Bike insurance: బైక్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా ? ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

Bike Insurance: ద్విచక్ర వాహనాలకు ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలను నిపుణులు సూచిస్తున్నారు.

  • Share this:
కొత్త మోటార్ వెహికిల్ చట్టంలో వాహనాలకు తప్పకుండా ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఉంది. దీంతో ద్విచక్ర వాహనాలకు ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం బైక్‌ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. వీరందరికీ డీలర్‌షిప్‌లలో ఇన్సూరెన్స్ ప్రాధాన్యం గురించి వివరిస్తున్నారు. అనుకోని ప్రమాదాలు ఎదురైనప్పుడు ఈ ఇన్సూరెన్స్ పాలసీ రక్షణనిస్తుంది. కొత్తగా బైక్ కొనేవారు దానికి తప్పకుండా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇలాంటప్పుడు థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ తీసుకోవాలా లేదా అనే అంశంపై లబ్ధిదారులు అవగాహన పెంచుకోవాలి. ద్విచక్ర వాహనాలకు ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలను నిపుణులు సూచిస్తున్నారు.

* అందుబాటులో ఉన్న ఇన్సూరెన్స్‌లను పోల్చి చూడటం
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీలపై ద్విచక్ర వాహనదారులు అవగాహన పెంచుకోవాలి. పాలసీ తీసుకోవడానికి ముందు వీటికి సంబంధించిన ఫీచర్లు, ధరలను పోల్చి చూడాలి.
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌లో.. పాలసీ తీసుకున్న వాహనం కారణంగా జరిగిన ప్రమాదానికి సంబంధించిన నష్టాలను ఇన్సూరెన్స్ ద్వారా పొందవచ్చు. చట్టప్రకారం ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలి. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీలో యాడ్ ఆన్‌ ఫీచర్లు ఉంటాయి. దీని ద్వారా ఇన్సూరెన్స్ పరిధిని పెంచుకోవచ్చు.

* యాడ్ ఆన్ పాలసీలు
కాంప్రహెన్సివ్ పాలసీ పరిధి పరిమితంగా ఉంటుంది. దీన్ని ఎంచుకున్నవారు అన్ని ప్రమాదాలకు ఇన్సూరెన్స్ కవరేజీని పొందలేరు. వీరు అదనంగా యాడ్ ఆన్ పాలసీలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బైక్ యజమానుల అవసరాలు విభిన్నంగా ఉంటాయి. అందువల్ల అవసరాలను బట్టి వీటిని ఎంచుకోవాలి. ఒక కాంప్రహెన్సివ్ పాలసీకి యాడ్ ఆన్ పాలసీలను జోడించడం ద్వారా ఇన్సూరెన్స్ కవరేజీ పెరుగుతుంది. ఇదే సమయంలో పాలసీ ప్రీమియం కూడా పెరుగుతుంది. అందువల్ల తగిన యాడ్ ఆన్‌లను కస్టమర్లు ఎంచుకోవాలి. జీరో డిప్రిసియేషన్, పిలియన్ రైడర్ కవర్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ మొదలైనవి ఈ విభాగంలో ఉంటాయి.

* IDV విలువ
ఇన్సూరెన్స్ కంపెనీలు ద్విచక్ర వాహనాల ప్రస్తుత మార్కెట్ విలువను ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూగా (IDV) గుర్తిస్తాయి. ఒకవేళ బైక్ దొంగతనానికి గురైనా, ప్రమాదంలో బైక్ ఉపయోగానికి పనికిరాకుండా నిర్వీర్యమైనా.. IDV విలువను మాత్రమే లబ్ధిదారులు పొందుతారు. ఇన్సూరెన్స్ ప్రీమియంపై IDV ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అందువల్ల ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలోనే ఈ విలువలు కచ్చితంగా ప్రకటించాలి. దీనికి ఒక సూత్రం కూడా ఉంది.
IDV = (తయారీదారుడు పేర్కొన్న లిస్టింగ్ ధర – తరుగుదల) + (యాక్ససరీలు – తరుగుదల)

* డిడక్టబుల్స్ (తగ్గింపులు లేదా మినహాయంపులు)
వెహికిల్ ఇన్సూరెన్స్‌ క్లెయిం సెటిల్‌మెంట్‌లో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా ఇన్సూరెన్స్‌లో కంపల్సరీ (తప్పనిసరి), వాలంటరీ (స్వచ్చంద) డిడక్టబుల్స్ ఉంటాయి. వాలంటరీ డిడక్టబుల్స్‌ పెంచితే.. ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గుతుంది. కానీ క్లెయిం సెటిల్‌మెంట్ విలువ తగ్గుతుంది. తక్కువ ప్రీమియం చెల్లించడం వల్ల క్లెయిం అమౌంట్ తగ్గుతుంది.

* ఇన్సూరెన్స్ పొందడం
మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలను కస్టమర్లు ఎంచుకోవాలి. క్లెయిం సెటిల్‌మెంట్ నిష్పత్తి ఆధారంగా కంపెనీని ఎంచుకోవాలి. ఇంటర్నెట్‌లో వెతకడం, యూజర్ రివ్యూలు, రేటింగులను పరిశీలించడం ద్వారా మంచి కంపెనీలను కస్టమర్లు ఎంచుకోవచ్చు. బైక్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక సంవత్సరం వరకు అమలులో ఉంటుంది. ఆ తరువాత క్రమం తప్పకుండా పాలసీని రెన్యువల్ చేయడం ద్వారా వినియోగదారులు మెరుగైన సేవలను పొందవచ్చు.
First published: