• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • KNOW THESE TAX ISSUES BEFORE INVESTING IN GOLD AND REAL ESTATE AK GH

Gold Real Estate: బంగారం, రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు.. ఈ పన్నుల గురించి కచ్చితంగా తెలుసుకోండి

Gold Real Estate: బంగారం, రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు.. ఈ పన్నుల గురించి కచ్చితంగా తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

Gold Real Estate: ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం లేదా రియల్ ఎస్టేట్‌ ఆస్తులను సొంత అవసరాలకు వినియోగించుకోవడం తప్ప, వీటిల్లో పెట్టుబడులతో పెద్దగా ఉపయోగం ఉండట్లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

  • Share this:
ఈ రోజుల్లో ఆర్థిక రంగానికి సంబంధించిన అంశాలపై ప్రజలకు అవగాహన పెరుగుతోంది. ఒకప్పుడు పొదుపు, పెట్టుబడులు కొన్ని వర్గాల వారికి మాత్రమే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సామాన్యులు సైతం ఆర్థిక వనరులను దీర్ఘకాలిక అవసరాలకు సమర్థంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి సంప్రదాయ పెట్టుబడులకు భిన్నంగా రియల్ ఎస్టేట్ రంగం, బంగారంలో కూడా ఎక్కువమంది పెట్టుబడులు పెడుతున్నారు. భారత్‌లో రియల్ ఎస్టేట్ రంగం, బంగారంలో పెట్టుబడులు కొన్ని సంవత్సరాల వరకు మంచి రాబడిని అందించాయి. కానీ గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి మందగించింది. దీంతో వీటి నుంచి రాబడి కూడా తగ్గింది. మరోవైపు బంగారంలో పెట్టుబడులు కూడా అనుకున్నంత లాభాలను తీసుకురావట్లేదు.

బంగారం రేట్లలో హెచ్చుతగ్గుల వల్ల దీర్ఘకాలంలో వీటిల్లో పెట్టుబడులతో అనుకున్నంత రాబడి రావట్లేదు. ఈ లావాదేవీలకు అయ్యే ట్రాన్సాక్షన్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటోంది. ఇవన్నీ లాభాలపై ప్రభావం చూపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం లేదా రియల్ ఎస్టేట్‌ ఆస్తులను సొంత అవసరాలకు వినియోగించుకోవడం తప్ప, వీటిల్లో పెట్టుబడులతో పెద్దగా ఉపయోగం ఉండట్లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వీటిలో పెట్టుబడులను తగ్గించాలనుకునేవారు, వీటిపై వర్తించే ట్యాక్స్ రేట్ల గురించి తెలుసుకోవాలి. ఈ రెండు విభాగాల్లో పెట్టుబడులు ఆపేయాలనుకునేవారు షార్ట్‌ టర్మ్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై ట్యాక్స్ చెల్లించాలి.

ఎంత ట్యాక్స్ ఉంటుంది?
ఫిజికల్ గోల్డ్‌లో మూడేళ్లకు మించి పెట్టుబడులను కొనసాగిస్తే... అవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ల కిందకు వస్తాయి. బంగారంలో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై సాధారణ ట్యాక్స్ స్లాబ్ రేటు ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై 20.8 శాతం ట్యాక్స్ చెల్లించాలి. లిస్టెడ్ గోల్డ్ బాండ్స్‌లో ఒక సంవత్సరం కంటే ఎక్కువ గడువుతో చేసే ఇన్వెస్ట్‌మెంట్లు, అన్ లిస్టెడ్ గోల్డ్ బాండ్స్‌లో మూడేళ్లకు మించి చేసే పెట్టుబడులు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ల కిందకు వస్తాయి. వీటినుంచి వచ్చే వడ్డీపై, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై సాధారణ స్లాబ్ రేట్ ప్రకారమే ట్యాక్స్ వర్తిస్తుంది. కానీ లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై 20.8 శాతం ట్యాక్స్ ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో రెండేళ్లకు మించి చేసే పెట్టుబడులు దీర్ఘకాలిక పెట్టుబడుల కిందకు వస్తాయి. ఈ విభాగంలో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై స్లాబ్ రేట్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై 20.8 శాతం ట్యాక్స్ ఉంది. కాస్ట్ ఇన్‌ఫ్లేషన్ ఇండెక్స్ ప్రకారం లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై ట్యాక్స్‌ను లెక్కించాల్సి ఉంటుంది.
Published by:Kishore Akkaladevi
First published:

అగ్ర కథనాలు