Cash Transaction: నగదు చెల్లింపులు చేస్తున్నారా?.. పరిమితికి మించి చేస్తే ఐటీ శాఖ నుంచి నోటీసులు

ప్రతీకాత్మక చిత్రం

ఇన్​కమ్​ టాక్స్​ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఒకేసారి రూ.2 లక్షలకు మించిన నగదు లావాదేవీలు నిర్వహించకూడదు.

  • Share this:
దేశంలో డిజిటల్​ ట్రాన్సాక్షన్స్​ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే నగదు చెల్లింపులను తగ్గించేందుకు ఇన్​కమ్​ టాక్స్​ నిబంధనలు కఠినతరం చేసింది. పరిమితికి మించి నగదు లావాదేవీలు నిర్వహిస్తే నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐటీ విభాగం నోటీసులు జారీ చేస్తుంది. అంతేకాక, వారికి చట్టప్రకారం జరిమానా విధిస్తుంది. ఇన్​కమ్​ టాక్స్​ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఒకేసారి రూ.2 లక్షలకు మించిన నగదు లావాదేవీలు నిర్వహించకూడదు. సందర్భం ఏదైనా సరే నగదు రూపంలో చెల్లించాల్సిన మొత్తం రూ.2 లక్షలకు మించకూడదు. అయితే, కరోనా కారణంగా ఈ పరిమితిని సడలించింది. అత్యవసర సేవలకు చెల్లించే మొత్తం రూ.2 లక్షలకు మించినా పర్వాలేదని తెలిపింది.

ఏప్రిల్​ 1 నుంచి మే 30 మధ్య కాలంలో కరోనా చికిత్సకు ఆసుపత్రిల్లో చెల్లించే నగదుపై ఈ సడలింపు ఇచ్చింది. ఇటువంటి సందర్భాల్లో రోగి ఆధార్, పాన్ కాపీని తీసుకోవాలని ఆసుపత్రులను ఆదేశించింది. బిల్​ చెల్లించే వ్యక్తికి రోగికి ఉన్న సంబంధాన్ని కూడా పేర్కొనాలని స్పష్టం చేసింది. మిగతా పేమెంట్ల విషయంలో కఠినమైన నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. ఉదాహరణకు, ఒక వ్యక్తి రూ. 3 లక్షల విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేశాడనుకుందాం. ఈ సందర్భంలో ఆభరణాల కొనుగోలు ధర, ఆదాయపు పన్ను విభాగం అనుమతించిన పరిమితికి మించి ఉంది. కనుక, కొనుగోలుదారుడు నగదు రూపంలో కాకుండా చెక్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా చెల్లించాలి.

ఒకవేళ, మీరు మీ బంధువులు లేదా స్నేహితుల నుండి డబ్బును అప్పుగా స్వీకరిస్తున్నప్పటికీ ఈ నియమం వర్తిస్తుంది. ఒక వ్యక్తి నుండి ఒకే రోజులో రూ .2 లక్షలకు మించి నగదును స్వీకరించకూడదని ఐటీ విభాగం చెబుతుంది. ఒకవేళ, అలా చేస్తే ఆ లావాదేవీకి సరైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఐటీ శాఖ మీకు జరిమానా విధిస్తుంది. ఎటువంటి నగదు లావాదేవీలపై ఐటీ విభాగం నోటీసులు జరీ చేస్తుందో తెలుసుకుందాం.

వ్యాపార వ్యయంపై నగదు పరిమితి
వాణిజ్య సంస్థలు సైతం పెద్ద మొత్తంలో నగదు రూపంలో చెల్లింపులు చేయరాదు లేదా అంగీకరించరాదు. ఒక వ్యాపార యజమాని గరిష్టంగా రూ.10,000 కంటే ఎక్కువ నగదుతో లావాదేవీలు చేస్తే.. ఆ ఖర్చులను క్లెయిమ్​ చేసుకునే అవకాశం ఉండదు.

టాక్స్​ సేవింగ్​ ఇన్​స్ట్రుమెంట్​
టాక్స్​ ప్లానింగ్​ విషయంలో ప్రజలు అవగాహన పెంచుకోవాలి. హెల్త్​ ఇన్సూరెన్స్​ పేమెంట్లను నగదు రూపంలో చెల్లించకూడదు. బీమా ప్రీమియాన్ని నగదు రూపంలో చెల్లిస్తే సెక్షన్ 80 డి కింద పన్ను ప్రయోజనాలు లభించవు. ఈ చెల్లింపులు ఖచ్చితంగా బ్యాంకింగ్​ వ్యవస్థల ద్వారానే జరగాలని నియమం ఉంది. నిర్థేశించిన పరిమితికి మించిన లావాదేవీలను నగదు రూపంలో స్వీకరించేందుకు సంస్థలు అనుమతించకూడదు. ఈ బాధ్యత సంస్థలపైనే ఉంటుంది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించిన సందర్భంలో ఆదాయపు పన్ను విభాగం ఆ సంస్థకు జరిమానా విధిస్తుంది.

అప్పులు, ప్రాపర్టీ చెల్లింపులు
ఒక వ్యక్తి ఏదైనా సంస్థ లేదా స్నేహితుడి నుండి నగదు రూపంలో అప్పు తీసుకుంటే, ఆ మొత్తం రూ .20,000 మించకూడదు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలోనూ ఇదే నియమం వర్తిస్తుంది. రూ.20,000 మించిన లోన్​ రీపేమెంట్​ మొత్తాన్ని బ్యాంకుల ద్వారా మాత్రమే చెల్లించాలనే నిబంధన ఉంది. ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకం సమయంలో చేసే లావాదేవీలు కూడా రూ .20,000 మించి నగదు రూపంలో చేయరాదు. ప్రాపర్టీ అమ్మే వ్యక్తి రూ.20,000కు మించి నగదు రూపంలో అడ్వాన్స్​ తీసుకోకూడదు.
Published by:Sumanth Kanukula
First published: