీమియంను గణనీయంగా తగ్గిస్తుంది. కాబట్టి మీరు క్లెయిమ్-ఫ్రీ సంవత్సరాల్లోనే ఎన్‌సీబీని ఎంచుకోవాలి. ఎన్‌సీబీ డిస్కౌంట్ ఓడీ (OD) ప్రీమియంకు మాత్రమే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఓడీ, టీపీ(third party) రెండు ప్రీమియంలను కలిగి ఉన్న మొత్తం ప్రీమియంకు ఇది వర్తించదు.
* యాడ్-ఆన్ ఫీచర్లు
వాహన బీమా అనేది స్టాండర్డ్ కవరేజీ మాత్రమే కాదు మీ వాహనం పూర్తి రక్షణ కోసం అనేక యాడ్-ఆన్‌లను అందిస్తుంది. ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్, జీరో డిప్రిసియేషన్ కవర్, నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ కవర్, రిటర్న్ టు ఇన్‌వాయిస్ కవర్ వంటి కొన్ని యాడ్-ఆన్‌లను జోడించి, మీ మోటారు బీమాను పెంచొచ్చు.
* వాలంటరీ డిడక్టబుల్(Voluntary Deductible)
మీరు మీ వాహన బీమా పాలసీని రెన్యువల్ చేసేటప్పుడు.. వాలంటరీ డిడక్టబుల్ ఫీచర్‌ను ఎంచుకోవచ్చు. క్లెయిమ్ సమయంలో బీమా చేసిన వాలంటీర్లు కొంత మొత్తాన్ని చెల్లించడాన్నే వాలంటరీ డిడక్టబుల్ అంటారు. అయితే వాలంటరీ డిడక్టబుల్ పై క్లెయిమ్ మొత్తం బీమాదారులే చెల్లిస్తారు. పాలసీదారులు తమ వాహనం రిపేర్లకు తమ సొంతంగా కొంత మొత్తాన్ని చెల్లిస్తారు కాబట్టి మోటారు బీమా పాలసీ మొత్తం ప్రీమియం కూడా తగ్గుతుంది.
Toll Tax: రేపటి నుంచి టోల్ టాక్స్ పెంపు.. ఎంతమేర పెరుగుతుందంటే..
Costly Watch: ఇది రూ.164 కోట్ల లగ్జరీ వాచ్... 57 ఎల్లో డైమండ్స్, 76 అరుదైన రత్నాలు
* పోర్టబిలిటీ
మీ మోటారు బీమా రెన్యువల్ గడువు ముగిసినప్పుడు, మీరు మీ పాలసీని వేరొక బీమా సంస్థకు పోర్ట్ చేయవచ్చు. అంటే ఒక బీమా సంస్థ నుంచి మరొకదానికి మారవచ్చు. మెరుగైన సేవ, మెరుగైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ సామర్థ్యం, తక్కువ ప్రీమియం, మెరుగైన కవరేజ్ లేదా యాడ్-ఆన్ కవర్‌లతో కూడిన పాలసీ కోసం బీమా చేసిన వ్యక్తి పోర్టబిలిటీని ఎంచుకోవచ్చు. మీ మోటారు బీమా పాలసీని కొత్త బీమా సంస్థకు పోర్ట్ చేసిన తర్వాత, ప్రస్తుత బీమా పాలసీలో పొందే నో క్లెయిమ్ బోనస్ వంటి ప్రయోజనాలు రెన్యువల్ క్లెయిమ్ ఫ్రీ పాలసీకి అందుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Motor insurance