హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tata Stocks: అత్యుత్తమ రాబడిని అందించిన టాటా గ్రూప్ స్టాక్స్ ఇవే...ఓ లుక్కేయండి...

Tata Stocks: అత్యుత్తమ రాబడిని అందించిన టాటా గ్రూప్ స్టాక్స్ ఇవే...ఓ లుక్కేయండి...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

స్టాక్ మార్కెట్‌లో రాబడి పరంగా చూస్తే కింద పేర్కొన్న టాటా గ్రూప్ కంపెనీలు చక్కటి రాబడిని అందించాయి. టాటా గ్రూప్‌లో అత్యుత్తమ రాబడి ఇస్తున్న టాప్ 5 కంపెనీలు ఏవి, అవి ఎంత రిటర్న్ ఇచ్చాయో తెలుసుకుందాం.

దేశంలో చాలా పెద్ద పారిశ్రామిక సంస్థలు ఉన్నప్పటికీ, టాటా గ్రూప్ రూటే సెపరేటు. ఈ ఇండస్ట్రియల్ హౌస్ ప్రతిష్టకు ప్రపంచంలో పేరెన్నికగన్న కార్పోరేట్ కంపెనీల్లో ఒకటి. మరోవైపు, చూస్తే, స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేసిన టాటా గ్రూప్‌కు చెందిన చాలా కంపెనీలు ఉన్నాయి. వాటి సంఖ్య దాదాపు డజనుకు పైగా ఉంది. అయితే స్టాక్ మార్కెట్‌లో రాబడి పరంగా చూస్తే కింద పేర్కొన్న టాటా గ్రూప్ కంపెనీలు చక్కటి రాబడిని అందించాయి. టాటా గ్రూప్‌లో అత్యుత్తమ రాబడి ఇస్తున్న టాప్ 5 కంపెనీలు ఏవి, అవి ఎంత రిటర్న్ ఇచ్చాయో  తెలుసుకుందాం.

టాటా పవర్ (Tata Power)

ఈ స్టాక్ 2021లో టాటా పవర్ కంపెనీ అద్భుతమైన రాబడిని ఇచ్చింది. ఈ ఏడాది కాలంలో ఈ స్టాక్ రూ.75 నుంచి రూ.260కి చేరింది. తర్వాత కాస్త తగ్గినప్పటికీ. కానీ ఇప్పటికీ ప్రస్తుత రేటు ప్రకారం దాదాపు 200 శాతం రాబడిని ఇస్తోంది.

టాటా మోటార్స్ (Tata Motors)

మరో టాటా గ్రూప్ కంపెనీ టాటా మోటార్స్. ఈ కంపెనీ 2021లో కూడా గొప్ప రాబడిని ఇచ్చింది. ఈ ఏడాది ఈ స్టాక్ రూ.185 నుంచి రూ.530కి చేరింది. అయితే ప్రస్తుతం ఈ షేరు గరిష్ట స్థాయిల కంటే కాస్త దిగువన ట్రేడవుతోంది. అయినప్పటికీ, ఈ స్టాక్ నేటి రేటు ప్రకారం దాదాపు 150 శాతం రాబడిని ఇస్తోంది.

టాటా అలెక్సీ (Tata Elxsi)

టాటా గ్రూప్‌లోని మరో గొప్ప కంపెనీ టాటా అలెక్సీ. ఈ కంపెనీ 2021లో కూడా గొప్ప రాబడిని ఇచ్చింది. ఇది టాటా గ్రూప్‌కు చెందిన మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ. టాటా అలెక్సీ షేర్ రేటు ఈ ఏడాది రూ.1870 స్థాయి నుంచి రూ.6595 స్థాయికి పెరిగింది. అదే సమయంలో, ఈ స్టాక్ నేటి రేటు ప్రకారం దాదాపు 190 శాతం రాబడిని ఇస్తోంది.

నెల్కో (Nelco)

టాటా గ్రూప్‌లోని మరో గొప్ప కంపెనీ నెల్కో. నెల్కో స్టాక్ కూడా 2021లో చాలా మంచి రాబడిని ఇచ్చింది. ఈ ఏడాది ఈ కంపెనీ షేర్ రేటు రూ.200 నుంచి రూ.960కి చేరింది. మరోవైపు నేటి రేటు ప్రకారం చూసినా ఈ స్టాక్ 250 శాతం రాబడిని ఇస్తోంది.

టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర),  Tata Teleservices (Maharashtra)

టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) టాటా గ్రూప్‌కు చెందిన పెద్ద కంపెనీ కానప్పటికీ, ఈ కంపెనీ రికార్డ్ బ్రేకింగ్ రిటర్న్స్ ఇచ్చింది. 2021లో టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) ధర రూ. 7.85 స్థాయి నుండి రూ. 189.10 స్థాయికి చేరుకుంది. మరోవైపు నేటి షేర్ రేటు చూసినా ఈ స్టాక్ 2000 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. టాటా గ్రూప్ గత ఏడాది తన మొబైల్ వ్యాపారాన్ని ఎయిర్‌టెల్‌కు విక్రయించింది. దీని తర్వాత కూడా, టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) స్టాక్ బుల్లిష్‌గా ఉంది. కంపెనీ ఇప్పుడు టాటా గ్రూప్‌కు చెందిన ఇతర వ్యాపారాలను కూడా పరిశీలిస్తోంది.

First published:

Tags: Tata Group

ఉత్తమ కథలు